చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

కల్తీ నెయ్యిపై లఘు చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

by చైతన్యరధం
Feb 25, 2026 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • భాష, కులం, ప్రాంతాలకు అతీతంగా జరగాలి
  • లేదంటే.. ఆ పరంపర కొనసాగే ప్రమాదముంది
  • ప్రణాళికబద్ధంగా శ్రీవారి మహా ప్రసాదంపై కుట్ర
  • జంతువుల కొవ్వు కలిసిందన్నది ఎన్‌డిడిబి నివేదికే
  • నెయ్యిలో అసలు నెయ్యే లేదని సిట్ సైతం తేల్చింది
  • పాలు లేకుండా నెయ్యి తయారు చేసే ఘనాపాటీలు వాళ్లు
  • అరాచకాల్లోనూ నూతన ఆవిష్కరణల ఘనత వాళ్లది
  • లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడడం తీవ్రమైన నేరం
  • గత టీటీడీ బోర్డు, వెనకేసుకొస్తున్నవారే పాపానికి బాధ్యులు
  • మహాపచారానికి పాల్పడిన వారికి శిక్ష పడి తీరాలి
  • కల్తీ నెయ్యిపై లఘు చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అమరావతి (చైతన్య రథం): “భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం అత్యంత తీవ్రమైన నేరం. ఈ నేరానికి పాల్పడిన బాధ్యులకు శిక్ష పడాలి. కేసులో దోషులను కూటమి ప్రభుత్వం కచ్చితంగా శిక్షిస్తుంద”ని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర జరిగిందన్నారు. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు నివేదికలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెబితే, సీబీఐ నేతృత్వంలోని సిట్ చేపట్టిన విచారణలో నెయ్యిలో అసలు నెయ్యే లేదని తేల్చిందన్నారు. పామాయిల్, ఇతర రసాయనాలు కలిపి తయారు చేసినట్టు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఇది శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేయడమేనన్నారు. అరాచకాల్లోనూ నూతన ఆవిష్కరణలు చేసిన ఘనత గత పాలకులకే దక్కుతుందనీ, పాలనుంచి కాకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేయొచ్చని వారు చేసి చూపారని ఎద్దేవా చేశారు. జరిగిన తప్పునకు గత టీటీడీ పాలక మండలిదే బాధ్యతనీ, అలాంటి వారిని వెనకేసుకొస్తున్న గత ప్రభుత్వంలోని ముఖ్యమైన వ్యక్తి కూడా బాధ్యత వహించాలన్నారు. హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు భాష, కులాలు, ప్రాంతాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించకపోతే ఇలాంటి పరంపరలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. మంగళవారం శాసన సభలో తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై జరిగిన చర్చలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీకి 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వాడారని సిట్ విచారణలో తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఎన్డీఏ శాసన సభ్యుల సమావేశంలో ముఖ్యమంత్రి గత ప్రభుత్వ అరాచకాలను వివరిస్తున్న క్రమంలో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక కూడా చదివాను. అప్పటికే పలు సందర్భాల్లో భక్తులు లడ్డూలో నాణ్యత లేదని చెప్పారు. సున్నితమైన వ్యవహారంలో రాజకీయ ఆరోపణలు చేయకూడదని అనుకున్నాం. వారి పాలనలో దేవాలయాలపై దాడులు జరిగినా దోషుల్ని పట్టుకోవాలని చెప్పాం. అయితే గత పాలకులు అస్సలు నెయ్యిలో కల్తీయే జరగలేదని చెబుతుంటే ఆ వ్యవహారంపై వివరణ ఇవ్వాలనిపించింది. గతంలో తిరుమల వెళ్లిన సందర్భంలోనూ చాలామంది ప్రసాదం నాణ్యత అంశాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. తప్పు జరిగిందని తెలిసి దాన్ని సరిగా ముందుకు తీసుకువెళ్లకపోతే ఎలా అన్న పశ్చాత్తాపంతో దీక్ష చేశాను. ఎన్‌డిడిబి నివేదిక నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిశాయని చెబితే అదే అంశాన్ని ట్వీట్ చేశాను. అప్పుడే దేవాలయాల పరిరక్షణకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందనిపించింది. మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఆ నెయ్యిలో అస్సలు నెయ్యే లేదని చెప్పారు.

