- జగన్ రెడ్డి పేరు తొలగిస్తే అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగినట్లా?
- ఏ ముఖం పెట్టుకుని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలవడానికి వెళ్లారు
- దళితుల గురించి మాట్లాడే అర్హత కూడా వారికి లేదు
- జగన్ పాలనలో దళితులపై జరిగిన దమనకాండపై నోరెత్తలేదే..
అమరావతి(చైతన్యరథం): జగన్ మోహన్ రెడ్డికి అవమానం జరిగిందని, దాన్ని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కి అంటగట్టడం సరికాదని మాజీ మంత్రి కెఎస్ జవహర్ మండిపడ్డారు. బుధవారం మీడియాతో జవహర్ మాట్లాడుతూ… డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కి అవమానం జరిగిందని వైసీపీ దళిత నాయకులు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కలవటానికి ఢల్లీి వెళ్లడం చూస్తుంటే మొగుడిని కొట్టి మొగసాలకెక్కిన తీరుగా ఉందని విమర్శించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం అడుగు భాగంలో ఆ మహనీయుని పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పేరును పెద్దగా పెట్టుకోవటంపై మొదటినుంచీ అంబేద్కర్ అభిమానులు నొచ్చుకుంటున్నారు. ఆ ఆవేదనతోనే కొంతమంది జగన్ రెడ్డి పేరును తొలగించారు. అంతే తప్పించి అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి నష్టం చేయలేదు. దీనిపై వైసీపీలోని దళిత నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకానికి జగన్ రెడ్డి పేరును పెట్టుకున్న సందర్భంలో ఈ దళిత నాయకులెవ్వరూ మాట్లాడలేదు.
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఒక వైసీపీ ఎమ్మెల్సీ హత్య చేసినప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలవడానికి వెళ్లిన బృందంలో ఏ ఒక్కరికైనా ఎస్సీల గురించి మాట్లాడే అర్హత ఉందా? ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనలో దళితుల మీద లెక్కలేనన్ని దాడులు జరిగితే మౌనంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు దళితుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. దళితులపై జగన్ మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలకు, అరాచకాలకు సమాధానం చెప్పి, దళిత జాతికి క్షమాపణ చెప్పి అప్పుడు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలవాలి. దళితుల మీద ఎలాంటి దాడులు జరిగినా సమష్టిగా పోరాడుదాం. అంతే తప్ప జగన్ రెడ్డికి అవమానం జరిగిందని..దాన్ని అంబేద్కర్‌కు ముడిపెడదామంటే సరైనది కాదంటూ వైసీపీ నేతల వైఖరిని జవహర్ తీవ్రంగా ఖండిరచారు.