మంగళగిరి : సామాజిక సాధికార బస్సుయాత్ర పేరుతో జగన్మోహన్‌రెడ్డి మరో కొత్తనాటకం మొదలు పెట్టాడని శాసనసమండలి మాజీ ఛైర్మన్, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు ఎంఏ షరీఫ్ అన్నారు. గతంలో ఒక్క ఛాన్స్ అనిచెప్పి రాష్ట్రప్రజల్ని మోసగించిన విధంగానే, నేడు జగన్ రెడ్డి దళితులు, బీసీలు, మైనారిటీలను వంచించడానికి సామాజిక సాధికార బస్సుయాత్ర పేరుతో కుట్ర, కుతంత్రపూరితమైన యాత్ర చేపట్టాడు. మైనారిటీల ఓట్లు దండుకొని నాలుగున్నరేళ్లుగా వారిని అన్ని విధాలుగా మోసం చేసిన ఘనత ఈ ముఖ్య మంత్రికే దక్కింది.
నవరత్నాల ముసుగులో మైనారిటీల కు తీవ్ర అన్యాయం చేసిన జగన్, నాలుగున్నరేళ్లలో వారికి మొండిచెయ్యి చూపించాడు. చంద్రబాబు మైనారిటీల భవిష్యత్ కోసం తీసుకొచ్చిన ఏపీ మైనారిటీ కార్పొరేషన్‌ను జగన్ తుంగలో తొక్కాడు. నాలుగున్న రేళ్లలో ఒక్క మైనారిటీకి ఒక్కటంటే ఒక్క రూపాయి రుణం ఇచ్చింది లేదు. 2014-19 మధ్యన చంద్ర బాబునాయుడు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా దాదాపు 46వేల మంది మైనారిటీలకు 50శాతం సబ్సిడీతో ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున రుణం అందించారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏపీ మైనారిటీ కార్పొరేషన్‌ను నేతిబీరకాయలో నెయ్యి తీరుగా మార్చేశాడు. చంద్ర బాబు నూర్ బాషా ఫెడరేషన్ ఏర్పాటుచేసి దానికి రూ.50 కోట్లు కేటాయిస్తే, జగన్ ఆ సొమ్ముని వెనక్కు తీసుకొని నూర్ బాషాల నోట్లో మట్టికొట్టాడు. టీడీపీ ప్రభుత్వం ఉర్దూని రాష్ట్ర రెండో అధికార భాషగా ప్రక టించి, ఆ భాషాభివృద్ధికోసం, ఉర్దూ అకాడమీ కోసం సంవత్సరానికి రూ.15కోట్లు కేటాయించింది.
జగన్ అధికారంలోకి వచ్చాక ఉర్దూ బాష మరుగునపడిపోతే, ఉర్దూ అకాడమీలో పనిచేసే సిబ్బందికి జీతాలు అందని దుస్థితి ఏర్పడిరది. విదేశీవిద్య పథకం కింద చంద్ర బాబునాయుడు 500 మంది మైనారిటీ యువతకు రూ.10లక్షల చొప్పున రుణం అందిస్తే, నాలుగున్నరేళ్లుగా జగన్‌రెడ్డి విదేశాల్లో ఉన్న మైనారిటీ యువతను పట్టించుకోకుండా గాలికి వదిలేశాడు. చంద్రబాబు మైనారిటీ పిల్లల ప్రాథమిక విద్యకోసం 9ఉర్దూ రెసిడెన్షి యల్ పాఠశాలలు ఏర్పాటుచేస్తే, వాటికి అవసరమైన భూమిని జగన్ రెడ్డి కేటాయించ లేకపోయాడు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చంద్రబాబు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చాక వక్ఫ్ భూములు.. ఆస్తులు వైసీపీ నేతల కబంధహస్తాల్లో చిక్కాయి. డిప్యూటీ ముఖ్యమంత్రి.. మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా పేరుకే మంత్రిగానీ… మైనారిటీల సంక్షేమం కోసం ఒక్క పనీ చేయలేని అసమర్థుడిగా మిగిలి పోయాడు. అంజాద్ బాషా పదవి… పలుకుబడి పేరు గొప్ప.. ఊరు దిబ్బ చందంగా మారడం ముస్లిం సమాజానికే సిగ్గు చేటు. షాదీఖానాలు.. మసీద్ లు.. హజ్ హౌస్ ల నిర్మాణం.. నిర్వహణకు టీడీపీ ప్రభుత్వం కోరిన విధంగా నిధులు కేటాయిస్తే.. జగన్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఎక్కడా ఒక్కటంటే ఒక్క ఒక్క షాదీఖానా కూడా నిర్మిం చలేకపోయింది. రాష్ట్ర చరిత్రలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి గుండుసున్నా చుట్టిన ఏకైక ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం చరిత్రలో నిలిపోతుందని షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.