జరిగిన తప్పుకి గత పాలక మండలే జవాబుదారీ
“సభ సాక్షిగా చెబుతున్నా, ఈ వ్యవహారంలో గత ప్రభుత్వం తాలూకు వ్యక్తులు చేశారని ఎక్కడా చెప్పలేదు. ఈ తప్పుకి గత టీటీడీ పాలక మండలిదే బాధ్యత. గత ప్రభుత్వం నియమించిన పాలక మండలి చేసిన తప్పుకి వారే జవాబుదారీ అని చెప్పాను. ఈ వ్యవహారంపై ఎవరైనా నిష్పక్షపాతంగా కమిటీ వేసి బాధ్యులను శిక్షించాలని చెప్పాలి. కానీ వారు ఎందుకు వెనకేసుకొస్తున్నారో అర్థం కావడం లేదు. తిరుపతి లడ్డూ గురించి ఇంత సభా సమయాన్ని ఎందుకు వృథా చేయాలి. కల్తీ జరిగింది. చర్యలు తీసుకోండి అంటే తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది. అస్సలు కల్తీయే జరగలేదు. జంతువుల కొవ్వు లేదు అని మాట్లాడడమే ఇంత చర్చకు దారితీసింది” అన్నారు.
నిబంధనలు మార్చి… నచ్చిన సంస్థలకు కాంట్రాక్టులు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న కేసు దర్యాప్తు చేసిన సీబీఐ నేతృత్వంలోని సిట్ ఆ నెయ్యి తయారీకి ఒక్క లీటరు పాలు కూడా వినియోగించలేదని తేల్చింది. పామాయిల్లో రసాయనాలు కలిపి తయారు చేసినట్టు చెప్పింది. ఆ ఇతర రసాయనాలు ఏ మూలకాల నుంచి తయారయ్యాయో నిర్థారించే సాంకేతికత తమా వద్ద లేదని ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ కేసులో 36 మందిని నిందితులుగా తేల్చింది. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ఒక ప్రణాళికాబద్దంగా కుట్ర జరిగినట్టు సిట్ చెప్పింది. తమకి నచ్చిన సంస్థలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఓ ప్రణాళిక ప్రకారం టెండర్ నిబంధనలు సవరించారు. నెయ్యి సరఫరా సంస్థకి ఉండాల్సిన కనీస వార్షిక టర్నోవర్ రూ.250 కోట్ల నుంచి రూ. 150 కోట్లకి తగ్గించారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాలను సేకరించాలన్న నిబంధనను తొలగించారు. డెయిరీ రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలన్న నియమాన్ని ఏడాదికి కుదించారు. రోజుకి 12 టన్నుల వెన్న తయారు చేయాలన్న నిబంధనను 8 టన్నులుగా మార్చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 19-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

