- వైసీపీ ప్రభుత్వం రూ.1167 కోట్లు బకాయి పెట్టింది
- వాయిదాల వారీగా ఆయా కంపెనీలకు చెల్లిస్తున్నాం
- జగన్ ప్రభుత్వం బిందు సేద్యాన్ని నిర్వీర్యం చేసింది
- ఈ ఏడాది 3 లక్షల హెక్టార్లలో సాగుకు ప్రోత్సాహం
- వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు తక్షణమే బిందు సేద్యం పరికరాలు రాయితీపై అందించాలని, అందుకు శుక్రవారం నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారం భించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో రాయితీపై బిందు సేద్యం అమలుపై అధికారులతో మంత్రి సమీక్షించారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో బిందు సేద్యం నిర్వీర్యమైందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రూ.1167 కోట్ల బకాయిలు పెట్టిం దని రైతులకు తక్షణమే బిందు సేద్యం అమలు చేయాలనే సంకల్పంతో కంపెనీలకు బకాయిలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బకాయిల్లో రూ.176 కోట్లు విడుదల చేశామని, వాయిదా పద్ధతిలో త్వరలోనే మిగిలిన బకాయిలు కంపెనీలకు చెల్లిస్తామని వెల్లడిరచారు. జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా అందించే బిందు సేద్యం ఫండ్ (మైక్రో ఇరిగేషన్ ఫండ్) కూడా సద్వినియోగం చేసుకోలేదని అన్నారు. ఈ ఏడాది 3 లక్షల హెక్టార్లలో సాగుకు రాయితీపై బిందు సేద్యం అమలు చేసేందుకు లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. తద్వారా రాష్ట్ర రైతాంగానికి ప్రత్యక్షంగా పరోక్షంగా రూ.3450 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అన్నారు.
జగన్ ప్రభుత్వం బిందు సేద్యాన్ని నిర్వీర్యం చేసింది
2004లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో దేశ వ్యాప్తంగా బిందు సేద్యం అభివృద్ధి చేసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారని అన్నారు. 2015 – 2018 మధ్య దేశంలోనే బిందు సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ 17.6 శాతం భాగస్వామ్యంతో ప్రథమ స్థానంలో ఉంటే జగన్ రెడ్డి 2019 – 2023 మధ్య 5.7 శాతం భాగస్వామ్యానికి తీసుకుని వచ్చి బిందు సేద్యాన్ని నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. ఉద్యాన సాగులో 55 శాతం మాత్రమే బిందు సేద్యం అమలవుతోందని, నూరు శాతం ఉద్యాన సాగులో బిందు సేద్యం అమలు చేసేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీయే ప్రభుత్వం రైతులకు, రైతు శ్రేయస్సు కోసం బిందు సేద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో బిందు సేద్యం తక్షణమే అమలుకు ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష లో ఉద్యాన, మత్స్య శాఖల కార్యదర్శి అహ్మద్‌బాబు, ఉద్యాన శాఖ డైరెక్టర్ కె.శ్రీనివాసు లు, ఏపీఎంఐడీపీ ప్రాజెక్టు అధికారి బి.హరనాథరెడ్డి పాల్గొన్నారు.