- ప్రసాదరెడ్డి అక్రమాలపర్వం వెనుక ఎ2!
- విజయసాయి ఆశీస్సులతోనే విసి అక్రమాలు
- వర్సిటీలో ఏ మూల చూసినా అవినీతి మేట
- కలప దొంగతనం నుంచి ముద్రణాలయం మూతదాకా!
- వర్సిటీలో అడుగడుగునా దోపిడీరాజ్యమే
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – విశాఖపట్నం)
ఆంధ్రా యూనివర్సిటీలో వ్యవహారం కంచే చేనుమేసిన చందంగా తయారైంది. యూనివర్సిటీని కంటికి రెప్పలా కాపాడుతూ విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాల్సిన వైస్‌చాన్స్‌లర్ ప్రసాదరెడ్డే అక్రమార్కుడిగా మారి అడ్డంగా దోచేస్తున్నారు. నిన్నటివరకు విసి ప్రసాదరెడ్డి అడ్డగోలు వ్యవహారాల వెనుక ఎవరో వైసిపి నేత ఉన్నారని మాత్రమే చైతన్యరథం పసిగట్టింది. అయితే వర్సిటీలో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారాలపై చైతన్యరథంలో ధారావాహికలో మొదటి భాగం ప్రచురితమైన ప్రసాదరెడ్డి వెనుక ఉన్న అసలు దొంగ కలుగులో నుంచి బయటకు వచ్చాడు. విశాఖలో తిష్టవేసి 40నెలల్లో 40వేలకోట్లు బొక్కేసిన ఎ2 విజయసాయిరెడ్డే ప్రసాదరెడ్డి వెనుక ఉన్న అదృశ్య హస్తమని తేలిపోయింది. మేమింకా తన పేరు చెప్పక ముందే గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు తడు ముకున్నట్లుగా విజయ సాయిరెడ్డి బుధవారం నేరుగా రంగంలోకి దిగి ప్రసా దరెడ్డికి వత్తాసుపలుకుతూ వరుస ట్వీట్లు పెట్టడం మాకేగాక యావత్ రాష్ట్రప్రజలను విస్మయానికి గురి చేసింది. ప్రజాజీవితంలోకి వచ్చాక ఎ2 బుద్ది మార్చు కున్నారేమోనని మాకు ఎక్కడో కించిత్ డౌటుండేది. ఎయు విసి వ్యవహారంలో విజయసాయి స్పందన చూశాక ఆయన ఏమాత్రం మారలేదని స్పష్టమైంది. సూట్ కేసు కంపెనీలు, క్విడ్ ప్రోకోతో లక్షకోట్లు కొట్టే సిన వ్యవహారంలో తన బాస్‌కు తప్పుడు సలహాలిచ్చి 16నెలలు చిప్పకూడు తిన్న విజయసాయిరెడ్డి వైసిపి అధికారంలోకి వచ్చాక విశాఖలో విశ్వరూపం చూపి స్తున్నాడు. తన అడ్డగోలు వ్యవహారాలకు చదువులతల్లి ఆంధ్రా యూనివర్సిటీని అడ్డగా చేసుకోవడం ఈ కథలో కొత్త ట్విస్ట్.
వాల్యుయేషన్ నుంచి నియమకాల దాకా..
ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి ఆచా ర్య ప్రసాద్‌రెడ్డి పరిపాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్నీకావు. ప్రసాదరెడ్డి నేతృతృంలో విద్యార్థి, పరిశోధక ఉద్యోగులపై వేధిం పులు నిత్యకృత్యంగా మారా యి. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో తమ సొంత, బినామీ కళాశాలలకు మేలు చేకూర్చేందుకు భారతదేశంలో ఏ విశ్వవిద్యాల యంలో లేనివిధంగా – రీవాల్యుయేషన్ ప్రక్రియనే మార్చేశారు విసి ప్రసాదరెడ్డి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ‘రీ-రీవాల్యుయేషన్ ‘ప్రక్రియలో సదరు విద్యార్థి పాస్ అయ్యేంతవరకు జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేస్తూ వారి బినామీ కళాశాలలకు అనుచిత లబ్ధి చేకూ రుస్తూ భారీ అవినీతికి తెరలేపారు. ఈ విషయమై గవర్నర్ తోపాటు ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. అయినా పట్టించుకోకపోవడంతో ‘రీ- రీవా ల్యుయేషన్’పై కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
నిబంధనలకు విరుద్దంగా పిహెచ్‌డి అడ్మిషన్లు
ఆంధ్ర యూనివర్సిటీలో ట్రాన్స్ డిసిప్లినరీ కోటా కింద రీసెర్చ్ హబ్ అనే ఒక ప్రతిపాదన తెచ్చి యుజిసి నిబంధనలకు విరుద్ధంగా 500మందికి పైగా అనర్హులకు పిహెచ్‌డి అడ్మిషన్లు ఇచ్చారు. ఇందుకు గాను ఒక్కొక్క అభ్యర్థి నుండి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. ఎగ్జిక్యూటివ్ కోటా కింద ఇచ్చే పీహెచ్‌డి అడ్మిషన్లపై హైకోర్టు తీర్పు గతంలో నిబంధ నలకు విరుద్ధంగా ఇవ్వవద్దని వెలువరించినప్పటికీ ఎగ్జిక్యూటివ్ కోటా పేరు మార్చి ట్రాన్స్ డిసిప్లినరీ కోటా కింద పిహెచ్‌డి సీట్లను ఇష్టారాజ్యంగా ఇచ్చేశా రు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు డిగ్రీ కళాశా లలో పనిచేస్తున్న వారికి కూడా అర్హత లేకుండా రీసెర్చ్ గైడెన్స్ ఇచ్చి వారికి అక్రమంగా అడ్మిషన్లు కట్టబెట్టి వారికోసం రీసెర్చ్ డైరెక్టర్లను కేటాయించారు. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని యూనివర్సిటీ కోడై కూస్తున్నా వడ్డించేవా డు వైసిపి అధినేత కావడంతో పట్టంచుకునే నాథుడే కరువయ్యాడు.
నిబంధనలకు విరుద్దంగా నియామకాలు
యుజిసి నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 30 మంది తమ సొంత వ్యక్తులకు అడ్జసెంట్ ప్రొఫెసర్స్ గా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటించ కుండా, ఎటు వంటి రోస్టర్ లేకుండా లక్షలాది రూపాయల జీతంతో నియమించారు. భారీఎత్తున సొమ్ములు చేతులు మారి న ఈ వ్యవహారంపై విచారణ జరపాలని విద్యార్థి సం ఘాలు డిమాండ్ చేశాయి. పదవీ విరమణ చెందిన దాదాపుగా 42 మంది ఆచార్యులను నిబంధనలకు తిలోదకాలిచ్చి వారిని హానరరీ ప్రొఫెసర్లుగా నియమించి రెగ్యులర్ పోస్టులకు సంబంధించిన పదవులు కేటాయించారు.
