- వైసీపీ పాశవిక పాలనపై ప్రజలు యుద్ధం చేసి గెలిచారు
- 2024 ఎన్నికలు ఓ స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తు చేశాయి
- పదవులు, అధికారం శాశ్వతం కాదు..మీ ప్రేమాభిమానాలే శాశ్వతం
- నారాయణపురం తండా మహిళలతో ముఖాముఖిలో భువనమ్మ వ్యాఖ్యలు
రామకుప్పం, నారాయణపురం తండా(చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత ఐదేళ్లలో నరరూప రాక్షసులను చూశారని, రాక్షసుల చేతిలో నలిగిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా 3వ రోజు గురువారం రామకుప్పం మండలం, నారాయణపురం తండాలో భువనేశ్వరి పర్యటించారు. మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో భువనమ్మ మాట్లాడుతూ వైసీపీ నాయకులు గత ఐదేళ్లలో తమ జేబులు నింపుకునేందుకే పనిచేశారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు వైసీపీ నేతలు ద్రోహం చేశారు..అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలపై ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలను వైసీపీ పాలనలో ఊచకోత కోశారు, అక్రమ కేసులతో జైళ్లలో మగ్గబెట్టారు. చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేయాలా అని ఆలోచిస్తారు..కానీ గత పాలకులు ఎలా దోచుకోవాలి అనే ఆలోచించారు…అందుకే 2024 ఎన్నికల్లో వారిని చిత్తు చిత్తుగా ఓడిరచారు.
2024 ఎన్నికలు ఓ స్వాతంత్య్ర సంగ్రామాన్ని తలపించేలా జరిగాయి…ఈ సంగ్రామంలో రాష్ట్ర ప్రజలు ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలనను అంతం చేశారు. వైసీపీ పాలన ముగిసేనాటికి రాష్ట్ర ఖజానాలో పైసా కూడా మిగల్చలేదు…అప్పులు మిగిల్చి వెళ్లారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా చంద్రబాబు పెన్షన్లను పెంచి, ఇంటింటికీ అందేలా చర్యలు తీసుకున్నారు. లక్షలాది మంది మొఖాల్లో చిరునవ్వు చూశారు. రాష్ట్ర ప్రజల కోసం ఇంకా ఏమేమి చేయాలో అని చంద్రబాబు కష్టపడుతున్నారు. వైసీపీ పాలనకు సంబంధించిన ఏ ఫైల్ ముట్టుకున్నా అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే మరో 5నెలలు పట్టేలా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాలి. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తారు. పదవులు, అధికారం శాశ్వతం కాదు…మీ ప్రేమాభిమానాలే ముఖ్యం…మీ సంక్షేమం, అభివృద్ధే మాకు ముఖ్యమని భువనేశ్వరి స్పష్టం చేశారు.