- దేశంలోనే రెండో స్థానం
- లోక్‌సభ సాక్షిగా వివరాలు వెల్లడిరచిన కేంద్ర హోంశాఖ
- 75 ఏళ్ల వృద్ధురాలిపై గంజాయి మత్తులో అత్యాచారం
- అలస్యంగా వెలుగులోకి వచ్చిన పాశవిక ఘటన
- వారం గడిచినా నమోదు కాని కేసు… పట్టించుకోని పోలీసులు
- బాధితురాలని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
గుంటూరు (చైతన్యరథం): జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. పల్నాడు జిల్లా విను కొండలో దాదాపు వారంక్రితం గంజాయి మత్తులో 75సంవత్సరాల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్య ంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి, తీవ్రం గా గాయపరచడం కలకలం రేపింది. ఈ దారు ణాన్ని వెలుగులోకి రాకుండా ఉంచేందుకు పోలీసు లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యాచారానికి గురైన బాధిత మహిళ ప్రస్తుతం గుంటూరు జీజీ హెచ్‌లో చికిత్స పొందుతోంది. ఈ నేపధ్యంలో బాధితురాలిని టీడీపీ నేతలు మంగళవారం పరా మర్శించారు. టీడీపీ, జనసేన నాయకులతో కలిసి నక్కా ఆనందబాబు పరామర్శించి ఘటనకు సం బంధించిన వివరాలు సేకరించారు. అనంతరం నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో గంజా యి,మత్తు పదార్థాలను నిషేధించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని,మత్తు పదార్థాలకు బానిసలై యువత పెడదారి పడుతోందన్నారు. దీనంతటికి రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతే కారణమని మండిపడ్డా రు. వైసీపీ పాలనలో మహిళల భద్రతకు భరోసా లేకుండా పోయిందన్నారు. తొమ్మిది నెలల పసిబిడ్డ నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశా చట్టం ఏమైందో తెలియని పరిస్థితి ఉందని, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం మహిళల మీద దారుణా లు, అత్యాచారాలు దాడులు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజా యికి కేరాఫ్ అడ్రస్‌గా జగన్ మర్చేశారని, యువత గంజాయి మత్తులో తూగుతుంటే… ముఖ్యమంత్రి మద్యాన్ని ఆదాయవనరుగా మార్చుకుని కోట్లు గడి స్తున్నారని అన్నారు. యువత గంజాయి మత్తులో మహిళలపై అత్యాచారాలకు,అఘాయిత్యాలకు తెగ బడుతున్నారని, చట్టాలు కఠినంగా ఉంటేనే నేరస్థు లు అదుపులో ఉంటారని అన్నారు.
వారం గడిచినా కేసు నమోదు చేయలేదు: జీవీ
వినుకొండలో 70 సంవత్సరాల వృద్ధురాలిపై గంజాయి సేవించినవ్యక్తులు అత్యాచారానికి పాల్ప డటం అత్యంత బాధాకరమని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఘటన జరిగి వారం రోజులు గడిచినా ఇంత వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం ఏమిటని మండిపడ్డారు. నిందితులను ఇంత వర కు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.బాధి తులకు అండగా ఉండాల్సిన అధికారులు.. నేరస్తు లకు వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు. బాధితు రాలకి న్యాయం చేయాలన్నారు.