- గత ఐదేళ్లలో రేషన్ మాఫియాతో వేల కోట్ల దోచారు
- వైసీపీ నేతలకు అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు
- ఆ పార్టీకి చెందిన వారి కంపెనీదే ముఖ్య పాత్ర
- టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.జవహర్ ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): పేదల ఇంట్లో ఉండాల్సిన రేషన్ బియ్యం కాకినాడ పోర్టులో కనిపిస్తోంది.. రేషన్ బియ్యం స్మగ్లింగ్‌కు కాకినాడ పోర్టును జగన్‌రెడ్డి అండ్ కో అడ్డాగా మార్చారని మాజీ మంత్రి కె.జవహర్ ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజాగా 1,704 టన్నుల రేషన్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి పశ్చిమ ఆఫ్రికాకు రెండు షిప్పులలో తరలిస్తుండ గా జిల్లా కలెక్టర్ ఈ మాఫియాను అడ్డుకున్నారు.. గత ఐదేళ్లుగా కాకినాడ పోర్టులో ఇది నిత్యకృత్యమైం ది.. అంతర్జాతీయ రేషన్ స్మగ్లర్లు, వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసి వేల కోట్లు కూడ బెట్టుకున్నారని మండిపడ్డారు. ఒక్క రోజులో ఇక్కడి నుంచి 1100 లారీల బియ్యం అక్ర మంగా తరలిపోతోందంటే.. స్మగ్లింగ్ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చన్నా రు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ బియ్యం లారీలను తనిఖీ చేసేం దుకు కేవలం 11 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు.. వైసీపీ పాలనలో తనిఖీ సిబ్బందిని ఉద్దేశపూర్వకంగా తగ్గించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణే స్వయంగా చెప్పారు.
బియ్యం మాఫియాలో 16 కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నా యని అధికారికంగా తెలుస్తుందన్నారు. ఇందులో ఓ కంపెనీ కింగ్ పిన్ పాత్ర పోషిస్తోందని, అది వైసీపీకి చెందిన వారి కంపెనీ అని ప్రజలు చర్చించుకుంటు న్నారని తెలిపారు. ప్రభుత్వం రూ.43కు కిలో బియ్యాన్ని కొనుగోలు చేసి నిరుపేద కుటుంబాలకు రేషన్ రూపంలో పంపిణీ చేస్తుంటే ఈ బియ్యాన్ని కొంతమంది కిలోకు రూ.10 నుంచి రూ.15 ఇచ్చి ఆఫ్రికా దేశాల్లో కిలో రేషన్ బియ్యం రూ.70 పైనే విక్రయిస్తున్నారని తెలిపారు. యాంకరేజీ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నుల బియ్యంతో పాటు అదే పోర్టులో మరో నౌక లోకి బియ్యం ఎక్కించేందుకు వెళుతున్న బార్జ్ ఐవీ 0073లో ఉన్న 1,064 టన్నుల బియ్యా న్ని కలెక్టర్ షాన్ మోహన్ గుర్తించినట్లు చెప్పారు.
స్మగ్లింగ్ మాఫియాను అరికట్టేందుకు చర్యలు
బియ్యం స్మగ్లింగ్ మాఫియా నెట్‌వర్క్‌ను కూకటి వేళ్లతో పెకిలించేందుకు కూట మి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. కాకినాడ పోర్టులో భద్రతా చర్యలు బలహీనంగా ఉంటే భవిష్యత్తులో ఆర్డీఎక్స్, మారణాయుధాలు, డ్రగ్స్ కూడా దిగుమతి అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమంగా తరలిస్తున్న 51 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు, పౌరసరఫరా లశాఖ మంత్రి పట్టుకున్నారు. ఇంకా గుట్టుచప్పుడు కాకుండా కాకినాడ పోర్టు ద్వారా రేషన్ మాఫియా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కాకినాడ పోర్టును మాజీ ఎమ్మెల్యే తన కనుసన్నల్లో శాసిస్తున్నాడు. రేషన్ మాఫియాకు ఆయన, ఆయన తండ్రి ఆధ్యులు. అంతర్జాతీయ స్మగ్లర్లతో చేతులు కలిపి ఈ రాష్ట్రంలోకి డ్రగ్స్ దిగుమ తి చేస్తున్నారని, గంజాయిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారని ప్రజల్లో చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టు ద్వారా గతంలో జరిగిన ప్రతి అవినీతి కార్యకలాపాలు, ప్రస్తుతం కొనసాగుతున్న అవినీతిని అరికట్టడానికి, నిందితులపై చర్యలు తీసుకోవడా నికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. స్మగ్లర్లు ఏ స్థాయి వారైనా తప్పించు కోలేరని స్పష్టం చేశారు.