- తట్ట కూడా తీయకుండానే కాకాణి ఆరోపణలు సిగ్గుచేటు
- ఆయనవి మొదటి నుంచి దుర్మార్గమైనవి ఆలోచనలే
- సోషల్ మీడియా చిలకగా బురదజల్లే ప్రయత్నాలు
- అత్యాధునిక టెక్నాలజీతో ఇసుక పాలసీ అమలు
- నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్
నెల్లూరు(చైతన్యరథం): పొదలకూరు మండలం సూరాయపాళెం ఇసుక రీచ్‌ను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో కలిసి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అజీజ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇసుక పాలసీని ఖరారు చేయలేదని తెలిపారు. ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అత్యవసర ప్రాతిప దికన డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్టు చెప్పారు. నెల్లూరు జిల్లాలో మూడు డీ సిల్టింగ్ పాయింట్లను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. నిన్నగాక మొన్న బోట్లను తీసుకొచ్చారు..పొక్లెయినర్లతో అడ్డగోలుగా తవ్వి తోలుకోవడం కాదు..బోట్ల ద్వారా డ్రెడ్జింగ్ తీసి ఇసుకను అందుబాటులోకి ఉంచుతారని వివరించారు.
కేజీఎఫ్ తరహాలో దోచుకుని ఇప్పుడు విమర్శలా?
సూరాయపాళెం రీచ్ ద్వారా ప్రజలకు 8 లక్షల టన్నుల ఇసుక సరఫరాకు అనుమతి ఇచినట్టు పేర్కొన్న అజీజ్ ఈ ఇసుక విలువ రూ.10.60 కోట్లు అయితే రూ.100 కోట్ల దోపిడీ జరిగిందని కాకాణి దుర్మార్గపు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోనే అతి తక్కువ ధరకు సూరాయపాళెం రీచ్‌లో డ్రెడ్జింగ్ చేయబోతున్నందుకు అభినందిం చాల్సింది పోయి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఒక్క తట్ట ఇసుక తీయకుండానే కాకాణి తన అలవాటు ప్రకారం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నేను అనేక రీచ్‌లకు వెళ్లి అక్రమాలపై గుండెలు బాదుకుంటూ అరుస్తున్న రోజు ఈ కాకాణి ఎక్కడున్నాడో చెప్పాలని ప్రశ్నించారు. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, కేజీఎఫ్ 3 తరహాలో ఈ ప్రాంతంలోని సహజ వనరు లు మొత్తాన్ని ఆయన కొల్లగొట్టేశాడని ధ్వజమెత్తారు. జేబులోకి వస్తే మాటుండదు.. కడుపు లోకి పోతే సౌండ్ ఉండదనేలా ఉంది కాకాణి పరిస్థితి. సోమిరెడ్డి కుటుంబానికి విదేశాల్లో వెయ్యి కోట్ల ఆస్తులంటూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు…ఆ కేసులో నేను సాక్షిగా కూడా ఉన్నాను. అటువంటిదే ఇసుక రీచ్‌పై ఆరోపణలని ఖండిరచారు.
సమగ్రమైన వ్యవస్థతో ఇసుక పాలసీ
ఇది చంద్రబాబు ప్రభుత్వ మని, సర్వైలెన్స్‌తో ప్రపంచంలో ఎక్కడ నుంచైనా పర్యవేక్షించేలా వ్యవస్థను అందుబాటులోకి తేబోతున్నారని వివరించారు. ఇంత సమగ్రమైన వ్యవస్థతో ఇసుక పాలసీ వస్తుంటే దోపిడీ…దోపిడీ అని విమర్శలు చేయడం దురదృష్టకరం. వరదల గురించి కూడా కాకాణి కామెంట్ చేయడం సిగ్గుచేటు. కనీసం విజయవాడ వైపే వెళ్లకుండా ఇక్కడ కూర్చుని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మొన్నటివరకు మంత్రిగా వెలగబెట్టా డు. కనీసం అక్కడికి వెళ్లి కొందరినైనా ఆదుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. మొన్న సోమిరెడ్డి విజయవాడకు వెళ్లి పలు కంపెనీల ప్రతినిధులతో రూ.2.97 కోట్ల సాయం ఇప్పించారు. అలాంటి మంచి పనులు చేయకుండా ఇక్కడ కూర్చుని సోషల్ మీడి యాలో చిలక పలుకులు పలికితే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనించే జగన్‌రెడ్డి అండ్ కోను తరిమేశారు. సోషల్ మీడియా చిలకగా మారిన కాకాణి పిచ్చి మాట లను వినవద్దని ప్రజలను కోరారు.