అమరావతి : ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన జగన్రెడ్డి, ప్రశ్నించిన టీడీపీ నేతలపై పెద్దఎత్తున అక్రమ కేసులు నమోదు చేయించడం దుర్మార్గమైన చర్యగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తక్షణమే అక్రమ కేసులను ఉపసంహరించు కోవాలని బుధవారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతు లను ఆదుకోవాల్సిన జగన్రెడ్డి, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ప్రతిపక్ష టీడీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయించడాన్ని తీవ్రంగా ఖండిరచారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో టీడీపీ నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, వెంకట శివరామరాజు, పత్తి పాటి పుల్లారావుతో పాటు మరో 400 మందిపై నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే ఉప సంహరించుకోవాలన్నారు.ఆక్వాకు మద్దతు ధరపై మంత్రుల కమిటీ మొదట నిర్ణయించిన రూ.240 నుంచి తమ లూటీ కోసం రూ.210కి కుదించడం జగన్రెడ్డి అసమర్థతకు నిదర్శనంగా పేర్కొన్నారు. ఆక్వా రైతుల సమస్యలపై శాంతియుతంగా పోరా టం చేసిన టీడీపీ నేతలను అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేయడం అప్రజాస్వామిక విధా నాలకు నిదర్శనమన్నారు.చంద్రబాబు హయాంలో దేశంలోనే అగ్రభాగాన ఉన్న ఆక్వారంగం నేడు జగన్ రెడ్డి పాలనలో పతనావస్థకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. మద్దతు ధర లభించక ఆక్వా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షరతుల పేరుతో సబ్సీడీలు ఎత్తివేసి, జే ట్యాక్స్ తో ఆక్వా రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. ప్రశ్నించిన వారిని అణచివేయాలనే కుట్రలు సాగబోవని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.