- సదరమ్ పత్రాలను నిశితంగా పరిశీలించాలి
- వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలి
- పరిశీలనకు ప్రత్యేక బృందాల నియామకం
- నివేదిక అనంతరం అనర్హుల తొలగింపునకు చర్యలు
- వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు
అమరావతి(చైతన్యరథం): దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పట్టి రూ.15 వేలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాలను నిశితంగా పరిశీలించా లని వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, సెర్ప్ సీఈవో వీర పాండ్యన్ ఆదేశించారు. అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి బాపట్ల జిల్లా నుంచి కలెక్టర్ జె.వెంకటమురళి హాజరయ్యారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో అక్రమం గా పెన్షన్లు పొందే వారిని తొలగించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. అందులో భాగంగా పరిశీలన చేపడుతున్నట్లు వివరించారు. ఇందుకోసం వైద్య బృందాల ను నియమిస్తామని చెప్పారు. సదరమ్ ద్వారా జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను నిశితం గా పరిశీలించాలని సూచించారు. పరిశీలన కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో వివరాలను నిక్షిప్తం చేయాలని, ఈ విషయాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు, ట్యాంపరింగ్ వంటి వాటిపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా నియమించిన వైద్య బృందాలకు సహాయ సహకారాలు అందించడానికి సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లను నియమిం చాలని ఆదేశించారు. వారి ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి విచారించి అనర్హులుంటే వారి వివరాలను సంబంధిత వైద్యాధికారులు తక్షణమే యాప్‌లో నమోదు చేయాలని సూచిం చారు.
వైద్యుల ధ్రువీకరణతో ధ్రువీకరణ పత్రాలు సైతం రద్దు అవుతాయన్నారు. సోమవారం నుంచి విచారణ ప్రక్రియ ప్రారంభించాలని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు. నూరు శాతం నిక్కచ్చిగా పరిశీలన, విచారణ ప్రక్రియ జరుగుతుందని వివరించారు. బృందాలను పర్యవేక్షించుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దరఖాస్తులు చేసుకున్న మంచం పట్టిన వ్యాధిగ్రస్తుల దరఖా స్తుల విచారణకు అనుమతులివ్వాలని కలెక్టర్ జె.వెంకటమురళి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. విచారణపై పలు సూచనలు చేశారు. బాపట్ల జిల్లాలో ఇప్పటివరకు 1,582 మంది దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పట్టిన కేటగిరీలో రూ.15 వేలు చొప్పున ప్రతినెలా పింఛన్ పొందుతున్నారని చెప్పారు.
ప్రభుత్వ లక్ష్యం మేరకు విచారణ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. వైద్య బృందాల పరిశీలన కోసం సూక్ష్మ ప్రణాళిక, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదే శించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్.విజయమ్మ, డీసీహెచ్ ఎస్ జిల్లా కోఆర్డినేటర్ శేషుబాబు, గుంటూరు జెడ్పీ డిప్యూటీ సీఈవో కృష్ణ, డీఆర్‌డీఏ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.