- చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘ భేటీి శ్రీ మరో 6 హామీలపై ఏకాభిప్రాయం
- తిరుపతి వేదికగా నెలాఖరులో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును జనసేనాని పవన్ కల్యాణ్, పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం రాత్రి ఉండవల్లి నివాసంలో భేటీ అయ్యారు. తమ ఇంటికి వచ్చిన అతిథులకు చంద్రబాబు, లోకేష్ అత్మీయ స్వాగతం పలికారు. ఇప్పటికే టీడీపీ ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు జనసేన ప్రతిపాదించిన మరో ఆరు హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు ఇరుపార్టీల అధినేతలు ప్రాధమికంగా నిర్ణయానికి వచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం భోగి వేడుకల్లో ఉమ్మడిగా పాల్గొననున్నారు. ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ కార్యక్రమం పేరిట అమరావతి రాజధాని పరిధి గ్రామమైన మందడంలోని గోల్డెన్ రూల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న భోగి వేడుకల్లో ఉదయం 7 గంటలకు పాల్గొంటారు. జగన్ ప్రజా వ్యతిరేక జీవోల ప్రతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రూపొందించిన ప్లకార్డులను భోగి మంటల్లో వేసి దహనం చేస్తారు. జగన్ మోసపు హామీలు, పెత్తందారీ పోకడలు, నిరుద్యోగ సమస్య, గంజాయి మాఫియా, అధిక ధరలు ` పన్నుల బాదుడు, జే బ్రాండ్స్ మద్యం, రైతు సంక్షోభం, అహంకారం నశించాలి వంటి అంశాలతో రూపొందించిన ప్లకార్డులను భోగి మంటల్లో వేసి దహనం చేయనున్నారు. అనంతరం ఆయా గ్రామాలకు చెందిన రైతులతో చంద్రబాబు, పవన్ ముచ్చటిస్తారు.