గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు పనులు ఆలస్యం
50 రోజుల్లోనే పనుల వేగవంతానికి చర్యలు చేపట్టాం
ఏడాదిలోనే ప్రాజెక్టు పనుల పూర్తికి చర్యలు
ప్రాజెక్టు పూర్తికి రూ.4 వేల కోట్లు అవసరం
రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి (చైతన్య రథం): గత ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే వెలిగొండ ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయి. తాము అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే చర్యలు చేపట్టామని రాష్ట్ర జలవనరుల అభివృద్ది మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏడాదిలోనే ప్రాజెక్టు పనులు పూర్తికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలంటే దాదాపు రూ.4వేల కోట్లు అవసరమని నిమ్మల వెల్లడిరచారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి.. వెలిగొండ ప్రాజెక్టు ఆలస్యానికి తమ ప్రభుత్వమే కారణమంటూ నిందలు వేయడాన్ని ఖండిరచారు. జలవరుల అభివృద్ధికి గతంలో తమహయాంలో రూ.68 వేల కోట్లు వెచ్చిస్తే, గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.19 వేల కోట్లే వెచ్చించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
తమ ప్రభుత్వం అధికారంలోని వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజక్టు పనులకు అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగిందన్నారు. ఒక ఏడాదిలోనే ప్రాజెక్టును పూర్తిచేసే అవకాశాన్ని పరిశీలించమని అధికారులను ఆదేశించామన్నారు. ప్రకాశం జిల్లాకు త్రాగు, సాగునీటిని సాధ్యమైనంత త్వరగా అందించేలా యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టడమైందన్నారు. వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు, మొదటి, రెండవ టన్నల్ లైనింగ్ పనులు, ఫీడర్ కెనాల్ స్ట్రక్చర్, లైనింగ్ పనులకు మరియు నిర్వాశితులకు ఆర్ అండ్ ప్యాకేజీకై మొత్తం 4వేల కోట్లు వెచ్చించాల్సి ఉందన్నారు. ఇందుకై స్టేజ్-1లో రూ.1,422 కోట్లు, స్టేజ్-2లో రూ.2,157 కోట్లు మరియు ఫీడల్ కెనాల్ స్ట్రక్చర్, లైనింగ్ పనులకు రూ.400 కోట్లు వెరసి మొత్తం రూ.4 వేల కోట్లు వెచ్చించి యుద్ధపాతిపదిక పనులను నిర్వహించేందుకు చర్యలు చేపట్టడమైందన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు పెండిరగ్ పనులను మంత్రి వివరిస్తూ ప్రాథమిక టన్నల్ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీటిని వదిలితే టన్నల్కే ప్రమాదం సంభవించే పరిస్థితి ఉంటుందనే కనీస పరిజ్ఞానం లేకుండా వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు వదల వచ్చని మాజీ ముఖ్యమంత్రి అనడం ఎంతో హాస్యాస్పదంగా ఉందన్నారు. మొదటి టన్నల్‌కు సంబంధించి 500 మీటర్లు, రెండొవ టన్నల్‌కు సంబంధించి 7 కి.మి. లైనింగ్ పూర్తి కాకుండానే నిర్థేశించిన నీటి పరిమాణాన్ని వదలడం సాధ్యం కాదనే విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో గత ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. రెండవ టన్నల్‌లో త్రవ్విన 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని మొదటి టన్నల్ చివరి భాగాన వేయడం జరిగిందని, ఆ మట్టిని తొలగించకుండా నీటిని విడుదల చేయడం సాధ్యంకాదనే కనీస పరిజ్ఞానం కూడా మాజీ ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు.
రెండవ టన్నల్ 12వ కి.మి. దగ్గరున్న టన్నల్ బోరింగ్ మిషన్ చెడిపోయి ఉంటే గత మూడేళ్లుగా బయటకు తీసువచ్చే కనీస ప్రయాత్నాన్ని గత ముఖ్యమంత్రి చేయకపోగా, ఇప్పుడు ఆ టీబీఎంను బయటకు తీసుకురాకుండా ఏవిధంగా నీరు వదలగలమని ప్రశ్నించారు. రెండవ టన్నల్‌కు సంబంధించి ఇంకా 30 శాతం బెంచింగ్ పనులు నిర్వహించాల్సి ఉందని, అందుకు 50వేల నుండి లక్ష క్యూబిక్ మీటర్ల రాతి వ్యర్థాలను తొలగించాల్సి ఉందన్నారు. ఇందుకు బ్లాస్టింగ్, డ్రిల్ చేసుకుంటూ నిదానంగా నిర్వహించాల్సి ఉందని, ఎంతో సమర్థవంతంగా పనిచేస్తే ఆరు మాసాలు కాకుంటే సంవత్సరకాలం ఈ పనికి పడుతుందన్నారు. అటువంటి పనిని గత ఐదేళ్లలో ఏమాత్రం నిర్వహించకుండా ఇప్పుడు మాపై నిందనలు వేయడం ఏమాత్రం సబబని మంత్రి ప్రశ్నించారు.
వీటితోపాటు 22 కి.మి. ఫీడర్ కెనాల్ లైనింగ్, విస్తరణ పనులు కూడా పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. మొదటి టన్నల్ ద్వారా 3 వేల క్యూసెక్కులు, రెండో టన్నల్ ద్వారా 8,500 క్యూసెక్కులు వెరసి మొత్తం 11,500 క్యూసెక్కుల నీరు ప్రవహించే సామర్థ్యం ఆ ఫీడర్ కెనాల్‌కు లేదన్నారు. అదేవిధంగా ఫీడర్ కెనాల్ ద్వారా 53 టీఎంసీ సామర్థ్యంగల నలమల సాగర్ రిజర్వాయరుకు నీరు చేరుకుంటుదని, అయితే ప్రస్తుతం ఆ రిజర్వాయరులో అర టీఎంసీ నీటిని నిల్వచేసే అవకాశం కూడా లేదన్నారు. ఈ నలమల సాగర్ రిజర్వాయరువల్ల 11 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ క్రింద నిర్వాశితులకు దాదాపు రూ.1,100 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. గత ఐదేళ్ల కాలంలో కనీసం కోటి రూపాయలు కూడా చెల్లించలేదన్నారు.
2021 జూలై 15న కేంద్ర జలవనరుల శాఖ హంద్రీ`నీవా, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను అప్రూవుడ్ ప్రాజెక్టులుగా పేర్కొంటూ, వెలిగొండను అన్ అప్రూవుడ్ ప్రాజెక్టుగా గజిట్ జారీచేస్తే గత ముఖ్యముంత్రి తన వ్యక్తిగత స్వార్థం కోసం నోరుమెదపలేదని మంత్రి నిమ్మల తప్పుపట్టారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులకు గ్రీజు కూడా పెట్టలేకపోయిందని, గేట్లు కొట్టుకుపోయాయని, సోమశిల ప్రాజెక్టు గేట్లు, షట్టర్లు రోప్స్ తుప్పు పట్టిపోయేలా చేశారని, నీరు నిండితే సోమశిల ప్రాజెక్టు గేట్లు మూస్తే గేట్లు కొట్టుకుపోతాయేమోననే ఆందోళన మాకుందని, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు కూడా సరిగా లేకపోవడానికి కారణం గత ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మంత్రి నిమ్మల విమర్శించారు.