11 కోట్లమందికి కల్తీ నెయ్యి లడ్డూలు పంపిణీ
“సవరణ అనంతరం వాళ్ళు ఎంపిక చేసిన సంస్థలు 2020-2023 మధ్య నెయ్యి సరఫరా చేశాయి. నెయ్యి సరఫరా చేసిన సంస్థకి అందుకు కావాల్సిన కనీస అర్హతలు లేవని సిట్ ఛార్జ్ షీట్ చెప్పింది. వీరు నెయ్యి సరఫరాకి ఎంచుకున్న భోలే బాబా అనుబంధ సంస్థలు మాల్ గంగా, వైష్ణవి డెయిరీలు ఒక్క లీటరు నెయ్యిని కూడా పాల నుంచి తయారు చేయలేదు. 2019-2024 మధ్య కాలంలో సుమారు 11 కోట్లమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే, ఆ కాలంలో మొత్తం 48.76 కోట్ల లడ్డూ ప్రసాదాల విక్రయం జరిగింది. అందులో సుమారు 20.10 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని టీటీడీ రికార్డులు చెబుతున్నాయి. ఆ 11 కోట్ల మందికి రసాయనాలతో నిండిన ప్రసాదాన్ని విక్రయించారు. ఇందులో నుంచే లక్ష లడ్డూలు ఆయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా పంపిణీ చేశారు. మళ్లీ ఆ లడ్డూలు కల్తీ నెయ్యితో చేసినవి కాదు అంటారు. సిట్ రిపోర్టు నెయ్యిలో రసాయనాలు ఉన్నాయని చెప్పింది. ఆ రసాయనాల్లో ఏముందో పెరుమాళ్లకెరుక. హిందూ ధర్మానికి కాకుండా ఇంకా ఏ ధర్మానికి ఇలాంటిది జరిగినా దేశం మొత్తం గగ్గోలు పెట్టేసేవారు. మన దేశంలో ప్రతి హిందువు దర్గాకి వెళ్తారు. సకల ధర్మాలను గౌరవించడం మన దేశం తాలూకు మూల సంస్కృతి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామికి పెట్టిన ప్రసాదాన్ని అపవిత్రం చేసి తప్పు లేదని మాట్లాడుతున్నారు. ఇలాగే ఇస్లాం, క్రిస్టియానిటీల్లో జరిగితే పరిస్థితులు ఇలా ఉండేవి కావు. ఇతర మతాల గురించి మాట్లాడితే ఓట్లు పోతాయి. హిందువుల గురించి మాట్లాడడం తేలిక అన్న పద్దతిలో మార్పు రావాలి” అని ఉప ముఖ్యమంత్రి పవన్ పేర్కొన్నారు.

రాజుకోసం వసూలు చేసేవారు.. భగవంతుడి సేవకు అనర్హులు
కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నప్పుడు తప్పు చేశామన్న అపరాధ భావన వాళ్ళకు కలిగి తీరుతుంది. ఇన్ని తప్పులు చేసిన వారిని వెనకేసుకుని వచ్చే వారికి ఆ పాపం చుట్టుకుని తీరుతుంది. వైసీపీలు కేసుని సాగదీసే కొద్దీ వాళ్ల పాపం పెరుగుతుంది” అని డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించారు.

Previous Post

బొత్స వ్యాఖ్యలు అభ్యంతరకరం

Next Post

కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026

కార్యకర్త
@ March 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 19-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-03-2026

కార్యకర్త
@ March 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

కార్యకర్త
@ March 18, 2026
ధన్యావాదాలు మోడీజీ!
ఆంధ్రప్రదేశ్

ధన్యావాదాలు మోడీజీ!

చైతన్యరధం
@ March 18, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

‘మీ సేవానిరతి అనన్య సామాన్యం’

చైతన్యరధం
@ March 18, 2026
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

చైతన్యరధం
@ March 18, 2026
లోకేష్.. ఆకస్మిక తనిఖీ!
ఆంధ్రప్రదేశ్

లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

చైతన్యరధం
@ March 18, 2026
నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’
ఆంధ్రప్రదేశ్

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

చైతన్యరధం
@ March 18, 2026
Load More

ముఖ్య వార్తలు

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

చైతన్యరధం
@ March 18, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ధన్యావాదాలు మోడీజీ!

ధన్యావాదాలు మోడీజీ!

చైతన్యరధం
@ March 18, 2026
రాష్ట్రానికే గర్వకారణం

‘మీ సేవానిరతి అనన్య సామాన్యం’

చైతన్యరధం
@ March 18, 2026
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

చైతన్యరధం
@ March 18, 2026
లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

చైతన్యరధం
@ March 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist