అమరావతి, చైతన్యరథం: సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి, పంచాయతీ రాజ్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసిన జగన్‌రెడ్డికి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని, అందుకు వైసీపీ సర్పంచులంతా కదలి రావాలని, తమతో చేతులు కలపా లని టీడీపీరాష్ట్ర అధ్యక్షుడు అచ్ఛెన్నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం మంగళగిరి లోని సికె కన్వెక్షన్ సెంటర్‌లో పంచాయతీ తోనే ప్రగతి అనే రాష్ట్ర స్థాయిలో సదస్సు లో ఆయన మాట్లాడాతూ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వేల కోట్ల నిధు లను జగన్‌రెడ్డి ఒక గజదొంగ మాదిరి దోచుకెళ్లాడని, సర్పంచ్‌లు అప్పులు చేసి గ్రామాభివృద్ధి పనులు చేయాల్సి వస్తోందని అన్నారు. కానీ 2014`19 మధ్య కాలం లో సర్పంచ్‌లకు స్వర్ణయుగం లాంటిదని, గ్రామాల్లో రోడ్లు, మంచినీటి సదుపాయా లు, పారిశుద్ద్యం, చెత్త నుండి సంపదను తయారు చేయడం ఇలా అనేక కార్యక్రమా లు సర్పంచ్‌ల ఆధ్వరంలో చంద్రబాబు ప్రభుత్వ హాయంలో నడిచాయని గుర్తు చేశారు. చంద్రబాబు మీటింగ్‌ల్లో పార్టీలకు అతీతంగా చంద్రబాబు సర్పంచ్‌లను తన పక్కనే కూర్చొచెట్టుకునేవాడని తెలిపారు. ప్రస్తుతం సర్పంచ్‌లకు విలువ లేదని, వారి ని ఉత్సవ విగ్రహాలుగా మార్చారని అన్నా రు. జగన్‌రెడ్డి నిర్ణయాలను వైసీపీ సర్పం చ్‌లే ఛీకొడుతున్నారని, సర్పంచ్‌లకు ఇంకా రెండేళ్ల సమయం మిగిలిఉందని,వారి భవి ష్యత్ కోసం వైసీపీ సర్పంచ్‌లంతా టీడీపీతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు.
పంచాయతీలను ధ్వంసం చేసిన జగన్‌రెడ్డి : రాజేంద్ర ప్రసాద్
జగన్‌రెడ్డి తన పాలనలో పంచా యతీరాజ్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశాడని, పంచాయతీలకు ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేయలేదని పంచాయతీరాజ్ ఛాంబర్స్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘రాష్ట్రం ప్రభుత్వం ఇవ్వాల్సిన అన్ని రకాల నిధులను గత మూడు సంవత్సారలుగా ఇవ్వటం లేదు. అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదనే చందంగా ఉంది జగన్ రెడ్డి తీరు. రూ.8,600 కోట్లు జగన్ రడ్డి దొంగలించాడు. ఉపాధి హామీ నిధులను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మాకు రావాల్సిన అన్ని రకాల నిధులను ఇచ్చి గ్రామాల అభివృద్ధికి సహకరించారు. రాష్ట్రంలో కూలి పనిచేసుకొని బ్రతకటానికి కూడా పనులులేవు. దాదాపు రూ.24,000 కోట్ల ఉపాధి హామీ నిధులను దొంగలిం చాడు. రావాల్సిన బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మాహత్య చేసుకుంటున్నారు. అధికార పార్టీనే దానికి ప్రేరేపిస్తుంది. రాజ్యాంగం ప్రకారం ఏ సంక్షేమమైనా గ్రామ సర్పంచు ల ఆధ్వర్యంలో జరగాలి, కానీ జగన్ రెడ్డి జెట్‌పీటీసీలకు, ఎంపీటిసిలకు, సర్పంచుల కు సంబంధం లేకుండా వాలంటీర్లను పెట్టుకొని చేయించుకుంటున్నాడు. పంచా యితీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. సర్పంచులను డమ్మీలను చేశాడు. సర్పం చులకు చంద్రబాబు న్యాయం చేశాడు. సర్పంచులకు చంద్రబాబు అధికారాలి చ్చారు. ఏ రోజు ఎప్పుడు ఏమడిగినా సరే చంద్రబాబు చేశారు. వేతనాలు పెంచింది చంద్రబాబు. వాలంటీర్ల కంటే మా వేతనాలు తక్కువ. వర్షంలో అర్థరాత్రి ఓ సమస్యపై చంద్రబాబు ఇంటికి 500మంది సర్పంచులతో వెలితేఆయన బయటికి వచ్చి సమస్య పరిష్కారంచేశారు. అమెరికా అధ్య క్షుడు గేటు పట్టుకొని ఫొటో దిగాను కానీ జగన్‌రెడ్డి ఇంటి రోడ్డులో కూడా వెళ్ళకూ డదని కండీషన్ పెట్టాడు. అధికా రమున్నా లేకున్నా చంద్రబాబుతోనే ఉన్నాం. ఏ పార్టీ చేయనన్ని పనులు చంద్రబాబు సర్పంచు లకు చేశారు. అందరం కలిసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి అహ ర్నిశలు కష్టపడుదాము. చంద్రబాబు రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి. ఎవ్వరు భయపడకండి’’ అని పేర్కొన్నారు.