• కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇస్కపాలెం గ్రామ పంచాయితీ సభ్యులు, ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా పంచాయతీకి ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులు రావడం లేదు.
• ఫైనాన్స్ కమిషన్ విడుదల చేసిన నిధులను పంచాయితీకి చేరకుండానే ప్రభుత్వం దారిమళ్లించింది.
• మేం సొంత డబ్బులు పెట్టి చేసినా పనులకు బిల్లుల కూడా పెట్టడం లేదు.
• పంచాయతీలో సొంత డబ్బుతో పనులుచేసి అప్పుల పాలైపోతున్నాం.
• మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలి.
• మా గ్రామంలోగల 52సెంట్ల స్థలాన్ని ఎంపీయూపీ స్కూలుకు ఆటస్థలం కేటాయించారు.
• ఆ స్థలం తనదంటూ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.
• దీనిపై షికారు కోటేశ్వరరావు అనే వ్యక్తి కోర్టుకు వెళ్లగా, ఆధారాలన్నీ పరిశీలించి ఆట స్థలాన్ని పాఠశాలకే కేటాయిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.
• అయినప్పటికీ కోటేశ్వరరావు ఆ స్థలాన్ని ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మాణం చేపట్టాడు.
• దీన్ని నిలదీసిన వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాడు.
• పాఠశాల ఆటస్థలాన్ని కాపాడి విద్యార్థులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు.
• పంచాయితీల అభివృద్ధికి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రూ.8660 కోట్ల నిధులను దారిమళ్లించారు.
• జగన్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా వైసిపికి చెందిన సర్పంచ్ లు కూడా అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
• ఇటీవల దర్శి నియోజకవర్గం ఒక మహిళా సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాం.
• కేంద్రం ఇచ్చే నిధులతోపాటు రాష్ట్రప్రభుత్వం తరపున కూడా నిధులిచ్చి పంచాయితీల్లో రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తాం.
• ఇస్కపాలెంలో ఆక్రమణకు గురైన స్కూలు ఆటస్థలాన్ని స్వాధీనం చేసుకొని, విద్యార్థులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతాం.