- చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకుల ఫిర్యాదు
- వైసీపీతో అంటకాగి మళ్లీ వీసీ పదవికి ప్రొఫెసర్ పాకులాట
- యలమంచిలి మున్సిపాలిటీలో పనులు చేసినా బిల్లులు రాలేదు
- బీమా కోసం ఇంజక్షన్‌తో జనాల ప్రాణాలు తీస్తున్న హంతక ముఠా
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమానికి వినతులు
- అర్జీలు స్వీకరించిన మంత్రి పొంగూరు నారాయణ, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
మంగళగిరి(చైతన్యరథం): అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతూ ఆర్‌ఐవో పోస్టు నుంచి తొలగించబడ్డాడు.. గత ప్రభుత్వంలో రాజకీయ పలుకుబడితో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అండతో కడప జిల్లా వృత్తి విద్యాధికారిగా నియమితుడయ్యాడు.. నేడు ఇంటర్ విద్యలో పనిచేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అక్రమ బదిలీలతో మళ్లీ అవినీతి సంపాదనకు శ్రీకారం చుట్టాడు..విద్యా వ్యవస్థలో తులసి వనంలో గంజాయి మొక్కలా ఉన్న ఎస్.రవిపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ విద్యార్థి సంఘ నాయకులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. మంత్రి పొంగూరు నారాయణ, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అర్జీ స్వీకరించి విచారించి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.
` ఎవరికీ అనుమానం రాకుండా డెలివరీ బాయ్‌లా వచ్చి ఒక్క ఇంజక్షన్ పొడిచి గుండెపోటు వచ్చేలా చేసి మనిషిని చంపేసి అతనికి రావాల్సిన క్లెయిమ్‌లను కొట్టేస్తున్నా రు.. విభేదాలు ఉన్న, కోర్టు కేసులు ఉన్న కుటుంబాలే వారి టార్గెట్.. మందుల షాపులు పెట్టుకు ని నకిలీ డాక్టర్లు ఒక ముఠాగా తయారై జనాల ప్రాణాలు తోడేస్తున్నారు.. వారిపై చర్యలు తీసుకోవాలని కాకినాడ నుంచి వచ్చిన పలువురు ఫిర్యాదు చేశారు.
` తమ వ్యవసాయ భూమిని వైసీపీ గూండా గోరా శ్రీను(బెజావాడ శ్రీను) దౌర్జన్యంగా దున్నతున్నాడని.. అతని దౌర్జన్యాలను అరికట్టి న్యాయం చేయాలని ప్రకాశం జిల్లా గిద్దలూ రు నియోజకవర్గం రాజుపాలెంకు చెందిన ఆంజనేయ సాగరప్రసాద్ అభ్యర్థించా డు.
` తమ భూమిని ఆక్రమించి వైసీపీ నేతలు అక్రమ వెంచర్లు వేస్తున్నారని, అడ్డుకోవడా నికి వెళితే దుర్భాషలాడుతున్నారని ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మోటుపల్లి గ్రామా నికి చెందిన బసవమ్మ ఫిర్యాదు చేసింది. అధికారులు విచారించి అక్రమార్కులు వేస్తున్న వెంచర్‌ను తొలగించి తమకు న్యాయం చేయాలని వేడుకుంది.
` కరోనా సమయంలో వందల మంది కరోనా పేషెంట్ల కోసం సరఫరా చేసిన టెంట్లు, బెడ్‌షీట్‌లు, దుస్తులు, షాంపులు, వాటర్ టిన్నులు ఇతరత్రా దాదాపు రూ.50 లక్షల కు పైగా ప్రభుత్వం ఆదేశాల మేరకు అప్పుగా తెచ్చి ఖర్చు పెట్టాం..ఇప్పటికీ డబ్బులు అం దలేదు..దయచేసి తమకు బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని భీమవరానికి చెందిన గంటా వెంకటసురేష్ నేతల ముందు వాపోయాడు.
` తాము మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల్లో భాగంగా 2018లో చేపట్టిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాలేదని అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ కొక్కిరాపల్లికి చెందిన గొర్లె కొండలరావు తెలిపాడు. తాము టీడీపీకి చెందిన వారమని బిల్లులు రాకుండా అడ్డుకున్నారని..బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని కోరారు.
` శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రూరల్ డెవలప్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ ప్రొఫెస ర్ గత ప్రభుత్వంలో వైసీపీతో అంటకాగి మళ్లీ నేడు పదవి కోసం పాకులాడుతున్నాడని.. వీసీ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నాడని..పదవి ఇవ్వకుండా చూడాలని పలువురు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.
` తన భూమిని తనకు తెలియకుండానే బి.పవన్‌కుమార్, బి.మధులు కలిసి మరొక వ్యక్తికి అమ్మారు..తహసీల్దారుకు ఫిర్యాదు చేసినా అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు..దీనిపై విచారించి న్యాయం చేయాలని బాధితురాలు వి.వరదమ్మ ఫిర్యాదు చేసింది.
` సెగ్గెం నాగేశ్వరరావు, సెగ్గెం పద్మ తమ భూమిని అమ్ముకుని తనను ఇబ్బంది పెడుతున్నారని చల్లా వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. స్పందించిన నాయకులు పోలీసు అధి కారులతో మాట్లాడి విచారించి బాధితుడికి న్యాయం చేయాలని సూచించారు.
` మున్సిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయులను డీఎస్సీ ద్వారా నియమిస్తూ బదిలీలు చేయకపోవడంతో ఎంతోమంది భార్యభర్తలు వేరు వేరు జిల్లాల్లో కుటుంబాలకు దూరంగా ఉండి ఉద్యోగాలు చేయాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి మున్సి పల్ ఉపాధ్యాయులకు జిల్లా బదిలీలు, సాధారణ బదిలీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.