- వైసీపీ ప్రభుత్వ దుర్మార్గానికి దాడులే నిదర్శనం
- జగన్‌రెడ్డి దారుణాలకు, రాక్షసత్వానికి అంతేలేదు
అమరావతి: తనకు రావాలసిన బకాయిలు ఇవ్వలేదని నిరసన తెలిపిన దళితుడైన ప్రకాష్ పై తప్పు డు కేసులు బనాయించి, ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారని, ఇది జగన్‌రెడ్డి దుర్మార్గానికి నిదర్శనమని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన జూమ్ సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కానిస్టేబుల్ ప్రకాష్ ను డిస్మిస్ చేయడం చాలా బాధాకరమన్నారు. దళితుడైన ప్రకాష్ మీద జగన్‌రెడ్డి ప్రభుత్వం కక్షగట్టి ఉద్యోగం నుంచి తొలగించడం అప్రజాస్వామికం, అమానవీయం అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాన ప్రతిపక్షపార్టీ టీడీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి న్యాయ బద్ధంగా రావాల్సిన బకాయిల గురించి ప్రశ్నించకూడదా అని అడిగారు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించడం క్షమార్హం కాదన్నారు. ఇటువంటి ప్రభు త్వానికి సరైన సమయంలో ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. దళితుల ఓట్లను దండుకుని ముఖ్యమం త్రి అయిన జగన్మోహన్‌రెడ్డి దళితుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు నోటితో పలకరించి నొసటితో వెక్కిరిం చినట్లుందన్నారు.
లక్ష్మి అనే మహిళ వద్ద దళిత కానిస్టేబుల్ ప్రకాష్ డబ్బు తీసుకుని చంపడానికి ప్రయత్నించారని ప్రభుత్వం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతనిని ఉద్యోగం నుంచి తప్పించేందుకు అనేక అభాండాలు మోపారన్నా రు.నిజానికి లక్ష్మీ ప్రకాష్‌పై ఏ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. వారంతటవారే సుమోటోగా తీసుకుని అతన్ని దండిరచడానికి పన్నాగం పన్ని కక్షపూరితంగా వ్యవహరిం చడం ప్రభుత్వం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్నారు.
అదే జిల్లాలో ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో కాల్ మాట్లాడి మహిళని వేధించడాన్ని ప్రజలందరూ చూశా రని,ఆ ఎంపీకి రాచమర్యాదలు చేసి ఊరిగింపులు చేశా రని, న్యాయం బద్ధంగా రావాల్సిన బకాయిలు అడిగిన వ్యక్తిని డిస్మిస్ చేశారని, ఇదెక్కడి న్యాయమని అడిగారు. పొరపాటున జగన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చి తప్పుచేశామని దళితులు మదనపడుతున్నారని చెప్పారు. కరోనా సమయంలో మాస్కులు అడిగిన సుధాకర్‌ను వేధించి చంపేశారని,ప్రశ్నించిన డాక్టర్ అనితారాణి పట్ల వైసీపీ నేతలు అసభ్యంగా ప్రవర్తించారని,జడ్జి రామకృష్ణపై దేశద్రోహం నేరం మోపి జైలుకి పంపించి హింసించారని ధ్వజమెత్తారు. ఇసుక గురించి ప్రశ్నించిన వరప్రసాద్ అనే వ్యక్తిని శిరోముండనం చేసి అనేకరకాలుగా ఇబ్బం దులకు గురిచేశారని, ఈ విషయమై సాక్షాత్తు రాష్ట్రపతి కార్యాలయం స్పందించినా నేటికీ చర్యలు లేవన్నారు. చిత్తూరు జిల్లాలో నాసిరకం మద్యం విషయమై ప్రశ్నించిన ఓంప్రతాప్ అనే దళితుడిపై జగన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహించారని చెప్పారు. మాస్కు పెట్టుకోనందుకు చీరాలలో కిరణ్‌కుమార్‌ని పోలీసులు కొట్టి చంపారని మండిపడ్డారు.
జగన్‌రెడ్డి దుర్మార్గాలకు, దారుణాలకు, రాక్షసత్వా నికి అంతులేకుండా పోయిందన్నారు. దళితులకు, పేదలకు అందే పథకాలను అందకుండా చేసి ద్రోహం చేసిన రాజ్యాంగ వ్యతిరేకి జగన్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు. కానిస్టేబుల్ ప్రకాష్‌కు న్యాయం జరిగేవరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అతనిపై తప్పుడు కేసులు బనాయించిన ఉన్నత అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రకాష్‌కు జరిగిన అమానవీయ సంఘటనలు మరొకరికి జరగకుండా తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు.