- మాతో కలిసి అడుగు వేయండి.. రాష్ట్ర భవిష్యత్‌ను తీర్చిదిద్దుకుందాం
- ఐదేళ్ల నరకానికి ముగింపు పలికేందుకు ఎన్డీఏ సిద్ధం
- తొలిరోజు మూడు సభలు సూపర్ హిట్, రాబోయే రోజుల్లో ఎన్డీఏ అన్‌స్టాపబుల్
- రూ.200 వచ్చే కరెంటు బిల్లు రూ.800 ఎందుకైందో ఆలోచించి ఓటేయండి
- టీడీపీ హయాంలోనే ముస్లింలకు భద్రత
- మైనారిటీలకు ఎవరేం చేశారో చర్చించేందుకు జగన్‌రెడ్డి సిద్ధమా?
- మద్య నిషేధమని ఓట్లేయించుకుని మద్యంపై అప్పులు తెచ్చిన మోసగాడు జగన్
- మదనపల్లె ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు
మదనమల్లి (చైతన్యరథం): మాతో కలిసి అడుగే యండి.. రాష్ట్ర భవిష్యత్‌ను బంగారుమయంగా మార్చి చూపిద్దామని ప్రజలకు టీడీపీ అధినేత నారా చంద్ర బాబునాయుడు పిలుపు ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం జెండా తీసుకువచ్చి తమ్ముళ్ళు, చెల్లెమ్మలు హోరెత్తిస్తున్నారన్నారు. రాష్ట్రం దశ, దిశా మార్చేందు కు, ప్రజలను చైతన్యవంతం చేసేందుకే ఈ ప్రజాగళం సభలు అన్నారు. తొలి రోజు నా మూడు సమావేశాలు సూపర్ హిట్. రాబోయే రోజుల్లో ఎన్డీఏ విజయం అన్ స్టాపబుల్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బుధవారం జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లా డుతూ మదనపల్లికి చాలా సార్లు వచ్చాను కానీ ఇంత పెద్ద స్పందన తాను ఎన్నడూ చూడలేదన్నారు. ఈ ప్రభుత్వంపై మీకున్న కోపం కసిగా మరుతోంది.
ఎప్పు డు ఎన్నికల వచ్చినా చిత్తుచిత్తుగా జగన్‌రెడ్డిని ఓడిరచ డానికి మీరుసిద్ధంగా ఉన్నారని మీ ఉత్సాహం చూసాక నాకు అర్థమైంది. ఎక్కడికెళ్ళినా సాగు నీటి కోసం రైతు లు, ఉద్యోగాల కోసం యువత ఆవేదన చెందుతూ కని పిస్తున్నారు. నమ్మించి గొంతు కోసే ప్రభుత్వం ఏదో.. మీ భవిష్యత్తు కోసం పనిచేసే ప్రభుత్వం ఏదో ఆలోచిం చుకోండి. మాతో కలిసి అడుగు వేయండి. రాష్ట్రాన్ని మార్చుదాం. ఇది రాష్ట్రానికి కీలక సమయం. ఐదు సం వత్సరాల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు ముగిం పు పలికే సమయం ఇది. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనని చంద్రబాబు అన్నారు.
ఆలోచించి ఓటెయ్యాలి
ఈ ఐదేళ్ళలో ఇక్కడున్న ఏ ఒక్కరైనా బాగుపడ్డారా? మీ జీవితాలు మెరుగుపడ్డాయా?ముస్లీం సోదరుల జీవి తాలు మెరుగుపడలేదు. ఇంకా 47రోజులే. 7 వారాలే. ప్రతి రోజు ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్. మే 13న ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు ప్రతిఒక్కరు మనఃసాక్షిగా ఆలోచించుకోవాలి. బటన్ నొక్కానని ముఖ్యమంత్రి ఆర్భాటంగా చెప్పుకుంటున్నాడు. ఉత్తుతి బటన్ నొక్కు తున్నాడు.ఈ 47రోజులు మీ కుటుంబం గురించి ఆలో చించండి. ఈ ఎన్నికలు మీ భవిష్యత్తును మార్చబోతు న్నాయి. మంచి రోజులు కావాలా? మరలా రావణా సురుడి పాలన కావాలో ఆలోచించుకునే సమయం ఆసన్నమైందని చంద్రబాబు అన్నారు.
జగన్ ఒక జలగ
ఒకప్పుడు రూ.200 వచ్చే కరెంటు బిల్లు నేడు రూ.800 వస్తోంది. రూ.100ఇచ్చి నెలకు ఒక్క కరెంట్ ఛార్జీల నుంచే రూ.వెయ్యి లాగేసే జలగ కావాలా? మన కాళ్లపై మనం నిలబడేలా చేసే మంచి ప్రభుత్వం కావాలా? పోలింగ్ రోజు బూత్‌కు వెళ్ళే ముందు ఆలో చించండి. ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క కరెంటు ఛార్జీ లు వల్లనే ఎంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు చేసు కొని ఓటు వేయండి. పెరిగిన ఆర్టీసీ రేట్లు, చెత్తపన్ను, ఇంటిపన్ను, పెట్రోల్, డీజిల్ ధరలను గుర్తుచేసుకోండి. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లు గుర్తు చేసుకోండి. నిత్యావసర ధరలు, బియ్యం, పప్పులు,వంట నూనె ధరలు ఎందుకు ఇంతలా పెరిగా యో ఆలోచించండి. పొరుగు రాష్ట్రాల్లో లేని విధంగా ఏపీలోనే ఎందుకు ధరలు పెరిగాయో ఆలోచించాలని చంద్రబాబు అన్నారు.
దుర్మార్గుడిని ఓడిద్దాం
తెలుగుదేశం, మిత్రపక్షాలు పనిచేసేది కేవలం మీ పిల్లల భవిష్యత్తు కోసమే. జగన్‌రెడ్డి మీకు చేసిన ద్రోహా నికి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. జగన్‌రెడ్డి దిమ్మ తిరిగి పోవాలి. రోజంతా కష్టపడి సాయంత్రం ఒక క్వార్టర్ వేస్తే శారీరక బాధలు తొలుగుతాయని అనుకునే మం దుబాబుల బలహీనతను జగన్‌రెడ్డి అవకాశంగా తీసు కున్నాడు. రూ.60ఉన్న క్వార్టర్‌ను రూ.200 చేసి బాదు డే బాదుడు బాదుతున్నాడు. మద్యం షాపులో డిజిటల్, ఆన్‌లైన్ పేమెంట్లు ఏవీ పని చేయవు. కేవలం నగదు చెల్లింపులే. ఈ చిదంబర రహస్యం ప్రజలకు అర్థమవు తోంది. పేదవాడి రక్తం తాగే జలగ ఈ జగన్‌రెడ్డి. మర లా ఎన్నికల్లో క్వార్టర్ తాగిస్తాడు. అవసరమైతే హాఫ్ తాగించి మిమ్మల్ని మత్తులో పెట్టి ఓటు వేయకుండా చేస్తాడు. ఓటుతో బుద్ధి చెప్పేందుకు ముందుకు రండి. తెలుగుదేశం అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యమే ఉంటుంది. కల్తీ మద్యం ఉండదు. జగన్‌రెడ్డి లా కల్ల బొల్లి మాటలు నేనుచెప్పను.మద్యం నిషేధం అని చెప్పి దాని మీద ఇష్టానుసారంగా దోచుకొని, మద్యాన్ని తాక ట్టుపెట్టి అప్పులుతెచ్చిన విశ్వసనీయత లేని ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి. మీ రక్తం తాగిన జలగని, ఆడబిడ్డల తాళిబొట్టును తెంచిన దుర్మార్గుడిని ఓడిరచేం దుకు కంకణం కట్టుకోవాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
ఉద్యోగుల గౌరవం పెంచుదాం
మదనపల్లిలో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నా రు. వారి బాధ, ఆవేదన నాకు అర్థమైంది. 47 రోజులు చట్ట ప్రకారం పని చేయండి, నిబంధనలను అమలు చేయండి. ఐదేళ్ళు మిమ్మల్ని బానిసలుగా చూసిన వారి అంతు తెల్చే రోజు మీకు వచ్చింది. జీతాలు అడిగితే కేసులు పెట్టారు. ఉద్యోగులు సేవ్ చేసుకున్న డబ్బుల నుంచి పీఎఫ్ కూడా ఇవ్వలేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉంది. మరలా ఉద్యో గుల గౌరవాన్ని పెంచి, గౌరవంగా వేతనమిస్తాం, పీఆర్సీ ఉంటుందని ఉద్యోగులకు తెలుపుతున్నా. మీరు చేయాల్సిందల్లా జగన్ రెడ్డికి దిమ్మ తిరిగేలా రేపు బటన్ నొక్కాలని చంద్రబాబు కోరారు.
పనికిమాలిన సీఎం
జే బ్రాండ్ నాసిరకం మద్యం వల్ల, ఖర్చు ఎక్కువ కావడంతో జనం గంజాయికి అలవాటుపడ్డారు.రాష్ట్రం లో గంజాయి వాణిజ్య పంటగా తయారైంది. ఇది చాల దన్నట్లు డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. మొత్తం రాష్ట్రంలోని యువత జీవితాలను నాశనం చేయగలి గేంత పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను మొన్న విశాఖలో 25 వేల కిలోల సరుకు పట్టుకున్నారు. మీ పిల్లల భవిష్యత్తు మీ చెతిల్లోనే ఉంది.ఈఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా గంజాయిపై సీఎం సమీక్ష జరపలేదు. అందుకే తల్లి దండ్రలు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. నా పదవి కోసం నేను తాపత్రయపడటం లేదు. రాష్ట్ర భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తున్నాను. ఒక వర్గం కాదు, ఒక వ్యక్తి కాదు. అందరి జీవితాలు, అవకాశా లు నాశనం చేశాడు. ఇప్పుడు జాతినే నాశనం చేయా లని చూస్తున్నాడు. ఇంత పనికి మాలిన ముఖ్యమంత్రిని నా జీవితంలో నేనెప్పుడు చూడలేదు. ఇక్కడి అభ్యర్థి సోదరుడు కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ ఇంత దుర్మార్గ పాలన మేము చూడలేదు. ఎన్నికలంటే రాజకీయ పార్టీలు ప్రజల వద్ద కు వచ్చి ఓట్లు అడుగుతారు. కానీ ఈ సారి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? మాకు ఎప్పుడువిముక్తి వస్తుందా? జలగలాంటి జగన్ పార్టీని ఓడిరచి ఎప్పుడు భూస్థాపి తం చేద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారని చంద్ర బాబు అన్నారు.
టీడీపీ హయాంలోనే ముస్లింలకు భద్రత
మైనారిటీ సోదరులకు చెప్తున్నా… 40 ఏళ్లుగా రాజ కీయాల్లో ఉన్నా… జగన్ 10 ఏళ్లుగా ఉన్నాడు. టీడీపీ హయాంలో ఏనాడైనా ముస్లింలకు అన్యాయం జరిగిం దా? ఐదేళ్లుగా కేంద్రంలో అన్ని బిల్లులకు బీజేపీకి మద్దతు తెలిపిన జగన్ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నానం టూ నన్ను విమర్శిస్తున్నాడు. ముస్లింలకు ఇచ్చిన హామీ లేవీ జగన్ నెరవేర్చలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కలిస్తే మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ఎన్డీఏలో ఉన్న ప్పుడు కూడా టీడీపీ హయాంలో గతంలో ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగలేదు. జరగకుండా టీడీపీ చూసుకుంది. మైనారిటీల కోసం జగన్ ఏ పథకమూ అమలు చేయలేదు. మదనపల్లెలో మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో, వైసీపీ ఏం చేసిందో చర్చించడానికి నేను సద్ధంగా ఉన్నా. జగన్‌రెడ్డి చర్చకు వస్తావా అని సవాల్ చేశారు. సమైఖ్య ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఉర్దూను రెండో అధికారిక భాషగా ప్రకటించిన పార్టీ తెలుగుదేశంపార్టీ. హైదరాబాద్‌లో హజ్‌హౌస్ కట్టాం. మైనారిటీ సోదరుల కోసం దుకాణ్ అవుర్ మకాన్ కింద ఆర్థిక సాయం చేశాం.
రూ.3 లక్షల ఆర్థిక సాయంలో రూ.లక్ష సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశంపార్టీ. మీ పిల్లల భవిష్యత్తు కోసం విదేశ విద్యా విధానం కింద దాదాపు రూ.160 కోట్లు ఖర్చు పెట్టి వారిని చదివించాం. రంజాన్ తోఫా ఇచ్చాం. దుల్హాన్ పథకం కింద రూ.163 కోట్లు ఖర్చు పెట్టి 33వేల పేద ఆడబిడ్డలకు పెళ్లి చేపించాం. హైద రాబాద్‌లో ఒకప్పుడు మత విద్వేషాలు ఉండేవి. వాటిని పూర్తిగా నివారించాం. సమైక్య ఏపీలో హైదరాబాద్‌లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం, తర్వాత కర్నూలులో పెట్టాం. కడప, విజయవాడలో హజ్ హౌజ్ లు కట్టాం. కడపలో 90శాతం నిర్మాణం పూర్తిచేశాం. మిగిలిన 10 శాతంపనులను జగన్ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయిం ది. ఇక్కడే నేను మొదలుపెట్టిన షాదీఖానాను కూడా జగన్ రెడ్డి పూర్తి చేయలేకపోయాడు. గత ఐదేళ్లుగా కేంద్రం తెచ్చిన బిల్లులన్నిటికీ వైసీపీ మద్దతు ఇచ్చింది. ఇక్కడున్న ఎంపీ కూడా సమర్థించి ఇప్పుడు నాటకాలు, దొంగాటలు ఆడుతున్నాడు. ఎన్డీఏలో టీడీపీ చేరటంపై ముస్లింలను రెచ్చగొడుతున్నారు. ఈ విషయాన్ని మైనా రిటీలు అర్థం చేసుకోండి. మా ఎన్డీఏ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత ఎవరికీ అన్యాయం జరగదు. మీ హక్కులు కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. ఎక్కడిక్కడ మైనారిటీలకు అన్యాయం చేసి కల్లబొల్లి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు.
వక్ఫ్‌బోర్డ్ ఆస్తులు అన్యాక్రాంతమైపోతున్నాయి. కాపా డాలంటే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే తప్ప సాధ్యం కాదు. ఎవరు ఎన్నిచెప్పినా నమ్మవద్దు.మీకు అండగా నేనుం టా.గతంలో నేను చేసినదానికంటే రెట్టింపు చేసే బాధ్య త నాది.షాజహాన్ భాషాను గెలిపించుకోండి.మీకు ఏం కావాలో నేను చేస్తాను.దుర్మార్గాలు, నేరాలు, దోపిడీలు చేసే వారిని శాశ్వతంగా నాశనంచేసే రోజుదగ్గర పడిర ది. మీకు భరోసా ఇస్తున్నా. సంపదను సృష్టించే పార్టీ లు ఎన్డీఏ పార్టీలు. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుం టాం. ఉద్యోగాలు,పెట్టుబడులు వస్తాయి. మదనపల్లెలో కూర్చొని వర్క్‌ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకునేలా చేస్తాం. మైనారిటీ డిక్లరేషన్ ఇస్తాం.మాల,మాదిగలకు అండగా ఉంటి ఏ,బి, సి,డి వర్గీకరణ తీసుకువచ్చి జిల్లాల వారీ గా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం. ఎన్డీఏ అభ్యర్ధు లను గెలిపించడానికి ముందుకు వచ్చిన మాదిగ దండోరాకు చంద్రబాబు అభినందనలు తెలియజేశారు.
