- మరింత సమర్థవంతంగా వెబ్‌సైట్ నిర్వహించాలి
- అవసరమైతే సిబ్బందికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించాలి
- అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి
- ప్రభుత్వంపై వచ్చే నెగెటివ్ వార్తలపై వివరణ ఇప్పించాలి
- డేటా బ్యాంకు ఏర్పాటుకు అధికారిని నియమించుకోవాలి
- ఖాళీలు, వాహనాల అవసరంపై నివేదిక సమర్పించాలి
- సమాచార, గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్ధసారథి
అమరావతి(చైతన్యరథం): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులు, ఉద్యోగులు మరింత వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించు కోవాల్సిన అవసరం ఉందని సమాచార పౌరసంబంధాలు, గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్ధసారథి¸ó సూచించారు. గురువారం సచివాలయంలో సమాచార శాఖ క్షేత్రాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాచార శాఖ అంటే ప్రభుత్వానికి కళ్లు, చెవులు వంటిదని, ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాల పై ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించడంలో ఆ శాఖ ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. అవసరమైతే ఆయా రంగాలకు చెందిన నిపుణులతో ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం ఏర్పా టు చేయాలని సమాచారశాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లాకు సూచించారు.
డేటా బ్యాంకుకు ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసుకోవాలి
సమాచార శాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించి అభివృద్ధి, సంక్షేమ పధకాల సమాచారాన్ని సకాలంలో ప్రజలకు చేరవేసేందుకు కృషిచేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా సమాచార శాఖ అధికారులు, సిబ్బంది పనిచేయా లని కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ ప్రసార మాద్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రభు త్వంపై ఎక్కడైనా మీడియాలో లేదా సోషల్ మీడియాలో వ్యతిరేక వార్తలు వస్తే వెంటనే సంబంధిత జిల్లా లేదా రాష్ట్రస్థాయి అధికారులను సంప్రదించి రిజాయిండర్ లేదా వివరణ ఇవ్వడం ద్వారా వాస్తవాలను తెలియజెప్పాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన శాఖల వారీగా పూర్తి సమాచా రాన్ని సేకరించి ప్రత్యేక డేటా బ్యాంకును ఏర్పాటు చేసుకునేందుకు తగిన మెకానిజాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమ పథóకాలకు సంబంధించిన విజయగాధలను మీడియాలో ప్రచురితమయ్యేలా చూడాలని అన్నారు.
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు, ఆరోగ్య పథకంపై చర్చ
అనంతరం జర్నలిస్టుల ఆరోగ్య పథకం, అక్రిడిటేషన్ ఇతర అజెండా అంశాలపై చర్చిం చారు. జిల్లాల వారీగా ఖాళీల భర్తీ, సమకూర్చాల్సిన వాహనాలు వంటి ఇతర వ్యవస్థాప రమైన అంశాలపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. దానిపై ముఖ్యమం త్రితో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా మాట్లాడుతూ అక్టోబరు 31 లోగా నూతన అక్రిడిటేషన్ విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు. అదేవిధంగా జర్నలిస్టుల ఆరోగ్య పథకంలో కూడా కొన్ని మార్పులు తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సమాచార సంయుక్త సంచాలకులు, ముఖ్య సమాచార ఇంజనీర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, రీజనల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్లు, ఏడీలు, డీఐ, పీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.