- రాష్ట్రంలో రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి
- గత ప్రభుత్వం సాగునీటి వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది
- కాలువగట్లు, ఏటిగట్ల పటిష్టతకు యుద్ధప్రాతిపదికన పనులు
- పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరందించేలా చర్యలు
- ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువల ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు
- విధుల్లో నిర్లక్ష్యం వహించిన కృష్ణా జిల్లా ఎస్‌ఈ సరెండర్
- రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి(చైతన్యరథం): ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబరులో మీడియాతో మాట్లా డుతూ గత ప్రభుత్వం సాగునీటి వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కాలువలు, డ్రైన్లలో పూడికతీత చేపట్టకపోవడంతో నీటి ప్రవాహానికి అనేక ఇబ్బందులు ఎదురవుతు న్నాయని తెలిపారు. నేడు రాష్ట్రంలోని జలశయాలు జలకళను సంతరించుకుని కళకళ లాడుతున్నాయని అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకుని శ్రీశైలం కుడి కాలువ, హంద్రీనీవా, కేసీ కాలువల ద్వారా రాయలసీమ సాగు,తాగునీటి అవసరాలను తీర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వరదనీరు వృథాగా సముద్రంలోకి పోకుండా అన్ని రిజర్వాయర్లను పూర్తిగా నీటితో నింపాలని జలవనరుల శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు వివరించారు.
ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు సాగునీరు
ప్రకాశం బ్యారేజ్ నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా కృష్ణా డెల్టాకు పూర్తిగా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సాగునీటి ఎద్దడిని అధికమించేందుకు వీలుగా ఖరీఫ్ పంటను సాధ్యమైనంత ముందుగా వేసుకోవాలని రైతులకు విజ్ణప్తి చేశామని తెలిపారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, పట్టిసీమ నుంచి నీటిని తీసుకుని కృష్ణా డెల్టాకు పూర్తిస్థాయిలో నీటిని అందించడం జరుగుతోందని చెప్పారు. వ్యవసాయం, అభివృద్ధి, సంక్షేమం ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశాలుగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
లాకులు, షట్టర్లకు గ్రీజు కూడా పెట్టలేదు
గత ప్రభుత్వం సాగునీటి వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి కాలువలు, డ్రైన్లలో తట్ట మట్టి కూడా పూడిక తీయకపోవడంతో నేడు సాగునీటి పారుదలకు అనేక ఇబ్బందులు ఎదురువుతున్నాయని చెప్పారు. లాకులు, షట్టర్లకు కనీసం గ్రీజు కూడా పూయకపో వడంతో అవన్నీ దెబ్బతిని పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయని అన్నారు. అదేవిధంగా ఏటిగట్లు, కాలువ గట్లు బలహీనమై గండ్లు పడే పరిస్థితులు నెలకొన్నాయని అలాంటివి గుర్తించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలి పారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ, పోలీస్, తాగునీటి సరఫరా, జలవనరుల శాఖ అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి ఏటిగట్ల పటిష్టతకు చర్యలు తీసుకోవాలని చెప్పామని వివరించారు. ఎస్‌ఈ మొదలు ఏఈ వరకూ అధికారులు, సిబ్బంది అంతా దీనిలో చురుగ్గా పనిచేయలని ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.
కృష్ణా జిల్లా ఎస్‌ఈ నిర్లక్ష్యం..ఈఎన్‌సీకి సరెండర్
ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాలోని కుడి, ఎడవ కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని అందించాలని ఆదేశించగా కృష్ణా జిల్లా ఎస్‌ఈ ప్రసాద్‌బాబు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఆయనను ఈఎన్‌సీకి సరెండర్ చేసినట్టు చెప్పారు. గత 31న ఎస్‌ఈలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కృష్ణా డెల్టాకు కృష్ణానది పరివాహక ప్రాంతం, పట్టిసీమ, ప్రకాశం బ్యారేజ్‌లో అందుబాటులో ఉన్న నీటిలో 16,500 క్యూసెక్కుల నీటిని కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటికి సరఫరా చేయాలని ఆదేశించామని తెలిపారు. అదే సమయంలో పులిచింతల నుంచి నీటిని డ్రా చేసుకోవాలని చెప్పగా ఈనెల 1వ తేదీన 14 వేల క్యూసెక్కులు, 2న 15 వేలు, 3న 12 వేలు, 4న 10 వేలు, 5న 11 వేల క్యూసెక్కుల నీటిని కాలువల ద్వారా విడుదల చేశా రని వివరించారు. సాగునీటి విడుదలలో ఎస్‌ఈ పూర్తిగా నిర్లక్ష్యం వహించారని గమ నించి ఈఎన్‌సీకి సరెండర్ చేసినట్టు తెలిపారు.