- సెప్టెంబరు 9న బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాం
- ఐదేళ్లు జగన్‌రెడ్డి ఒక ఉగ్రవాదిలా రాష్ట్రాన్ని పాలించాడు
- ఆయన వికృతానందం కోసం ఎంతకైనా దిగజారతాడు
- స్కిల్ కేసులో 30 పైసల అవినీతిని కూడా చూపించలేదు
- నేడు బెంగళూరులో కూర్చుని పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు
- వరద బాధితులకు సాయం చేయకపోగా పిచ్చి ప్రేలాపనలు
- చంద్రబాబు చొరవ వల్లే విరాళాలు వరదలా వస్తున్నాయి
మంగళగిరి(చైతన్యరథం): జగన్‌రెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మాన ప్రాణాలనైనా తీస్తాడు..తన వికృతానందం కోసం ఎంతకైనా దిగజారుతాడు..అందులో భాగంగానే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టించి 53 రోజులు జైలులో పెట్టించాడు..ఆ చీకటి రోజుకు ఏడాది అయిన సందర్భంగా సెప్టెంబరు 9న బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి సోమవారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాల యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఐదేళ్లు టెర్రరిస్టులా జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించాడని ధ్వజమెత్తారు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉండి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుబడిన వ్యక్తి చంద్రబాబుపై స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఎందుకు పెట్టారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. మొదట రూ.3 వేల కోట్ల అవినీతి చెప్పి చివరకు 30 పైసలు కూడా తేల్చలేకపోయారన్నారు. అమరావతిని నిర్మించి అభివృద్ధిలో దేశం తలెత్తుకునేలా చేయాలని చూసిన చంద్రబాబుకు మంచి పేరు వస్తుందనే కుట్రకు తెరతీసి అరెస్టు చేశారని మండిపడ్డారు. గత ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనలో ల్యాండ్, వైన్, మైన్, శాండ్ ఇలా దేనిని వదలకుండా దోచుకున్నారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు. ఎక్కడ చూసినా అరాచకాలే. వైసీపీలో జరిగిన తప్పిదాలను పరిష్కరించి భూ తగాదాలను పరిష్కరించేందుకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను పెట్టేందుకు నిర్ణయించినట్టు చెప్పారు.
చెప్పిన హామీలు అమలు చేస్తున్నాం
నాల్గోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ప్రజలు సంతోషంగా ఉన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలు తప్పకుండా అమలు చేస్తున్నాం. ఏ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు లో అయితే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారో అదే స్కిల్ డెవలప్‌మెంట్‌తో ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇచ్చేలా స్కిల్ సెన్సెన్‌కు కేబినెట్‌లో ఆమోదం తెలిపారు. వరదలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి ప్రజలను కాపాడిన ఘనత చంద్రబాబుదే. ప్రజలకు సంక్షేమ పథకాలు నూటికి నూరుశాతం అందేలా మేము పనిచేస్తాం. మా పాలనలో ఎక్కడా కక్షలకు కార్పణ్యాలకు చోటు ఉండదు. జగన్ రెడ్డి పాలనలో ప్రతిపక్షాన్నే లేకుండా చేయాలని చూశారు. ఇప్పుడు మేము స్నేహ హస్తం ఇస్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఏ విధమైన సంక్షేమ ఫలాలు అవసర మో వాటన్నింటిని అందిస్తాం.
ఇప్పటికైనా మనిషిగా మారు జగన్‌రెడ్డి
ముఖ్యమంత్రి హోదా కోల్పోయి మూడునెలలు కాకముందే ప్రజలను విడిచిపెట్టి బెంగ ళూరుకు మకాం మార్చిన వ్యక్తి జగన్‌రెడ్డి. వరద బాధితులు కష్టాల్లో ఉంటే నామమాత్రపు పర్యటనలు చేసి జగన్ రెడ్డి.. వాగులు, వంకలు, స్పిల్ వేకు, గేట్లకు కూడా తేడా తెలియ కుండా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరాన్ని ఏ విధంగా నాశనం చేశారో అందరికీ తెలుసు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ విధమైన అవగాహన లేకుండా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్‌రెడ్డికే దక్కుతుంది. 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు తీర్పు ఇచ్చారు. జగన్‌కు ఇప్పటికైనా సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల కోసం పనిచేయాలని హితవుపలికారు. లేకుంటే ఆ 11 సీట్లలో ఒకటే మిగులుతుందని ఎద్దేవా చేశారు. ఇప్ప టికైనా జగన్ మనిషిగా మారాలి. ఇలాంటి విపత్తులు గతంలో వచ్చినప్పుడు కేంద్రం నుంచి ఒక్క నాయకుడినైనా మీరు తీసుకవచ్చారా? అని ప్రశ్నించారు. దేశమంతా నేడు ఏపీ వైపు చూస్తున్నారు.. కేంద్రమంత్రులు వచ్చి పరిశీలించి వెళుతున్నారు. ప్రతిఒక్కరూ సంఫీుభావం తెలుపుతూ మేము సైతం అంటూ వందలాది కోట్లు విరాళం ఇస్తున్నారు. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు అబద్ధపు నిందలు వేయడం తప్ప మీకు ఏమి చేతగాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మీకు ఓట్లు వేసిన ప్రజల కోసం పనిచేసి మీ ఉనికి కాపాడు కోవాలని హితవుపలికారు.