– కాలేజీలు పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థుల్ని ఇబ్బందులకి గురిచేస్తున్నారు
– విద్యాసంవత్సరం పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు
– కొత్తగా విద్యార్థి, తల్లి జాయింట్ అక్కౌంటు మెలికతో తీవ్ర ఇబ్బందులు
– ముఖ్యమంత్రికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ
అమరావతి, చైతన్యరథం: విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.1650 కోట్లు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ టిడిపి జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి బహి రంగ లేఖ రాశారు. విద్యాసంవత్సరం మొదలై నెల లు గడుస్తున్నా విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లిం చక పోవడంతోవారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిలు రూ.1650 కోట్లు పెండిరగ్లో ఉంచడంతో కాలేజీల యాజమాన్యా లు విద్యార్థులని పరీక్షలు రాయనీయడంలేదని ఆం దోళన వ్యక్తం చేశారు. చదువు పూర్తయిన విద్యార్థు లకు మార్కులలిస్టులు,ఇతర సర్టిఫికెట్లు జారీని నిలి పేశాయని, పైచదువులు, ఉద్యోగ పరీక్షలు, ఇంట ర్వ్యూలకి హాజరయ్యే విద్యార్థులు సర్టిఫికెట్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డిగ్రీ మధ్యలో ఉన్న విద్యార్థులు పరీక్షలకి దూరం అవు తున్నారని, లక్షలాది మంది విద్యార్థుల ఆందోళన లు దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఫీజులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2020-21 బకాయి రూ.600 కోట్లను చెల్లించేది లేదని జగన్‌రెడ్డి సర్కార్ తేల్చేసిందని, 2022-23లో నాలుగో టెర్మ్ ఫీజులు రూ.600కోట్లు చెల్లించాల్సి ఉందని, నాలు గేళ్లుగా పీజీ కోర్సుల ఫీజు బకాయిలు రూ.450 కోట్లు పెండిరగ్లో ఉన్నాయని తెలిపారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పీజీ కోర్సులకి ఫీజులు చెల్లిం చగా, జగన్‌రెడ్డి చ్చాక నిలిపేశారని చెప్పారు.
విద్యాదీవెన, వసతిదీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న జగన్‌రెడ్డి ఈనాలుగున్నరేళ్లలో ఒక్క ఏడాదీ కూడా సకాలంలో విద్యార్థుల ఫీజురీయిం బర్స్ మెంట్ చేయలేదన్నారు. ఫీజులు చెల్లించాలం టూ కాలేజీల నుంచి తీవ్రమైన ఒత్తిడితో విద్యార్థు లు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని, ఫీజులు కట్టలేదని కొన్ని కాలేజీలు పరీక్షలు నిర్వ హించకుండా విద్యార్థులను ఇబ్బందులకి గురిచేస్తు న్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
కేంద్రం ఎస్సీ, ఎస్టీల విద్యార్థులకి ఇస్తున్న 60శాతం ఫీజు ఏ లెక్క లోనా చూపకుండా మీరే విద్యాదీవెన ఇస్తున్నట్టు చేస్తున్న ప్రచారం ప్రజల్ని మోసగించడమే అన్నారు. కొత్తగా విద్యాదీవెన డబ్బులను విద్యార్ధి, వాళ్ల తల్లి జాయింట్ అక్కౌం టులో వేస్తామంటూ మెలిక పెట్టడం విద్యార్థుల్ని మరింత ఇబ్బందులు గురి చేసే ప్రహసనంగా మారిందన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన అంటూ పేర్లుపెట్టి, విపరీతంగా ప్రచారం చేసుకోవడం తప్పించి.. జరిగిన మేలు శూన్యమన్నారు. మొండి వైఖరి, ప్రచారార్భాటాలు మాని అర్జంటుగా ఫీజు రీయింబర్స్మెంట్ పాత బకాయిలు, ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజులు చెల్లించాలని కోరాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.