- అక్కడే చర్చిద్దామంటూ వైసీపీకి మంత్రి కొల్లు రవీంద్ర సవాల్
- క్రికెట్ చూడ్డానికి సొంత డబ్బుతో వెళ్తే మీకేంటి నొప్పి?
- పేదల సొమ్ముతో జగన్ జల్సాలు జనానికి తెలియనివా?
- పేర్ని నానిని బందరులో పిచ్చి కుక్కలూ పట్టించుకోవు
- లోకేశ్, చంద్రబాబుపై అడ్డగోలుగా వాగితే ఉపేక్షించేది లేదని వార్నింగ్
అమరావతి (చైతన్య రథం): “ప్రజలు చిత్తుగా ఓడించినా, వారి అరాచకాలన్నీ చూసి ప్రజలు చీదరించుకుంటున్నా.. ఇంకా వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారు. బందరులో పిచ్చికుక్క కరిచిన పేర్ని నాని ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదు. ఏదో ఒకటివాగి సోషల్ మీడియాలో హడావుడి చేయడం తప్ప.. చేసిందేమీ లేదు. నారా లోకేశ్, నారా చంద్రబాబు గురించి మాట్లాడే కనీస అర్హత కూడా పేర్ని నానికి లేదు. ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా భయపడి పారిపోయిన వ్యక్తి పేర్ని నాని. కొడుకుని నిలబెడితే 50 వేల భారీ తేడాతో ఓడించారు. బందరు ప్రజలు కాదు కదా.. అక్కడి పిచ్చి కుక్కలు కూడా పేర్ని నానిని పట్టించుకోవు” అని గనుల మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“నారా లోకేశ్‌కు క్రికెట్ అంటే ఇష్టం. లైవ్ మ్యాచ్ చూడ్డానికి సొంత ఖర్చులతో వెళ్లారు. అందులో తప్పేంటి? అదేమైనా మీలా గంట, అరగంట, సుకన్య అనేలాంటి దిక్కుమాలిన కార్యక్రమాలు కాదు కదా? క్రికెట్ బెట్టింగులో, పేకాట క్లబ్బులో కాదు కదా? బోర్డింగ్ పాసులు చూపించాలని అడగడానికి సిగ్గనిపించడం లేదా?” అంటూ దుమ్మెత్తిపోశారు. గూగుల్ సంస్థను దేశంలో ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా ఏపీకి తీసుకొచ్చిన వ్యక్తి నారా లోకేశ్ అని, అలాంటి వ్యక్తి గురించి, వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. తిరుపతి లడ్డూలో చేయాల్సిన ఘోరాలన్నీ చేశారు. మీరు పొర్లు దండాలు పెట్టినా, ఆ పాపంనుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని మంత్రి రవీంద్ర హెచ్చరించారు.
“పేదలకు చెందిన 8000 బస్తాల బియ్యాన్ని పందికొక్కులా బొక్కేసి, డబ్బులు కట్టేశాను కదా అని చెప్పిన నీకు లోకేశ్ గురించి మాట్లాడే అర్హత ఉందా? అని నానిని నిలదీశారు. గత ఐదేళ్లలో సుమారు రూ.250 కోట్ల ప్రజాధనాన్ని జగన్ సొంత పర్యటనలకు వాడుకున్నట్టు ఆర్టీఐ సమాచారం చెప్తోందని, వ్యక్తిగత పర్యటనల పేరిట లండన్ పర్యటనలన్నీ ప్రజల సొమ్ముతోనే చేసిన విషయం మర్చిపోతే ఎలాగని ప్రశ్నించారు. “2019-20లో రూ.31.43 కోట్లు, 2020-21లో రూ.43 కోట్లు, 2021-22లో రూ.49.45 కోట్లు, 2022-23లో రూ.47.18 కోట్లు, 2023-24లో రూ.50 కోట్లు మొత్తంగా రూ.222.85 కోట్లు విదేశీ పర్యటనల పేరుతో ఖర్చు చేశారు. ఫిక్సిడ్ వింగ్ విమాన సంస్థకు రూ.112.50 కోట్లు, హెలికాప్టర్ రైడ్లకు రూ.87.02 కోట్లు చొప్పున ఖర్చు చేశారు. తాడేపల్లి నుండి తెనాలి వెళ్లడానికి కూడా హెలికాప్టర్ వాడినోళ్లు.. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు” అంటూ మంత్రి రవీంద్ర ఎద్దేవా చేశారు. “68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని వినియోగించి 20 కోట్లకు పైగా లడ్డూలు తయారు చేసి స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఆ తప్పుని కప్పిపుచ్చడానికి హెరిటేజ్‌పై విమర్శలకు దిగి.. కోర్టులో మొట్టికాయలు తిన్నారు.
బిల్ గేట్స్ ఏపీకి రావడాన్నీ విమర్శిస్తున్నారంటే.. మీ బుర్రలు పనిచేస్తున్నాయో లేదో అర్ధం కావడం లేదు. పాతికేళ్ల క్రితం బిల్ గేట్స్ రాకతో హైదరాబాద్ ఏస్థాయిలో అభివృద్ధి చెందిందో అంతా చూశాం. ఇప్పుడు గేట్స్ సంస్థ రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయంలో సహకారం అందించేందుకు ముందుకొస్తే.. విమర్శలు చేస్తారా?” అంటూ మంత్రి రవీంద్ర ధ్వజమెత్తారు. “వైసీపీ సాగించిన విధ్వంసంనుంచి కూటమి ప్రభుత్వం వికాసానికి నడిపిస్తుంటే.. చూసి ఓర్వ లేక కుట్రలు చేస్తున్నారు. కుల మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా గెలిపించిన ప్రజల్ని మోసం చేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచిస్తోంది. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని తపిస్తున్నాం. జగన్‌రెడ్డికి వెంకటేశ్వర స్వామిపై నమ్మకం లేదు. అన్యమతస్తుడని ఒప్పుకున్నాడు. అలాంటి వ్యక్తికి వెంకన్న గురించి మాట్లాడే కనీస అర్హత లేదు” అని కొల్లు రవీంద్ర వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.