ఇసుక, గనులే పెద్దిరెడ్డి ఆహారం
పాపాల పెద్దిరెడ్డి అన్నం తినడం మానేశాడు. ఉద యం అల్పాహారం ఇసుక, మధ్యాహ్న భోజనం మైన్స్, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. కొడుకు ఎంపీ, పెద్దిరెడ్డి మంత్రి, తుంబళ్ళపల్లెలో సోదరుడు ఎమ్మెల్యే. అన్నమయ్య జిల్లాలో సమర్థులు ఉన్నారు. వారు బయ టకి రావాలంటే బయటకి రానివ్వరు. అన్ని కాంట్రాక్టు లు, ఇసుక అక్రమాలు అన్నీ పెద్దిరెడ్డి కుటుంబానికే. హంద్రీనీవా పూర్తిచేయకుండా గండికోట నుంచి ఇంకో కెనాల్‌కు రూ.6వేల కోట్లు మంజూరు చేయించుకున్నా డు. ఆవులపల్లి రిజర్వాయర్‌లో అనుమతులు లేకుండా రూ.600 కోట్లు కొట్టేశాడు. పుంగనూరులో పర్మిషన్ లేకుండా భూములు లాక్కోడానికి ప్రయత్నించగా ఎన్జీ టీ ప్రభుత్వానికి రూ.100 కోట్లు జరిమానా వేసింది.
వీళ్ల దౌర్జన్యాన్ని ఎండగడుతున్నానని అంగళ్లులో నా మీద కేసు పెట్టారు. లీటర్ పాలులో కూడా రూ.20 కొట్టేశాడు. గతంలో నేను తలుచుకుంటే వీళ్ళు బయట తిరిగేవారు కాదని చంద్రబాబు అన్నారు. భద్రాచలం తెలంగాణకు పోయిందని ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధిచేశాను.అక్కడున్న సుబ్బారావు అనే చేనేత కుటుంబం వైసీపీనేతల భూకబ్జాల కారణంగా ఆత్మ హత్య చేసుకుంది.ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో అతని కున్న భూమిని వైసీపీ నేతలు రికార్టుల్లో పేరు మార్చి కబ్జాచేశారు.నంద్యాలలో అబ్దుల్ సలీం కుటుంబం వీళ్ల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. కాకినా డలో పూజారిపై వైకాపా నాయకుడు దాడిచేశాడు. ఎవ రికీి రక్షణలేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు.
జిల్లా కేంద్రంగా మదనపల్లి
మదనపల్లెని జిల్లా హెడ్‌క్వార్టర్ చేసే బాధ్యత నాది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను పూర్తి చేస్తాం. హంద్రీ-నీవా పూర్తి చేస్తాం. దేవాలయాలను పరిరక్షిస్తాం. మదన పల్లెలో స్కూల్స్, కాలేజీలు తీసుకువస్తాం. యువతకు ఉద్యోగాలు ఇస్తాం. టౌన్‌లో భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేస్తాం. వరద నీరు పోవడానికి హై లెవల్ బ్రిడ్జ్ నిర్మా ణం చేస్తాం. రోడ్లు, కాలవలు పూర్తి చేస్తాం. ఆస్తులకు రక్షణ కల్పిస్తాం. వైసీపీ నాయకులు కొట్టేసిన విద్యుత్ కార్మికు భూములు తిరిగిస్తాం. కాపు, బలిజ కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేస్తాం. దుర్మార్గ, అహంకార, దోపిడి పాలనకు ఇక స్వస్తి పలకాలి. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో బాగుపడిన ఏకైక వ్యక్తి జగన్ రెడ్డి. ప్రజలు గెలవాలి. రాష్ట్రం గెలవాలి. దాని కోసం అందరూ ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు ఆలోచించి ఎన్డీఏ అభ్యర్ధికి ఓటు వేయాలని చంద్రబాబు కోరారు.