- వైసీపీ రాజకీయ విమర్శలకు ధీటుగా బదులివ్వాల్సిందే
- క్యాబినెట్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
- సమావేశంలో అమరావతి, పోలవరం, కేంద్ర నిధులపై చర్చ
- పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఆమోదం
- గతంలో చెప్పిన విధంగానే ప్రాజెక్టు ఎత్తుకు కట్టుబడి తీర్మానం
- నిధుల కేటాయింపుపై కేంద్రానికి అభినందన
అమరావతి(చైతన్యరథం): ఎవ్వరూ తగ్గొద్దు.. అస్సలు తగ్గొద్దంటే తగ్గొద్దు..గట్టిగా ఇచ్చి పడేయండి..వైసీపీ రాజకీయ విమర్శలకు మంత్రులందరూ ధీటుగా బదులిచ్చి తీరాల్సిం దేనని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గురువారం అసెంబ్లీ సమావే శాల్లో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత సచివాలయంలో మంత్రులతో క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రకటించిన నిధులు, పోల వరం, అమరావతి.. వైసీపీ విమర్శలపై చర్చించారు.
ఎవ్వరూ వెనుకడుగు వేయొద్దు…స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి
కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పనిగట్టుకుని మరీ వైసీపీ విమర్శలు దుష్ప్రచారం మొదలెట్టింది. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని, శాంతి భద్రతలు అదుపు తప్పాయని గల్లీ మొదలుకుని ఢల్లీి వరకూ జగన్‌్‌రెడ్డి అండ్ కో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే.. అదంతా అక్షరాలా తప్పు అనే విషయాన్ని ఇప్పటికే తిప్పికొట్టిన మంత్రులు, ఆఖరికి వైసీపీ హయాంలో జరిగిన నేరాలు, ఘోరాలు.. కేసులపై కూడా మొత్తమ్మీద శాంతి భద్రతలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. అందుకే ఇకపై వైసీపీ నుంచి ఎవరు విమర్శలు చేసినా ధీటుగా ఎదుర్కొని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి తీరా ల్సిందేనని మంత్రులకు సీఎం సూచించారు. ఈ విషయంలో ఎక్కడా ఎవరూ వెనకడుగు వేయొద్దని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. క్లియర్ కట్‌గా సబ్జెక్టుతోనే మీడియా ఎలాంటి ప్రశ్నలు అడిగినా సరే తడబడకుండా మాట్లాడేలా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఆమోదం
క్యాబినెట్ మీటింగ్‌లో పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణంపై కూడా చర్చించారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త డయా ఫ్రం వాల్ నిర్మాణం కోసం ఢల్లీిలో ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు పెట్టనున్నారు. నీతి ఆయోగ్‌లో ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తప్పనిసరి కావటంతో ఏపీ క్యాబినెట్‌లో అందుకు సంబంధించిన అంశాలపైనా చర్చించారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా గతంలో నిర్దేశించిన దానికే కట్టుబడి ఉండేలా చూడాలని తీర్మానించింది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత తామే తీసుకుంటామని కేంద్రం చెప్పడంపైనా కేంద్రాన్ని అభినందిస్తూ తీర్మానం చేశారు. దీంతోపాటు బడ్జెట్‌లో ఏపీకి అధిక ప్రాధాన్యం ఇవ్వటంపైనా, అమరావతికి కేటాయించిన నిధులపైనా కేంద్రాన్ని అభినందిస్తూ తీర్మానించింది. కేంద్ర నిధుల విషయంలో మంత్రులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. మొత్తానికి ఇకపై వైసీపీ నుంచి ఎలాంటి విమ ర్శలు వచ్చినా అంతకు రెట్టింపుగానే కౌంటర్ ఎటాక్ ఉండబోతోంది.