- వైసీపీ అప్పులు చేస్తే..మేం పెట్టుబడులు తెస్తున్నాం
- 4 నెలల్లో రూ.60 వేల కోట్లకు పైగా తీసుకొచ్చాం
- ఇదే నిజమైన దసరా పండుగ..ఇదే సంపద సృష్టి
- జగన్‌రెడ్డి హయాంలో కంపెనీలను తరిమేశారు
- టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్
మంగళగిరి(చైతన్యరథం): పెట్టుబడులు, అభివృద్ధి గురించి జగన్‌రెడ్డి ఏనాడూ ఆలోచించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి విదేశీ, స్వదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. మంగళగిరి పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం అప్పులు చేసి వెళితే కూటమి ప్రభుత్వం కష్టించి పరిశ్రమలు తెచ్చి పెట్టుబడులు తీసుకువచ్చి ఆదాయం సృష్టించి అప్పులు తీరుస్తోందన్నారు. విన్‌ఫాస్ట్, మోగ్లిక్స్, వెర్మీరెన్ వంటి విదేశీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టు బడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. మంత్రి నారా లోకేష్ కృషితో విశాఖలో టీసీఎస్ కంపెనీ యూనిట్ ఏర్పాటు చేయనుందని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నామంటూ ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు మంత్రి లోకేష్‌ను కలిశారు. ఫాక్స్ కాన్, ఆపిల్ ఫోన్ లాంటి కంపెనీల గురించి జగన్‌కు అసలు అవగాహనే లేదు. ఫాక్స్ కాన్ సంస్థ ఐ ఫోన్‌లు తయారీ చేస్తుందని కూడా తెలియదు. ఆయన ఫోన్లే వాడనంటాడు. ఫోన్లు వాడని వారికి ఐ ఫోన్ కంపెనీ గురించి, అవి తయారు చేసే కంపెనీ పెట్టాలని ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందని సందేహం వ్యక్తం చేశారు.
పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న ప్రముఖ సంస్థలు
2014-19 మధ్యలో సెల్‌కాన్, ఫాక్స్ కాన్ వంటి కంపెనీలను బ్రహ్మాండంగా టీడీపీ ప్రభుత్వం పెట్టింది. ఎలక్ట్రాన్ సిటీకి 1501 ఎకరాలను నాడు టీడీపీ ప్రభుత్వం కేటాయిస్తే జగన్‌రెడ్డి భూ కేటాయింపులను రద్దు చేశాడు. దుబాయ్‌కు చెందిన లులూ సంస్థలకు నాడు టీడీపీ ప్రభుత్వం భూములను కేటాయిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక వారిని తరిమేశారు. మళ్లీ అదే సంస్థ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెల్లూరు, తిరుపతిలో పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చిందని వివరించారు. గండికోట, అలిపిరి, వైజాగ్, హార్స్‌లీ హిల్స్‌లలో ఐదు నక్షత్రాల హోటళ్లు పెట్టడానికి ఒబెరాయ్ సంస్థ ముందుకొచ్చిం ది. ప్రఖ్యాతి చెందిన బ్రూక్ ఫీల్డ్ కార్పొరేషన్ సంస్థ పునరుత్పాదక శక్తి ఐటీని రూ.3 వేల కోట్ల పెట్టుబడులతో విజయవాడలో యూనిట్‌ను విస్తరింపచేయడానికి ముందుకొచ్చింది. 4,500 మంది పనిచేసే హెచ్‌సీఎల్ సంస్థ కూడా తమ సంస్థ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐటీ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. అనంతపురంలో సుజ్లాన్ అనే విన్ టర్బైన్ల తయారీ కంపెనీ ఏర్పాటుకు ఆ సంస్థతో ఒప్పందం కుదిరింది. రూ.250 కోట్లతో ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ మేనేజ్‌మెం ట్ ఇనిస్టిట్యూట్‌ను అమరావతిలో నిర్మించనుంది. ముంబాయికి చెందిన టాటా సన్స్, యూని ట్ మాల్ సంస్థ వైజాగ్‌లో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఢల్లీికి చెందిన జైరాజ్ ఇస్పాత్ సజ్జన్ గోయాంకా అనే సంస్థ రెండో యూనిట్‌ను కర్నూలులో విస్తరించనున్నారు. చెన్నైకు చెందిన అపోలో యూనివర్శిటీని రాష్ట్రంలో నెలకొల్పనున్నారు. ఎస్‌ఆర్‌ఎం యూని వర్శిటీ వెయ్యి పడకల ఆసుపత్రి, ఏ1 యూనివర్శిటీని అమరావతిలో పెట్టనున్నారు. అమెరికాకు చెందిన గూగుల్ సంస్థ వైజాగ్‌లో యూట్యూబ్ అకాడమీని నెలకొల్పనుంది. సబ్ స్ట్రేట్ తయారీ కంపెనీ వైజాగ్‌లో ఏ1 మెటీరియల్ తయారీ సంస్థ నెలకొల్పనుంది. గోద్రెజ్, ఆంధ్రా పేపర్, రీసొల్యుట్ ఎలక్ట్రానిక్స్ ఆరియా గ్లోబల్, ఇండియన్ డైజన్ గార్మెంట్స్, మ్యాగ్లిక్స్, వర్మీరన్, ఏపీ మెడ్‌టెక్ జోన్, విన్ ఫాస్ట్ తదితర సంస్థలు రాష్ట్రానికి రావడానికి ఒప్పందం కుదిరిందని తెలిపారు.
కేంద్ర నిధులతో అమరావతి, పోలవరం, పారిశ్రామిక పార్కులు
పోలవరం డ్యామ్ నిర్మాణం వేగవంతం కానుంది. అమరావతిలో ప్రభుత్వ కార్యాల యాల నిర్మాణం కూడా చేయాల్సి ఉంది. కొప్పర్తి, ఓర్వకల్లులో పారిశ్రామిక వాడలు, రైల్వే జోన్, రాష్ట్ర రోడ్లు, అమరావతి ఈస్ట్రన్, వెస్ట్రన్ బైపాస్ రోడ్ల నిర్మాణానికి కూడా ఒప్పందా లు కుదిరాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపారు. 2014-19లో మా ప్రభుత్వం హయాంలో మేము ఎస్‌ఆర్‌ఎం, వీఐటీ, అమృత్ యూనివర్సిటీలను తీసుకువస్తే జగన్‌రెడ్డి వాటికి రోడ్లు కూడా వేసిన పాపాన పోలేదు. అమరావతిని జగన్ రెడ్డి పాడు పెట్టాడు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం హామీతో 90 శాతం గ్రాంట్లుగా వరల్డ్ బ్యాం కు రూ.15,000 కోట్లు ఇవ్వనుంది. పోలవరానికి రూ.2,500 కోట్లు కేంద్రం ఇచ్చింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు రూ.25 వేల కోట్లు పెట్టుబడులు, 75 వేల మంది యువతకు ఉపాధి కల్పించేలా కేంద్రం ఆమోదించింది. మొత్తంగా నాలుగు నెలల్లో రూ.60 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఈ మంచి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇదే నిజమైన విజయదశమి పండుగ.. సంపద సృష్టి అంటే ఇదేనని జగన్ రెడ్డి తెలుసుకోవాలి అని సూచించారు.