- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రతి ట్వీట్
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి విద్యామంత్రిగా కట్టుబడి ఉన్నానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఒక మంత్రిగా తానెంత చేయగలనో అంతా చేస్తానని భరోసానిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను పంచుకోవడానికి చాలామంది విద్యార్థులు లోకేష్‌ను ట్యాగ్ చేశారు. దీనిపై ప్రతి ట్వీట్ చేస్తూ.. 2024-25 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేరుగా కళాశాలల బ్యాంకు ఖాతాలకు జమవుతుంది. గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ.3.5వేల కోట్లనూ దశలవారీగా క్లియర్ చేస్తాం. ఈలోగా విద్యార్థులకు సమస్య తలెత్తకుండా.. సర్టిఫికెట్లు మరియు ఇతర అవసరమైన పత్రాల జారీతో సహా విద్యార్థుల సమస్యలను ముందుగానే పరిష్కరించడానికి ప్రభుత్వం కళాశాలలతో కలిసి పని చేస్తుంది’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నాను’ అని లోకేష్ ప్రతి ట్వీట్ చేశారు.