హైదరాబాద్: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని ఆయన తనయుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా ఖండిరచారు. హెల్త్ యూనివర్సిటీ వ్యవ స్థాపకులు ఎన్టీఆర్ అని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడం దురదృష్టకరమన్నారు. ఎన్టీఆర్ పేరును తొలగించడం తెలుగు జాతిని అవమానించడమేనని పేర్కొన్నారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని నందమూరి బాలకృష్ణ కోరారు.