అమరావతి: సైకో జగన్ జమానా లో మరో దళిత బిడ్డకు ఘోర అవమానం జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా ఎస్సీ కమి షన్ చైర్మనే బాధితుడైతే దళితులకు రక్షణ ఎక్కడని ప్రశ్నించారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితు లకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకూ ఎంతోమంది దళితబిడ్డలు బలి కాగా, తాజాగా మరో దారుణం చోటుచేసుకుందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ను కొందరు శాడిస్టులు నిర్బంధించి, కారులో తీసుకెళ్లి నాలుగు గంటల పాటు చిత్రహింసల పాల్జేయడమేగాక… దాహం వేసి మంచినీళ్లు అడిగితే సభ్యసమాజం తలదించుకునేలా మూత్రం పోసి అవమానించారని లోకేష్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్కు ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన చట్టబద్ధ సంస్థకు అధిపతి అయిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో తానే బాధితుడిని అని వాపోయారన్నారు. జగన్ జమానాలో దళితులపై అణచివేత చర్యలకు ఇది పరాకాష్ట అని నారా లోకేష్ అన్నారు.