.భారత్ నిర్మాణంలో అందరం భాగస్వాములవుదాం
.హైదరాబాద్లో జెండా ఆవిష్కరించిన యువనేత లోకేష్
అమరావతి: ఆంగ్లేయుల వలస పాలన నుంచి విముక్తి కల్పించి, స్వాతంత్య్రం సాధించిన అమరులైన సమరయోధుల త్యాగాలు స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆధునిక భారత్ నిర్మాణంలో అందరం భాగస్వాములవుదామంటూ దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నివాసం లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జాతీయ జెండాని ఎగురవేశారు. భద్రతా సిబ్బంది ఆయనకు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా మిఠా యిలు పంచి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేశారు. సిబ్బంది యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
నేడు సంజీవని ఆరోగ్యరథం ప్రారంభం
మంగళవారం సాయంత్రం 5 గంటలకు మంగళగిరి పట్టణంలోని టిప్పర్ల బజార్లో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభిస్తారు.