- కుటుంబసభ్యుడు చావుబతుకుల్లో ఉంటే వెళ్లలేదేం?
- జీవిత భాగస్వాములా? వ్యాపార భాగస్వాములా?
- ఒకరిది రాత..మరొకరిది కూత..సాక్షిలో దుష్ప్రచారం
- ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు
- అందుకే దోషిని పరామర్శించేందుకు వచ్చి అవాకులు
- వరద సహాయక చర్యలు ప్రపంచం మొత్తం చూసింది
- తొమ్మిది రోజుల తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్లారు
- తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
- తీర్పుపై అనుమానం ఉంటే రాజీనామా సిద్ధమని సవాల్
మంగళగిరి(చైతన్యరథం): వరదలపై జగన్ బురద రాజకీయం చేయటం సిగ్గుచేటని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. బుధవారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జగన్‌రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిం చారు. వరదల్లో సీఎం చంద్రబాబు తొమ్మిది రోజులు రేయింబవళ్లు వారి మధ్యనే ఉంటూ వారిలో భరోసా నింపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌నే సీఎంవోగా మార్చుకుని వరద సహాయ క చర్యలను పర్యవేక్షించారు. ముంపునకు గురైన ప్రాంతాలు తేరుకున్న తరువాత మంగళ వారం ఇంటికి చేరుకుంటే జైలులో ఉన్న వైసీపీ నేతను పరామర్శించేందుకు వచ్చి జగన్‌రెడ్డి ప్రభు త్వంపై బురద జల్లడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు.
సొంత మనిషి ప్రాణాపాయంలో ఉంటే ఎందుకు వెళ్లలేదు?
జగన్‌రెడ్డి పెద్దనాన్న వై.ఎస్.ప్రకాష్‌రెడ్డికి మనవడు అభిషేక్‌రెడ్డి పులివెందులలో వైసీపీ కోసం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రచారం చేశారు. తమ్ముడి వరుసయ్యే ఆయన హైద రాబాద్ న్యూరో ఆసుపత్రిలో ఐదురోజుల నుంచి కోమాలో ఉంటే జగన్‌రెడ్డి దంపతులు ఎందుకు వెళ్లలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. విజయవాడ వరద బాధితుల విష యంలో ప్రభుత్వాన్ని విమర్శించే లక్ష్యంతోనే ఇక్కడకు వచ్చావ్. అమరావతి విధ్వంసం, ప్రకాశం బ్యారేజ్ ధ్వంసం కుట్రలో నువ్వు రూపొందించిన ఒక నేర ప్రణాళికను అమలు చేసే నీ భాగస్వామి నందిగం సురేష్ కోసమే బయటకు వచ్చావ్. కుటుంబసభ్యుడు కోమా పరిస్థతుల్లో ఉండి ఐదురోజులుగా బ్రెయిన్ స్ట్రోక్‌తో చావు బతుకుల మధ్య ఉంటే అక్కడకు వెళ్లకుండా ఇక్కడకు రావడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
జీవిత భాగస్వాములా? వ్యాపార భాగస్వాములా?
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారతీరెడ్డి రాత.. జగన్‌రెడ్డి కూత అన్న చందంగా నడుస్తుంది. భారతి రాస్తుంది.. జగన్‌రెడ్డి కూస్తాడు. వారి అనుకూల పత్రికలో ప్రకాశం బ్యారేజీ పిల్లర్‌ను ఢీకొట్టిన బోటు యజమాని వక్కలగడ్డ ఉషాద్రి లోకేష్ సన్నిహితుడు అని రాసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తూ అందరినీ కలుస్తున్నారు. దీనికి ఎవరైనా రావొచ్చు. అందులో భాగంగానే బోట్ల యజమాని ఉషాద్రి లోకేష్‌ను కలిసి బోట్ల తాలుకా సమస్య తెలియజేసి వెళ్లారు. ఆ ఫొటోను వాడుకుని విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. కుటుంబసభ్యుల్లో మీ కోసం పనిచేసిన ఒకరు ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉంటే రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా లేదా డబ్బే లక్ష్యంగా పనిచేస్తారంటే అసలు మీరు జీవిత భాగస్వాములా? వ్యాపార భాగస్వాములా? అర్థం కావట్లేదని మండిపడ్డారు.
ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి
ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి. అయితే గత అసెంబ్లీ సమావేశాలను దుమ్మా కొట్టిన జగన్‌రెడ్డి ఈ రోజు గుంటూరు జైలు దగ్గర సందర్భంతో పనిలేకుండా సూపర్ 6 పథకాల గురించి మాట్లాడారు. వాటిపై శాసనసభలో మా ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది. చర్చకు అవకాశం కూడా ఇచ్చింది. ఆ రోజు పారిపోయి ఈ రోజు నాలుగు పేపర్లు పట్టుకుని అ పథకం ఇవ్వలేదు.. ఈ పథకం ఇవ్వలేదంటూ మాట్లాడటం సిగ్గుచేటని మం డిపడ్డారు.
రాజీనామా చేసి ఎన్నికల వెళదామా?
మా ప్రభుత్వం ఏర్పడిన ఈ మూడు నెలల్లోనే నిజంగా నువ్వు అనుకున్నట్లు ప్రజలు ఇచ్చిన తీర్పుపై ఏమైనా అనుమానం ఉంటే తిరువూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేను రాజీనామా చేస్తా.. పులివెందుల ఎమ్మెల్యేగా ఎన్నికైన నువ్వు రాజీనామా చేయి.. మళ్లీ పోటీ చేద్దామని సవాల్ విసిరారు. ప్రజామద్దతు ఎవరికి ఉందో ప్రజలనే అడుగుదామని హితవుపలికారు. పత్రిక ఉందని, చానల్ ఉందని, 24 గంటలు అబద్ధాలతో పబ్బం గడిపే నాయకులు ఉన్నారని ఇష్టం వచ్చినట్లు రాయటం, మాట్లాడటం జరిగితే చట్ట పరిధిలో ఎవరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అదే సమయంలో జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో అన్ని ఆరాచ కాలకు బాధ్యులై ఈరోజు విచారణ ఎదుర్కొంటున్న వారిని మంచి వారిగా చూపించాలను కుంటున్న మీ రాజకీయ నాటకాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. వరద బాధితుల పరా మర్శకు సమయం కేటాయించని జగన్‌రెడ్డి, చావుబతుకుల్లో ఉన్న కుటుంబసభ్యుడు అభిషే క్‌రెడ్డి వైపు చూడని జగన్‌రెడ్డి నేడు నందిగం సురేష్ కోసం జైలు వరకు వెళ్లారంటే రాబోయే రోజుల్లో వారి ఆలోచనలు, ప్రణాళికలు ఏమిటో తెలుస్తుందని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.