- లోకేష్ వారసుడు మాత్రమే కాదు, పరిణితి కలిగిన రాజకీయ నాయకుడు, పోరాట యోధుడు
- జగన్‌రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్రానికి భవిష్యత్
పోలిపల్లి: టీడీపీ, జనసేన కలిశాయి…ఇక వైసీపీకి దబిడిదిబిడే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 5 కోట్ల ఆంధ్రులంతా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. రానున్న ఎన్నికలు టీడీపీ`జనసేన, వైసీపీ మధ్య జరిగే ఎన్నికలు కాదు. రాష్ట్ర ప్రజలకు-దోపిడీదారుడికి మధ్య జరిగే యుద్ధం. ప్రజల కోసం ఒక్కటైన టీడీపీ-జనసేన నాయకత్వాన్ని ఆదరించాలి, ఆశీర్వదించాలని అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో బుధవారం జరిగిన యువగళం ` నవశకం బహిరంగసభలో అచ్చెన్నాయు డు మాట్లాడుతూ నేల ఈనిందా… ఆకాశానికి చిల్లు పడిరదా… భీమిలి నుంచి సముద్రం పోలిపల్లికి వచ్చిం దా అన్నట్లు సభాప్రాంగణానికి జనం తరలివచ్చారన్నా రు. జనవరి 27న లోకేష్ కుప్పంలో యువగళం పాద యాత్ర ప్రారంభించినప్పుడే చెప్పాను.. లోకేష్ కేవలం చంద్రబాబు వారసుడు కాదు.. పరిణితి కలిగిన రాజ కీయ నాయకుడని. 226రోజులు 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశాక లోకేష్‌ను చూస్తుంటే.. నాయకుడే కాదు పోరాట యోధుడని అర్థమవుతోంది. చంద్రబాబు గతంలో పాదయాత్ర చేశారు. వైఎస్, సైకో జగన్ కూడా చేశారు. వారి పాదయాత్రలకు టీడీపీ పాలనలో ఎలాంటి ఆటంకాలు..అడ్డంకులు కల్పించలేదు. కానీ లోకేష్ పాదయాత్రకు సైకో జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించాడో, ఎంతగా ఇబ్బందిపెట్టాడో అందరం చూశాం. వాటన్నింటినీ అధిగమించి తాను చేపట్టింది యువగళం పాదయాత్ర కాదు.. ప్రజాగళమ ని లోకేష్ నిరూపించాడు. ప్రభుత్వ తప్పులు.. అవినీతిని ప్రజల్లో ఎండగట్టాడు. లోకేష్ మనకోసం పనిచేసే భవిష్యత్ నాయకుడు. ఈసభకు ఒక ప్రాధాన్యత ఉంది. ఈ సభ యువగళం ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న విజ యోత్సవ సభ మాత్రమే కాదు.. ఏ తప్పూ చేయని మన నాయకుడిని 52రోజులు అన్యాయంగా జైల్లో పెట్టి.. ఆయన బయటకు వచ్చాక జరుగుతున్న అతి పెద్ద సభ. మూడోది తెలుగుదేశం-జనసేన పూరించిన ఎన్ని కల శంఖారావంలో భాగంగా జరుగుతున్న సభ. లక్ష లాదిగా తరలివచ్చిన జనంతో ఎటు చూసినా జన ప్రభంజనమే కనిపిస్తోంది.
తెలుగుదేశం కార్యకర్తలు.. జనసైనికులు కలిసి పనిచేయాలి. మనం కలవడంతో బలహీన వర్గాలను టీడీపీకి దూరం చేసేందుకు జగన్ రెడ్డి కొత్త డ్రామాలు మొదలెట్టాడు. బలహీనవర్గాలను తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేయడం నీ తరం కాదు జగన్‌రెడ్డి. నీ తండ్రి తరం, తాత తరం కూడా కాదు. తెలుగుదేశంపార్టీ బలహీనవర్గాల కోసమే పుట్టిం ది. ఆ పార్టీ వచ్చాకే బలహీన వర్గాలను ఆదుకుంది. తెలుగుదేశం-జనసేన పార్టీల్లో బలహీనవర్గాల నాయ కులు నాయకత్వం చేస్తుంటే..వైసీపీలో అదేనేతలు బాని సలుగా బతుకుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.
ఉత్తరాంధ్రను విజయసాయి, వైవీసుబ్బారెడ్డికి అప్పగించి మొత్తం జగన్ దోచేశాడు
వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రలో 5 ఏళ్లుగా ఎవరి పెత్తనం సాగుతుందో చూస్తున్నాం. వై.వీ. సుబ్బా రెడ్డి, విజయసాయిరెడ్డికి జగన్ ఉత్తరాంధ్రను రాసి పెట్టాడు. బొత్స సత్యనారాయణ.. ధర్మాన ప్రసాదరావు కి చీము నెత్తురు ఉంటే తక్షణమే రాజీనామా చేసి తమ ప్రాంతం గురించి మాట్లాడాలి. బలహీన వర్గాలకు నాయకత్వం అప్పగించే ధైర్యం జగన్‌రెడ్డికి లేదు. 5 ఏళ్లలో మొత్తం దోచేశాడు. ఉత్తరాంధ్రను దారుణంగా దోచుకుతిన్నాడు. ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడు.
తెలుగుదేశం పార్టీతో పవన్‌కల్యాణ్ కలిశాడు. ఇక జగన్‌రెడ్డికి దబిడి..దిబిడే. వైసీపీకి చాలా జిల్లాల్లో డిపా జిట్లు కూడా రావు. మన మధ్య విబేధాలు తీసుకురావ డానికి ఈ సైకో కుట్రలు చేస్తాడు. తన స్వార్థం కోసం కులాలు.. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిన ఘనుడు జగన్. తెలుగుదేశం-జనసేన కార్యకర్తలు, నాయకులు జాగ్రత్తగా పనిచేయాలి. 100 రోజుల్లో రాష్ట్రానికి పట్టి న శని జగన్‌రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్ర ప్రజలకు బతుకు ఉంటుందని తెలుసుకోండి. అన్నివర్గా ల ప్రజలు కులాలు.. మతాలు.. ప్రాంతాలకు అతీతం గా తెలుగుదేశం-జనసేన పార్టీలను ఆదరించాలి. తటస్థులు…మేథావులు… కదలిరావాల్సిన సమయం వచ్చింది. నిరుద్యోగులు తమ భవిష్యత్ ను ఈ రెండు పార్టీల పునాదులపై నిర్మించుకోవా ల్సిన సమయం వచ్చిందని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.