- చంద్రబాబును తిట్టడానికి స్వంత ఎమ్మెల్యేలే తిరస్కరించడంతో సాక్షిలో తప్పుడు రాతలు
- ఉచ్చనీచాలు మరిచి మాట్లాడుతున్న ఆంబోతు మంత్రి
అమరావతి, చైతన్యరథం: త్వరలో రానున్న ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజల మనోవాంఛ సుస్పష్టం అవుతుండడంతో ముఖ్యమంత్రి జగన్ మైండ్ బ్లాక్ అయ్యింది. టిక్కెట్ ఇవ్వడానికి చంద్రబాబు, లోకేష్, పవన్‌లను తిట్టడడం ప్రధాన అర్హతగా జగన్ నిర్ణయించినా అందకు పలువురు అస్మదీయులు ససేమీరా అనడంతో జగన్ బృందం వికృత చేష్టలకు దిగజారారు. టీడీపీ సభలకు వెల్లువెత్తునున్న ప్రజా సమూహాలను చూసిన తర్వాత సైకో సిఎంలో భయం, ఆందోళనతో కూడిన వెర్రి మరింత పెరిగిపోయింది. ఇప్పటి వరకు నాయకుల చేత ప్రతిపక్ష నేత చంద్రబాబును, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను తిట్టించే పని చేశాడు. ఇప్పుడు చాలా మందికి తత్త్వం బోధపడి తాము ఆ పని చేయలేమంటూ వైసీపీ నేతలు చేతులేత్తేశారు. దీంతో తన అవినీతి విషపుత్రిక, అబద్దాల ఫ్యాక్టరీ అయిన కపట సాక్షిలో రోత రాతలు రాయిస్తున్నాడు. రాష్ట్రంలో దుర్మార్గపు ప్రభుత్వాన్ని పారద్రోలేందుకు రాష్ట్ర ప్రజలందరూ కలిసి రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రా..కదలిరా పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. సభలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేది టీడీపీనేని విశ్వాసాన్ని ప్రజలందరూ వెలిబుచ్చుతున్నారు. దీన్ని చూసి తట్టుకోలేని జగన్‌రెడ్డి తన అవినీతి పుత్రిక సాక్షిలో రా కదలిరా సభలకు జనాలే లేరని రోత రాతలు రాయించాడు.
తన సాక్షి టీవీలో ఖాళీ కుర్చిలంటూ సభ ప్రారంభానికి చాలా సమయం ముందు సభ నిర్వ హణకు ఏర్పాటు చేసిన కుర్చీలను చూపించి తన దివాళాకోరుతనాన్ని చాటుకున్నాడు. రా..కదలి రా మొదటి సభ ప్రకాశం జిల్లా కనిగిరిలో జరగగా జనం ఉప్పెనా తరలివచ్చారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా తిరువూరులో, పశ్చిమగోదావరి జిల్లా ఆచంట లో జరిగిన సభలకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఒకవైపున రోడ్లుపైన ట్రాఫిక్ జామ్ అయి అంబులెన్స్‌లు వెళ్లడమే కష్టమయిందని అదే కపట సాక్షి రాస్తుంది. మళ్లీ జనమే రాలేదని రాస్తుంది. అంబులెన్స్‌కు టీడీపీ కార్యకర్తలు దారి వ్వలేదని అబద్దపు వార్తలూ రాసింది. కానీ క్రమ శిక్షన కల్గిన టీడీపీ కార్యకర్తలు ఎక్కడ ఏ మీటింగ్ కు హాజరైనా సామాన్య ప్రయాణీకులకు గానీ ముఖ్యంగా అంబులెన్స్‌లకు ఎప్పుడూ ఇబ్బంది కల్గించింది లేదు. నాయకులు, కార్యకర్తలే స్వీయ క్రమశిక్షణతో దారి ఇచ్చిన సందర్భాలను మీడియా కూడా వార్తలుగా ప్రచురించింది.
ఆంబోతు మంత్రి అంబటి నీచ వ్యాఖ్యలు
అంబటి రాంబాబును మంత్రిగా కన్నా కాంబాబుగానే రాష్ట్ర ప్రజలందరూ అధికంగా గుర్తిస్తారు. ఆయన పేరు చెబితే చాలు సంజన అనే అమ్మాయితో ఈ ఆంబోతు జరిపిన సరస సంభాషణలే ప్రజలకు గుర్తుకువస్తాయి. అచ్చోసిన అంబోతులా వ్యవహరించడమే కాక అందరీపైనా నోరుపారుసుకునే ఈ మంత్రి సభ్యసంస్కారాలు, ఉచ్చనీచాలను విస్మరించి చంద్రబాబుపైన వ్యక్తిగత విమర్శలకు దిగజారి జగన్ శిబిరంలో నెలకొన్న నైరాశ్యానికి అద్దం పట్టాడు. తన నియోజకవర్గంలో మైన్లపైన పడి అక్రమంగా మేక్కేసి అంబోతులా బలిశాడంటూ ఆయన స్వంత పార్టీ నేతలే హైకోర్టు వరకు వెళ్లి కేసు పెట్టించారు. తన నియోజకవర్గంలో డ్రైనేజీలో పడి చనిపోయిన వ్యక్తికి ప్రభుత్వం నుంచి వచ్చిన నష్టపరిహారంలో సగం కావాలంటూ వారిని ముప్పతిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఇప్పడు సంక్రాంతి లక్కీడీప్ అంటూ ఫించన్‌దారుల నుండి తలా వంద వసూలు చేస్తూ పెద్ద అవినీతి స్కీమ్‌కు తెరలేపాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాంబాబు..ఛీ..ఛీ కాంబాబు అలియాస్ అంబోతు లీలలు అన్నీ ఇన్నీ కాదు. మరలా చంద్రబాబుపై ఈ కాంబాబు మంత్రి చేసిన వ్యాఖ్యలను అశేష ప్రజానీకం తీవ్రంగా నిరసిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిపైన అవాకు లు, చెవాకులు పేలుతుంటాడు. నవ్విపోనీ…నా కేంటి సిగ్గు అన్నట్లుగా ఆయన, ఈయన నాయకుడు సైకో సిఎం వ్యవహరిస్తున్నారు.
లోకేష్‌పైనా పిచ్చి రాతలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ విధాన పరమైన నిర్ణయాల రూప కల్పనలో కీలక నేత. పార్టీని ముందుండి నడిపించడంలో తన తండ్రి చంద్రబాబు అడుగుజాడల్లో అంతటి సమర్ధతను అందకుంటూ దినాదినాభివృద్ది చెందిన నాయకుడు. పార్టీలో సీనియర్లంటే లోకేష్ ఎనలేని గౌరవం. అంతే స్థాయిలో పార్టీలో సీనియర్లందరికీ లోకేష్ అంటే ఎనలేని అభిమానం. చంద్రబాబు అరెస్ట్‌యి 52 రోజులు పాటు జైల్లో ఉన్నప్పుడు సీనియర్లందరితో సమన్వయం చేసుకుంటూ వినూత్న కార్యక్రమాలను రూపొందించి పార్టీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. అటువంటి యువ నాయకుడిపై జగన్ మానపుత్రిక సాక్షి పిచ్చి రాతలు రాస్తోంది. వాస్తవానికి లోకేష్ గ్రాఫ్ యువగళం తర్వాత అమాంతంగా పెరిగిపోయింది. సిఎం జగన్ సభలు వెలవెల పోతే లోకేష్ పాయయాత్రకు ప్రజలు వెల్లువలా కదలివచ్చారు. 