- కమీషన్ల కోసం వైసీపీ నేతల కక్కుర్తి పనులు
- హిందువుల మనోభావాలను దెబ్బతీశారు
- వారిపై ఖచ్చితంగా విచారణ ఉంటుంది
- తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలి
- టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి
అమరావతి(చైతన్యరథం): తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమంపై చంద్ర బాబు చేసిన వ్యాఖ్యలు తప్పెలా అవుతాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేఖరుల సమావే శంలో మాట్లాడుతూ చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో వైసీపీ చేసిన అక్రమం గురించి వివరించారు. వైసీపీ ప్రభుత్వం చేసింది అతిపెద్ద తప్పు..వైసీపీ నాయకులు వెంకటే శ్వర స్వామిని అన్నివిధాలుగా భ్రష్టు పట్టించారు..తిరుపతి లడ్డూలు తింటున్నప్పుడు చెడు వాసన వస్తోందని అనేకసార్లు మనకు ఫిర్యాదులు వచ్చాయి. లడ్డు నాణ్యత లేదని, చర్యలు తీసుకోవాలని చాలామంది టీటీడీ ఈవో, ముఖ్యమంత్రికి ఫిర్యాదులు చేశారు. ఫోన్ ఇన్ ఈవో కార్యక్రమంలో చాలామంది భక్తులు తిరుపతి లడ్డూలో నాణ్యత లేదని ఫిర్యాదు చేశారు. తిరుపతి ప్రసాదాలు ఎందుకు బాగలేవో తేల్చాలని కూటమి ప్రభుత్వం రాగానే ఒక కమిటీని వేశాం. భోజనాలు కూడా ఎందుకు సరిగా లేవో తేల్చాలని కోరాం.
టీటీడీలో నాసిరకం నెయ్యి వినియోగం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్వామివారి ప్రసాదం ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఏ విధంగా ఉందో భక్తులను అడిగితే చెబుతారు. వైసీపీ హయాంలో నెయ్యి, జీడిపప్పు, బాదంపప్పు, తదితర పదార్థాలు నాసిరకం వాటిని ఉపయోగించడం వల్ల లడ్డూలలో నాణ్యత పడిపోయిందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. భక్తులు ఎన్నోసార్లు ఈ అంశంపై నిలదీశారు. కర్ణాటకకు చెందిన నందిని కోపరేటివ్ డెయిరీ రాయితీపై స్వామి వారి మీద భక్తితో తక్కువ రేటుకు సరఫరా చేస్తున్నా కమీషన్లు రావనే ఉద్దేశంతో ఆ సంస్థను పక్కనపెట్టి కక్కుర్తితో ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు.
కిలో ఆవు నెయ్యి రూ.400 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. కానీ రూ.320కే సరఫరా చేస్తామంటూ కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. వాటి గురించి ఎటువంటి విచారణ జరపకుండా ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంస్థలు నాసిరకపు నెయ్యిని రూ.320కే సరఫరా చేశాయనేది వాస్తవం. లడ్డూలు తయారుచేసేందుకు రోజుకు టీటీడీకి 15 వేల కిలోల నెయ్యి అవసరం. దీని విలువ రూ.200 కోట్లు ఉంటుంది. నాసిరకం నేతిని నిర్ధారించిన ల్యాబ్ నేతి నాణ్యతను పరిశీలించేందుకు ఈ ఏడాది జూలై 8న ల్యాబ్‌కు పంపించగా పరిశీలించి 16వ తేదీన నివేదిక ఇచ్చారు. ల్యాబ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యతను పరిశీలిస్తుంది. 17025 గుర్తింపు పొందింది. డెయిరీ ఉత్పత్తులను పరిశీలించడంలో అనుభవం ఉంది. ప్రభుత్వంతో పాటు అనేక సంస్థలు ఈ సంస్థ సేవలను ఉపయోగించుకుంటున్నాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యా తులు కలిగిన సంస్థ. ఈ సంస్థ నివేదికలను ఆధారంగా చేసుకుని అనేక ప్రభుత్వరంగ సంస్థలు పనిచేస్తున్నాయి.
చేప నూనె, పందికొవ్వు, బీఫ్ టాలో
టీటీడీ పంపించిన నేతిని పరిశీలిస్తే సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తిగింజలతో పాటు చేప నూనె కూడా ఇందులో వాడినట్లు స్పష్టమైంది. వీటితో పాటు బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు కూడా వాడారు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా? ఇందులో S-value ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంది. 95.68 నుంచి 104.32కు ఉండాల్సిన S-value 20.32కే ఉండడానికి కారణం జంతువుల కొవ్వు కలవడమేనని ల్యాబ్ కూడా నిర్థారించింది. సప్లయ్‌దారులు సరఫరా చేసే నెయ్యి నాణ్యతను కూడా పరిశీలించకుండా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా లడ్డూల వినియోగానికి ఉపయోగించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరఫ రా అవుతున్న నెయ్యి నాణ్యతను పరిశీలించడానికి ల్యాబ్‌కు పంపగా వచ్చిన నివేదికలో వివిధ రకాల నూనెలు.. కూరగాయల నుంచి తీసిన నూనె కూడా అందులో ఉన్నట్లు నిర్ధారించడం జరిగింది.
తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ సప్లయ్ చేసిన నేతిని ల్యాబ్‌కు పంపితే అందులో వెజిటబుల్ ఆయిల్ ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే టీటీడీ ఆ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం జరిగింది. నాణ్యతను పెంచేందుకు ఫీు ఎక్స్‌పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఒక నివేదికను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈ ఎక్స్‌పర్ట్ కమిటీలో…ఎన్‌డీఆర్ ఐ, బెంగుళూరు మాజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్, డెయిరీ ఎక్స్‌పర్ట్ డి.సురేంద్రనాథ్, హైదరాబాద్ కు చెందిన డెయిరీ ఎక్స్‌పర్ట్ విజయభాస్కర్‌రెడ్డి, ఐఐఎం బెంగుళూరుకు చెందిన ప్రొఫెసర్ బి.మాధవన్, తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ స్వర్ణలతలు ఉన్నారు. హిందువుల మనోభావాలు ఒకటే కాక యావత్ ప్రపంచంలో ఆ కలియుగ దైవం వెంక టేశ్వర స్వామిని నమ్ముకున్న వారిని చెప్పుతో కొట్టినట్లైంది. వెంటనే దీనిపై సీరియస్ ఎంక్వైరీ ఉంటుంది. ఇది మామూలు తప్పు కాదు. టోటల్‌గా తిరుమల తిరుపతి దేవస్థా నాన్ని ప్రక్షాళన చేయాలని కోరారు.