హైకోర్టుకు వెళతామని వెల్లడి, సీబీఐ విచారణకు డిమాండ్
తిరుపతి: సిలికా అక్రమ తవ్వకాల వెనుక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హస్తం ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. సిలికా అక్రమ తవ్వకాలపై శనివారం తిరుపతి కలెక్టర్ వెంకట రమణారెడ్డికి సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై 15 రోజుల్లో హైకోర్టుకు వెళ్తామని చెప్పారు. దోచుకొని దాచుకున్న వారిని వదిలిపెట్టేది లేదు. ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే సిలికా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై 15 రోజుల్లో హైకోర్టుకు వెళ్తామని చెప్పారు. దోచుకొని దాచుకుంటున్న వారిని వదిలిపెట్టేది లేదు. ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే సిలికా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చట్టాలు వైసీపీ పెద్దల కాళ్ల కింద నలిగిపోతున్నాయి. చిల్లకూరు, కోట మండలాల పరిధిలో సిలికా మైనింగ్ ముసుగులో జరుగుతున్న అక్రమాలతో వేల కోట్ల దోపిడీ జరుగుతోంది. ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్న సిలికాలో అధికారిక లెక్కల్లో సగమే చూపి జీఎస్టీ ఎగ్గొడుతున్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మైనింగ్ చేస్తూ, కాలువలతో సహా ఎత్తేస్తుంటే ప్రభుత్వ శాఖల అధికారులు ఏం చేస్తున్నారు. ఎవరు ఆక్షేపణ చెప్పలేని విధంగా జీపీఎస్ తో సహా పక్కా ఆధారాలను ఈ రోజు కలెక్టర్ కు సమర్పించాం. ఢల్లీిలో రూ.300 కోట్ల లిక్కర్ స్కామ్ అని డిప్యూటీ సీఎంను కూడా నెలల తరబడి జైల్లో పెట్టారు. ఇక్కడ రూ.3 వేలు కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల దోపిడీ జరుగుతుంటే సీబీఐ, ఈడీలకు కనిపించడం లేదా? సామాన్యుడు తన ఇంటి అవసరాలకు ఒక ట్రక్కు ఇసుక తీసుకెళితే సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు. ఇక్కడ మాత్రం వేల కోట్ల దోపిడీ చేసుకోండని వైసీపీ నాయకులకు లైసెన్సులిచ్చేశారు. ఈ దోపిడీపై కేంద్రంలోని అన్ని దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయబోతున్నాం. 15 రోజుల్లో స్పందించకపోతే హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తాం. ఈ దోపిడీపై తాడోపేడో తేల్చుకుంటాం. మైనింగ్ లీజుదారులతో పాటు భూములు కలిగిన పేద రైతుల నోళ్లు కొట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మరోవైపు గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో క్వార్ట్జ్ మైనింగ్ లోనూ దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. సీఎం జగన్ రెడ్డి ఇంటికి వాటా వెళుతుండటంతో ఇక్కడ ఏం జరుగుతున్నా ఆయన చూసీచూడనట్టున్నారు. కోర్టును ఆశ్రయించి ఈ అక్రమాలన్నింటిపై సీబీఐ విచారణ జరపాలని కోరబోతున్నాం. ఈ ప్రక్రియ ఆలస్యమైతే మా ప్రభుత్వం రాగానే విచారణ జరిపి అక్రమంగా దోచేసిన ప్రతి రూపాయిని కక్కిస్తామని సోమిరెడ్డి స్పష్టం చేశారు.