226 రోజుల పాటు 3132 కిలో మీటర్లు సాగిన పాదయాత్రకు ప్రజలు అడుగడునా నీరాజనం పట్టారు. లోకేష్‌ను కలిసేందుకు, చూసేందుకు, పలకరించేందుకు రోడ్లపైకి వీపరీతంగా జనం రావడంతో చాలా చోట్ల అర్ధరాత్రి వరకు ఆయన పాదయాత్ర కొనసాగింది. విజయవాడలో అయితే రాత్రి తొమిదన్నర గంటలకు ముగియాల్సిన పాదయాత్ర తెల్లవారుజాము దాదాపు 4 గంటల వరకు కొనసాగింది. లోకేష్ వెంట ఉప్పెనలా జనం ఎలా నడిచారో ప్రకాశం బ్యారేజ్ విజువల్స్ తెలుపుతాయి. అలాగే నెల్లూరు పట్టణంలో జరిగిన బహిరంగ సభ జన సంద్రంలా ఎలా మారిందో అందరూ చూశారు. లోకేష్ నడుస్తుంటే అటు రాయలసీమలో, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఆయన వెంట జనం ఎంత పెద్ద సంఖ్యలో వచ్చింది విజువల్స్, ఫోటోలే సాక్ష్యం చెబుతాయి. కానీ అవినీతి విషపుత్రిక సాక్షికి మాత్రం ఇవి కనిపించలేదు. సైకో సీఎంలో ఉన్న నైరాశ్యం మాత్రమే దాని రోత రాతల్లో కనిపించింది. లోకేష్ పాదయాత్ర చేసినన్నీ రోజులూ ఆయనతో ఆయా ప్రాంతాల్లో ఉన్న సీనియర్ నేతలంతా కలిసి నడిచారు. లోకేష్ పాదయాత్ర తమ నియోజకరవర్గంలోని కేడర్‌లో ఉత్సాహాన్ని నింపిందని, లోకేష్ పర్యటనతో ప్రజలు చైతన్యవంతులయ్యారని, అది రానున్న ఎన్నికల్లో తమకు ఉపయోగపడుతుందని వారంతా బహిరంగంగా ప్రకటించారు. లోకేష్ తన పాదయాత్ర ద్వారా 97 నియోజకవర్గాల్లో కోటిన్నర మంది ప్రజలను ప్రత్యక్షంగా కలిశారు. ఆయన పాదయాత్ర చేసిన 226 రోజులు పాటు ప్రతి రోజూ రెండు నుండి రెండున్నర వేల మంది దాకా ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. సెల్ఫీల కోసం తెల్లవారుజూమునే క్యూలు కట్టారు. ఇదంతా చూసిన సైకో సీఎంలో ఆందోళన, భయం,కుళ్లు, ఈర్ష్యా ద్వేషాలు చేలరేగాయి. తన పేటీయం బ్యాచ్‌తో లోకేష్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని ఎంతోగానో శ్రమించానా అదంతా మట్టిపాలు అయ్యేందనే నైరాశ్యంలోకి సైకో సిఎం వెళ్లిపోయాడు. అందుకే లోకేష్ పైనా పిచ్చిరాతుల రాయిస్తున్నాడు. కానీ ప్రజలు అంత మూర్ఖులు కాదు..!
ప్రజా తిరస్కారానికి సాక్ష్యాలు
ఇదే సమయంలో ఈ కాలంలో సిఎం జగన్‌రెడ్డి, వైసీపీ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా ఘోరంగా విఫలమయ్యాయి. గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ నేతనలు ప్రజలు పెద్ద ఎత్తున నిలదీశారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు కోసం సీఎం సభలు జనం లేక వెలవెల పోయాయి. నువ్వే మా నమ్మకం జగన్ అనే కార్యక్రమానికి స్పందనే లేక ఘోరంగా విఫలమయ్యింది. సామాజిక సాధికారిక బస్సు యాత్రలపై సామాన్యులు లెవ్వరూ చూడలేదు. ఈ సభల్లో అంతటా ఖాళీకుర్చీలే దర్శనమిచ్చాయి. మరోవైపు టీడీపీ సభలు ఎక్కడ జరిగినా జనం తండోపతండాలుగా వచ్చారు. ఇది చూసి ఓర్వలేని జగన్ తన చేతిలో ఉన్న ప్రచార సాధనాలు, నీతి బాహ్యామైన తన నేతల చేత రోత చేష్టలు చేస్తున్నాడు. అయితే ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారు.