- వరద నీటితో రిజర్వాయర్లు, చెరువులను పూర్తిగా నింపాలి
- నదుల అనుసంధాన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలి
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి
- రెండు సీజన్లలో డయాఫ్రం వాల్ పూర్తి చేసి వచ్చే జూన్‌కు సిద్ధం చేయాలి
- వెలుగొండ, చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్-1 త్వరగా పూర్తిచేయాలి
- జలవనరుల శాఖ సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
అమరావతి(చైతన్యరథం): ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వస్తున్న వరద నీటిని వినియోగించుకుని రాష్ట్రంలోని అన్ని ప్రధాన రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ చెరువు లను పూర్తిగా నీటితో నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జల వనరుల శాఖ అధి కారులను ఆదేశించారు. నీటి వృథాను అరికట్టి ఆయకట్టులోని ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చూడాలని స్పష్టం చేశారు. కరువు పరిస్థితులను సైతం అధిగమించేందుకు వీలుగా అన్ని రిజర్వాయర్లను, మైనర్ ఇరిగేషన్ చెరువులను నీటితో నింపాలని సూచిం చారు. జలవనరుల శాఖపై మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఆ శాఖ అధికారులతో సమీక్షించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయ ర్లలో ఉన్న నీటి లభ్యత, తదితర అంశాలపై జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. ఇప్పటి వరకూ 64 శాతం రిజర్వాయర్లను నీటితో నింపినట్టు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇప్పటివరకు వివిధ రిజర్వాయర్లు, ఇతర ప్రాజెక్టులకు ఎంత నీరు వచ్చి చేరింది, పూర్తిస్థాయిలో నిండకపోవడానికి గల కారణాలను క్షేత్రస్థాయి నుంచి విశ్లేషించుకోవాలని అధికారులకు సూచించారు.
రెండు సీజన్లలో పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం
రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని రెండు సీజన్లలో పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనిపై కేంద్రంతో తాను కూడా మాట్లాడతానని, అధికారులు కూడా ఢల్లీి వెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడాలని ఆదేశించారు. వెలుగొండ, చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్-1 పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి
గోదావరి-పెన్నా, వంశధార-నాగావళి నదుల అనుసంధాన ప్రకియను ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు స్పష్టం చేశారు. నదుల అనుసంధానంతో భవిష్యత్తులో నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అన్నారు. గోదావరి డెల్టా కంటే ముందుగా కృష్ణా డెల్టాలో వ్యవసాయ పనులు మొదలయ్యే విధంగా పూర్తిస్థాయిలో నీటిని అందుబా టులో ఉంచాలని సూచించారు. పులిచింతల నీటిని అవసరాలకు వాడుకునేలా నీరు నిల్వ ఉంచాలని పేర్కొన్నారు. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు రిజ ర్వాయర్‌ను పూర్తిగా నింపాలని ఆదేశించారు.
నీటి వినియోగంలో పాలసీని రూపొందించాలి
వర్షపాతం వివరాలను విశ్లేషించి ఒక కార్యాచరణతో ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మైక్రో, మ్యాక్రో స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసి నీటి వినియోగంలో పటిష్టమైన పాలసీని తీసుకురావాలని సూచించారు. దీనిలో సామాజిక వేత్తలు, విద్యార్థులు, సాగునీటి నిపుణులను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. నీరు సులభంగా పారేందుకు కాలువలు, డ్రైన్లలో తూడు, గుర్రపు డెక్క వంటివి తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల న్నారు. ఈ సమీక్షలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, సీఎం కార్యదర్శి ఎ.వి.రాజమౌళి, జల వన రుల శాఖ సలహాదారు, అధికారులు వెంకటేశ్వరరావు, లక్ష్మీప్రసాద్, సీఈలు, ఎస్ఈలు, ఈఈలు, తదితరులు పాల్గొన్నారు.