అమరావతి: విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను సాధించుకోవడంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శాసనసభ నుం చి సస్పెండ్ అయిన అనంతరం శుక్రవారం శాసన సభ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడున్నర సంవత్సరాల్లో జగ న్‌రెడ్డి అనేక సార్లు ఢీల్లీ వెళ్లారని, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అయితే అక్కడే నివాసం ఉంటున్నట్లు తెలిపారు. కడపకు స్టీల్ ప్లాంట్ కావాలని విభజన చట్టంలో మీరే పెట్టారని, కోరిన విధంగా ఆంధ్రప్రదేశ్ కు స్టీల్ ప్లాంట్ ఇవ్వండని ఒక్క రోజైనా ఒక్క వినతి పత్రం అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ఇవ్వమని కేంద్రాన్ని అడగకుండా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహ న్‌రెడ్డి సొంత జిల్లాలోకే ఒక్క పరిశ్రమ తీసుకురాలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని చెప్పారు. సిగ్గు లేకుం డా అసెంబ్లీలో పారిశ్రామిక విధానంపై చర్చపెట్టారని విమర్శించారు. సమయం వృధాయే తప్ప దానివల్ల ఏమీ ఉపయోగంలేదన్నారు. ఈ మూడున్నర సంవత్స రాల్లో రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ దేవుడెరుగు, విశాఖ స్టీల్ ప్లాంట్ అటకెక్కే పరిస్థితికి వచ్చిందన్నారు. దీనికి జగన్, ఈ ప్రభుత్వమే కారణమన్నారు. ఈ విషయాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్ప లేక పిట్టకథల మంత్రి రాజేంద్రనాథ్‌రెడ్డి ఆవు తెల్లగా ఉండును, నాలుగు కాళ్లుండును, పాలిచ్చును అని ఆవు కథ చెబుతున్నారని మండిపడ్డారు.ఈ కథే ఈ మూడున్నర సంవత్సరా ల నుంచి చెబుతున్నారు తప్ప ఒక మంచి కార్యక్రమం ఈ రాష్ట్రానికి చేశాం అని చెప్పే పరిస్థితి లేదచెప్పా రు. ఆడలేనమ్మ మద్దెల ఓడు అన్నట్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక కరోనాపైకి నెపంనెడుతున్నారని ధ్వజమెత్తారు.అసమర్థులే ఇలాంటి మాటలు మాట్లాడ తారని,జగన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అసమర్థ ప్రభుత్వ మని మండిపడ్డారు. చంద్రబాబునాయుడు రాష్ట్ర అభి వృద్ధిలో అగ్రగణ్యులు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.