జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వస్టర్ల సమ్మిట్ నిర్వహించింది. సంతోషం. కానీ రాష్ట్రంలో తాలిబన్ల పాలనను తలపిస్తున్న పరిపాలనలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఎలా ముందుకు వస్తారో ప్రభుత్వానికే తెలియాలి. సమ్మిట్ ముసుగులో ఏర్పాట్ల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమాలు నిర్వహించింది ప్రభుత్వం. అవి ఎక్కడా విజయవంతం కాలేదు. దేశ, విదేశాల నుంచి పెట్టుబడిదారులు వస్తున్నారని ఊదరగొడుతున్నారు.కానీ జగన్ రెడ్డి అప్రజాస్వామిక పరిపాలన చూసి ఎవ్వరు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చే అవకాశం లేదు.రాష్ట్రంలో ఆటవిక రాజ్యాన్ని ఏలుతున్న జగన్ రెడ్డి పాలన కూడా తాలిబన్ల పాలనను మరిపిస్తున్నది.
ప్రతిపక్షాలు నోరెత్తకూడదు,సభలు, సమావేశాలు పెట్టుకోకూడదు, మీడియాలో తమని ఎవ్వరూ విమర్శించకూడదు అనే ఉన్మాదం బుసలు కొడుతున్నది జగన్ పాలనలో.ఈ అప్రజాస్వామిక, అరాచక,అద్వాన్నపరిపాలన చూసి ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారా? అలా వస్తారని ఆశపడటం కూడా అత్యాసే అవుతుంది.రాష్ట్రంలో నెలకొన్న అద్వాన్నపరిస్థితులను,టెర్రరిజం పాలన గురించి దేశవ్యాప్తంగా ఉదహరించుకొంటున్నారు. కనీసం పత్రికా స్వేచ్ఛ కూడా లేని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు మాత్రం ఎందుకు వస్తారు? రాష్ట్రంలో ఉన్న రహదారుల దుస్థితి ఘోరంగా వుంది, విద్యుత్ కోతలు, నీరు, ఇసుక కొరత కారణంగా ఏ ఒక్కరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదు.రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అనుకూల వాతావరణం ఉందని పెట్టుబడిదారులు భావించాలి. కానీ అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు,లా అండ్ ఆర్డర్ లేవని జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం సాగుతుంటే రాష్ట్రం ముఖం చూసేదెవరు.
అధికారంలోకి వచ్చీ రాగానే అమరావతిని చంపేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు.పీపీఏలను రద్దు చేశారు. రివర్స్ టెండరింగ్ అంటూ కాంట్రాక్టు సంస్థలను వెంటబడి వేధించారు. పెట్టుబడులు పెట్టాలంటే వైసిపి నాయకులకు ముడుపులే కాదు ఆయా పరిశ్రమల్లో వాటాలకోసం బెదిరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే భయపడి పారిపోయే పరిస్థితి తెచ్చారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి భయానక వాతావరణం నెలకొనడం, ప్రతిపనిలో నీకది – నాకిది అనే ఫార్ములాకు భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోయ్యారు.రాష్ట్రంలో గత నాలుగేళ్లలో రూ 17లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి.అంకుర సంస్థల [స్టార్టప్] ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్, బీహార్ కన్నా వెనక బడింది.2022 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా 86,713 స్టార్టఫ్ లు ఏర్పాటు కాగా వాటిలో 1,341 అంకురాలతో ఆంధ్రప్రదేశ్ 15 స్థానానికి దిగజారడం సిగ్గుచేటు. 4,566 స్టార్టఫ్ లతో తెలంగాణ 8 స్థానంలో నిలిచింది, కేంద్రం ప్రకటించిన స్టేట్స్ స్టార్టప్స్ ర్యాoకింగ్ ఎక్సయిజ్ -2022 లో తెలంగాణా తెలంగాణ టాప్ పేర్పార్మర్ గా 7 వ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 29 స్థానానికి పరిమితం అయింది.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలతో ఒప్పందం అన్నది మనకి ఆసక్తి ఉంది అనగానే అవతలి వాళ్ళు ఉత్సాహంగా వచ్చి సంతకాలు పెట్టేదికాదు. పెట్టుబడిదారులు పేరంటానికి వచ్చినట్లు రారని,ఒక చోట పెట్టుబడి కి భరోసా ఉందని నమ్మకం కుదిరి నప్పుడే పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారని అనిల్ అంబానీ గతంలో నే చెప్పారు. రాష్ట్రం లో మౌలిక వసతుల కల్పన,పరిశ్రమల ఏర్పాటు,లేదా వ్యాపార రంగం,లేదా నిర్మాణ రంగం ఇలా ఏ రంగంలో అయినా పెట్టుబడులు పెడుతున్నారంటే దానివల్ల పరస్పర ప్రయోజనం ఉందని నమ్మితేనే ఒప్పందాలు కుదురుతాయి.భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం వల్ల స్వల్పకాలంలో కాకపోయినా దీర్ఘ కాలంలో అయినా ప్రయోజనం ఉంటుందని,అదీ స్థిరంగా ఉంటుందని పెట్టుబడి దారులకు విశ్వాసం కలిగించడం ప్రధానం. కానీ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న తాలిబన్ల రాజ్యంలో ఇలాంటి విశ్వాసం కలిగించడం అంత సులభంగా జరిగే పనేనా అని ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎవరు అవునన్నా,కాదన్నా పారిశ్రామికాంధ్ర ఆవిష్కారణకు గత ఐదేళ్లు అన్ని విధాలా అవిరళ కృషి జరిగింది.
చంద్రబాబు బ్రాoడ్ తోనే పెట్టుబడులు బారులు తీరాయి.రాష్ట్రంలో వనరులు, పరిశ్రమల ఏర్పాటులో మనం కల్పించే సౌలభ్యాలను, ప్రోత్సాహకాలను, నాయకుడి చిత్తశుద్ధి, సమర్ధత, క్యారెక్టర్ బట్టి పరిశ్రమలు ఏర్పాటుకు సుముఖత చూపిస్తారు. ఇతర రాష్ట్రాలతో పోటీ పడి పెట్టుబడుల కోసం జాతీయ,అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం సామాన్యమైన విషయం కాదు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు కుదురుకోలేదు. అటు పాతుకుపోయిన తెలంగాణ,ఇటు ప్రపంచ స్థాయి సౌకర్యాలు వున్న కర్ణాటక, తమిళనాడు తోనూ పోటీ పడటం అంత సులభంకాదు. అటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా మెరుగైనదో నిరూపించడం పారిశ్రామిక వేత్తలను ఒప్పించడం లో చంద్రబాబు సమర్ధత. చాతుర్యం, విశ్వసనీయత ఉపయోగపడ్డాయి.
గత ఐదేళ్లు రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడంలో అన్ని రాష్ట్రాలకు అందనంత దూరంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. 21 రోజుల్లో క్లియరెన్స్ లు వంటి ఫాలసీలు తేవచ్చు,ప్రచార ప్రకటనలతో హోరెత్తించవచ్చు,అంతటి ఆగిపోదు నది వద్దకు వచ్చిన గుర్రాన్ని నీళ్లు తాగించే సమర్ధత, తెలివి ఉండాలి. రాజును బట్టే రాజ్యం,రౌతుని బట్టే గుర్రం అన్న సామెతగా ప్రభుత్వాన్ని నడిపించే నాయకత్వం ఎంత బాగా పనిచేస్తే రాష్ట్రం అంత అభివృద్ధి అవుతుంది.భారతీయులు మనస్సు పెట్టి 18 గంటలు కూడా కష్టపడతారని తెలుసు.కానీ ఒక స్టేట్ కి సీఎంగా వున్న చంద్రబాబు కూడా అంతకంటే ఎక్కువ శ్రమపడతారని ఊహించ లేదని ఎయిర్ బస్ చైర్మన్ కాంప్లి మెంట్ ఇచ్చారు.
గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రతినిధి బృందం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో సింగపూర్, జపాన్, చైనా, అమెరికా, దావోస్, దక్షిణ కొరియా వంటి దేశాలలో పర్యటించి రాష్ట్రంలో రాజధాని మొదలు కొని మౌలిక వసతులు కల్పన,పరిశ్రమలు ఏర్పాటు వరకు అక్కడి ప్రభుత్వాలతోను, అక్కడి పారిశ్రామిక సంస్థలతోను అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్ర విభజన జరిగి రూ 16 వేల కోట్ల రూపాయల లోటుతో నవ్యాoధ్ర ఆవిర్భవించింది.హైదరాబాద్ లోని స్థిరాస్థులు,ఆంధ్రప్రదేశ్ కి సంక్రమించవని,రాష్ట్ర పునర్వీవస్థీకరణ చట్టం స్పష్టం చేస్తున్న పరిస్థితుల్లో మనకి సొంత రాజధానిలేక, సొంతం అనే ఆస్తులు కూడా లేక, ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కోసం కేంద్రం పై ఆధార పడాల్సిన పరిస్థితి మనది.