కొనుగోళ్లలో భారీగా అక్రమాలు
పదవీ విరమణచేసిన ఆచార్య వడ్డాది కృష్ణ మోహన్ ను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్ గా నియమించి కంప్యూటర్ కొనుగోళ్ల నుండి ఓఎంఆర్ ఆన్సర్ షీట్‌ల కొనుగోలు తదితర వ్యవహారాలతో అవి నీతి అక్రమాలకు తెరలేపారు. అడ్డగోలుగా అనేక మందిని నియమించడంతోపాటు ప్రమోషన్స్ ఇవ్వడం కోసం యూనివర్సిటీలో గతంలో ఎన్నడూ లేని లంచా ల కుసంస్కృతిని ప్రవేశపెట్టారు. ఆంధ్ర యూనివర్సి టీలో జరిగే వివిధ లావాదేవీలు కోసం ప్రభుత్వ బ్యాం కులు, సర్వీసు బ్యాంకులు ఉండగా, వాటితో ఒప్పం దాలను రద్దు చేసుకొని ప్రైవేటు బ్యాంకులైన ఐసిఐసి ఐ, హెచ్.డి.ఎఫ్.సి వంటితో ఒప్పందాలు చేసుకున్నా రు. కమీషన్ల కోసం సర్వీస్ బ్యాంకుల్లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఫిక్స్ డిపాజిట్లను మార్చివేశారు. సిఎస్ ఆర్ నిధుల కింద ఆంధ్ర యూనివర్సిటీకి వివిధ సం స్థలు ఇచ్చే నిధులను, యుజిసి విడుదల చేసిన రూసా పథకం నిధుల కింద నిర్మించే భవనాలను వేర్వేరుగా చూపించి కోట్లాది రూపాయల సి ఎస్ ఆర్ నిధులను పక్కదారి పట్టించారు.
విద్యార్థులపై మోయలేని భారం
యూనివర్సిటీకి వివిధ ఆదాయమార్గాలు ఉండగా, ఆర్థిక క్రమశిక్షణ చేతగాని విసి ప్రసాదరెడ్డి ఫీజుల పెంపుతో విద్యార్థులపై మోయలేని భారం మోపారు. డిగ్రీ, పీజీ ,పీహెచ్ డి అనే తేడా లేకుండా ఫీజులను విపరీతంగా పెంచి నిర్వహణ వ్యయం తగ్గించు కోవడం కోసం హాస్టల్స్‌ను సైతం నెలలపాటు మూసి వేసి తుగ్లక్ చర్యలను తలపించారు. కేవలం పరీక్షలకు మాత్రమే విద్యార్థులకు అనుమతించి వర్సిటీ అకడ మిక్ వాతావరణాన్ని కలుషితం చేశారు. క్లాసులు జరపకుండా, రీసెర్చ్ జరగనీయకుండా విశ్వవిద్యాల యాన్ని భ్రష్టుపట్టించారు. మహారాణిపేట లేడీస్ హాస్టల్, ఇంజనీరింగ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ హాస్టల్స్ లో వార్డెన్లు తమ ఇష్టానుసారం ఉద్యోగులను ఎటు వంటి నోటిఫికేషన్ లేకుండా లంచాలు తీసుకొని నియమిం చుకుంటున్నారు. విద్యార్థులకు అందించ వలసిన నాణ్యమైన మెనూ ఇవ్వకుండా, వార్డెన్లు కాంట్రాక్టర్ల నుండి లంచాలు తీసుకుని విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. మెస్ బిల్లులు, కరెంటు బిల్లులు విపరీతంగా పెంచి కార్పొరేట్ సంస్థలకు మించి విద్యార్థులను దోపిడీకి గురి చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోకుండా పాపపుసొమ్మును పంచుకుతింటున్నారు.
కమిషన్ల కక్కుర్తితో ముద్రణాలయం మూత
కమిషన్ల కక్కుర్తితో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంతో చరిత్ర కలిగిన అదునాతనమైన సామాగ్రి కలిగిన ముద్రణాలయాన్ని మూతవేయించారు. పేపర్, స్టేషనరీ కొనుగోళ్లలో వచ్చే కమిషన్ల కోసం ఏకంగా ముద్రణాలయాన్ని మూసివేసి, అందులో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన టెక్నికల్ ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీచేశారు. వారితో ఏ అవసరం లేని సామాన్య క్లర్కులుగా నియమించారు. పేపర్, ఇతర సామగ్రిని ప్రైవేటు వెండర్స్ నుండి కొనుగోలు చేస్తూ కోట్లాది రూపాయల అవినీతి, అక్రమాలకు తెరలేపారు.