అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించుకుంటున్నాయి. రాజమహేంద్రవరం, కుప్పం, మంగళగిరి తదితర ప్రాంతాల్లో తెదేపా నేతలు, కార్యకర్తలు టపాసులు పేల్చారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని బాణసంచా కాల్చారు. చంద్రబాబుపై పెట్టిన ఏ అక్రమ కేసూ నిలబడదని అచ్చెన్నాయుడు అన్నారు. జైలు నుంచి బయటకు చంద్రబాబు కాలుపెట్టిన సమయం నుంచి జగన్ పతనం ప్రారంభమైందని నేతలు హెచ్చరించారు. చంద్రబాబును ఇక ఏశక్తీ ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు. అన్ని కేసులూ అక్రమమని త్వరలోనే తేలిపోతుందన్నారు.