ఈ దశలో నవ్యాoద్ర కి ఉజ్వల భవిష్యత్ ఉంది. కాబట్టి మీరు మమ్మల్ని నమ్మి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి,మాకు కావాల్సిన నిర్మాణాలు చేసిపెట్టండి అంటూ కోరిన వెంటనే విదేశీ ప్రభుత్వాలు,విదేశీ సంస్థలు స్పందిస్తాయా?కానీ స్పందించాయి . రాజధాని నిర్మాణానికి ప్రణాళిక రచనలో సింగపూర్ ఆసక్తి చూపింది.మౌలిక వసతుల నిర్మాణంలో జఫాన్ కంపెనీలు ఆసక్తి చూపాయి. పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేసే చైనా కంపెనీలు,దక్షిణ కొరియా పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపారు అనేక ఒప్పందాలు కుదిరాయి. అంటే కేవలం నవ్యాoధ్రా లోని అపార ఖనిజ సంపద,పకృతి వనరుల మాత్రమే కాదు ప్రభుత్వాధినేత సమర్ధత,చిత్తశుద్ధి,అంకితభావం పట్ల ఒక విశ్వాసం.ఈ ఒప్పందాలకు కారణమైంది.
ఇది ప్రకటనలు,ప్రచారాలు ద్వారా జరిగింది కాదు. సమర్ధమైన,విశ్వసనీయ మైన నాయకత్వ మేధస్సు వల్ల సాధ్యమైంది. ఆటోమోభైయిల్ రంగంలో ఇసుజు,కియా మోటార్,అపోలో టైర్లు,అశోక్ లేలాండ్,భారతపోర్జ్, హీరో గ్రూపు రాగా,ఐటీ సెల్ ఫోన్ తయారీ రంగం లో ఫాక్స్ కాన్, సెల్ కాన్,ప్లెక్స్ ట్రానిక్స్,డిక్స న్,రిలయన్స్, టీసియల్,ఓల్టాస్ వంటి ఎన్నో సంస్థలు వచ్చాయి. దెశ,విదేశాల నుంచి పెట్టుబడులు రావాలి.రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అనుకూల వాతావరణం ఉందని పెట్టుబడిదారులు భావించాలి. కానీ అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు,లా అండ్ ఆర్డర్ లేవని జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం సాగుతుంటే రాష్ట్రం ముఖం చూసేదెవరు?
పెట్టుబడులు పెట్టె వారు ముందు రాష్ట్రంలో వున్నఅద్వాన్న పరిస్థితులను చూసి ఎవరన్నా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా?రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా?నిరంతర విద్యుత్తు అందు బాటులో ఉన్నదా?రహదారులు అద్భుతంగా అద్దంలా ఉన్నాయా? ఈ మూడు పరిపూర్ణంగా ఉండాలి. పెట్టుబడులు కోసం గ్లోబల్ ఇన్వస్టర్ల సమ్మిట్ అంటూ పెద్ద ఎత్తున బిల్డప్ ఇస్తున్నారు?కానీ గ్లోబల్ ఇన్వస్టర్ల సమ్మిట్ కు ప్రభుత్వం చేసే ఖర్చు మాత్రం అయినా పారిశ్రామిక వేత్తలు నుండి పెట్టుబడులు సాధించగలరా? జగన్ రెడ్డి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు,అనాలోచిత నిర్ణయాలు,నిరంకుశ చర్యలతో రాష్ట్రం తిరోగమన బాటపట్టింది.
పెట్టుబడులు ఆకర్షించడంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు కి నెట్టబడింది. పారిశ్రామిక రంగం కుదేలు అయింది.నిరుద్యోగం పెరిగిపోయిది.కక్ష పూరిత, అసమమర్ద పాలనలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమ్యగోచరం మైంది. సంకుచిత రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ మూల్యం చెల్లిస్తుంది.ఎవరు ఏమన్నా గత ఐదేళ్లు పారిశ్రామికాంధ్ర ఆవిష్కారానికి కృషిజరిగింది. భారత వాణిజ్య యవనిక పై తనదైన ముద్రవేశారు చంద్రబాబు. ఆయన బ్రాoడ్ తోనే పెట్టుబడులు బారులు తీరాయి.నేడు జగన్ రెడ్డి అప్రజాస్వామిక,అరాచక,విధ్వంస పరిపాలన చూసి ఎవ్వరు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చే అవకాశం లేదు.రాష్ట్రంలో ఆటవిక రాజ్యాన్ని ఏలుతున్న జగన్ రెడ్డి పాలన కూడా తాలిబన్ల పాలనను మరిపిస్తున్నది.