- తండ్రిని చంపిందెవరని చెల్లి అడుగుతోంది
- జగన్ నోరు జవాబు చెప్పాలి
- మద్యనిషేధంపై మాటతప్పి మహిళలకు మోసం
- కలిసికట్టుగా పోరాడి సైకోను తరిమికొట్టాలి
పుట్టపర్తి (చైతన్యరథం): తల్లికి, చెల్లెళ్లకు తీరని అన్యాయం చేసిన జగన్‌రెడ్డి, మహిళా సంక్షేమం గురిం చి మాట్లాడటం హాస్యాస్పదమని టీడీపీ జాతీయ ప్రధా న కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు.సొంత కుటుం బంలోని ఆడవారికి న్యాయం చేయలేని జగన్‌రెడ్డి ఇక రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తాడని నిల దీశారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శుక్రవారం జరిగిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ సొంత చెల్లి కన్నీటికి కారణం జగన్ కాదా అని ప్రశ్నిం చారు. మీరు విడిచిన బాణం నేడు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్లారు? తల్లిని తరి మేసింది ఎవరు.. తల్లిని, చెల్లిని మెడపెట్టి బయటకు గెంటేసింది ఎవరు? మరో చెల్లి సునీత తన తండ్రిని చంపేసింది ఎవరు అని అడుగుతున్నారు.. జగన్‌కు దమ్ముంటే సమాధానం చెప్పాలని లోకేష్ సవాల్ విసిరారు. సొంత చెల్లిపైనా అసభ్యకర పోస్టులు పెట్టించిన వ్యక్తి, తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ ప్రజలకు న్యాయం చేస్తాడా అన్నారు. ఉమ్మడి అనంతపురం ప్రజల జోషే వేరు. హిందూపురంలో మొదలైన ఊపు అలానే కొనసాగు తోంది.ఈ స్పీడ్‌కు ఫ్యాన్ మాడి మసైపోవడం ఖాయం.
గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి. సత్యసాయి మంది రం ఉన్న జిల్లా అనంతపురం. సేవకు ప్రతిరూపం భగవాన్ సత్యసాయి జన్మించిన జిల్లా అనంతపురం. ధర్మవరం చీరలు కూడా చాలా ప్రఖ్యాతి గాంచాయి. మంచి చేస్తే అనంతపురం జిల్లా వాసులు ఆదరిస్తారు. తప్పుచేస్తే తాటతీస్తారు. అనంత అంటే మా కుటుంబా నికి చాలా ప్రేమ. ఎన్టీఆర్‌ను ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు.చంద్రబాబు ఈ జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారు. అనంత జిల్లాను టీడీపీ హయాంలో పెద్దఎత్తున అభివృద్ధి చేశాం. కియా పరిశ్రమ ద్వారా 50వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. అనంతపురం జిల్లా అంటే మా పుట్టినిల్లు లాంటిది. ఎన్టీఆర్ ను శాస నసభకు పంపించి ముఖ్యమంత్రిని చేశారు. నంద మూరి తారక రామారావు ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూల్చేయిస్తే ఇక్కడి నుంచే ఉద్యమం మొదలుపెట్టారు. ఆనాడు ఎంతోమంది పోరాడారని లోకేష్ అన్నారు.
హామీలన్నీ విస్మరించిన జగన్
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు నా నమస్కారాలు. ఎవరూ చేయని సంక్షేమం మహిళలకు చేశానని జగన్ చెబుతున్నారు. ఆస్తిలో మహిళలకు సమానహక్కు కల్పించింది అన్న ఎన్టీఆర్. జగన్ ప్రశ్న పత్రాలు దొంగలించే సమయంలో చంద్రబాబు డ్వాక్రా తీసుకువచ్చారు. జగన్ జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు దీపం పథకం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతానని జగన్ మాట ఇచ్చి తప్పారు. 45 ఏళ్లకే ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇస్తా నని చెప్పి మాట తప్పారు. ఎంతమంది బిడ్డలు ఉన్నా అమ్మఒడి ఇస్తాననిచెప్పి మాటతప్పారు. మహిళల పేరు తో 30లక్షల ఇళ్లు కడతానని 3వేల ఇళ్లు కూడా కట్టలేదని లోకేష్ విమర్శించారు.
మహిళల ఉన్నతవిద్యకు అండగా..
నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రొఫెషనల్ కోర్సు లు చేసే వారిని ఆదుకోవాలని యువత కోరారు. అది గుర్తించి నా తల్లి భుననేశ్వరమ్మ కలలకు రెక్కలు పేరు తో ప్రొఫెషనల్ కోర్సులు చేసే మహిళలు తీసుకున్న రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లించే పథకాన్ని ప్రకటిం చారు. బాగా చదివి ప్రయోజకులు కావాలి. మీకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుందని లోకేష్ చెప్పారు.
అన్నీ కోతలే..
జగన్‌ను చూస్తే కటింగ్, ఫిటింగ్ మాస్టర్ గుర్తుకు వస్తాడు. బల్లపైన బులుగు బటన్ నొక్కి అకౌంట్‌లో రూ.10 వేస్తాడు. తరువాత రెడ్ బటన్ నొక్కి రూ. 100లాగేస్తాడు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదు డే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు మూడుసార్లు పెంచి బాదు డే బాదుడు. ఇంటి పన్ను, చెత్తపన్ను పెంచి బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచి, క్వార్టర్ బాటిల్, ఇంటి పన్ను, చెత్తపన్ను పెంచి బాదుడే బాదుడు. ఇక జగన్ పెద్ద కటింగ్ మాస్టర్. అన్న క్యాంటీన్ కట్, పెళ్లికానుకలు కట్, పండుగ కానుకలు, స్కూల్ ఫీజురీయింబర్స్‌మెంట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. చంద్రన్న బీమా, డ్రిప్ ఇరిగేషన్ కట్. 6 లక్షల మంది వృద్ధులకు పెన్షన్ కట్. ఇలా చెప్పుకుంటూ పోతే దేశం లోనే 100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక ముఖ్య మంత్రి ఈ సైకో జగన్ అని లోకేష్ దుయ్యబట్టారు.
జనం బాగుకోసమే సూపర్`6
పవనన్న, చంద్రబాబు కలిసి బాబు సూపర్-6 హామీలు ప్రకటించారు. టీడీపీ-జనసేన ఏర్పడిన ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చేవరకు ప్రతి నెల రూ.3వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తాం. తల్లికి వందనం పేరుతో స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ఇంట్లో ఇద్దరుంటే 30వేలు, ముగ్గురుంటే రూ.45వేలు ఇస్తాం. రైతులను ఆదుకునేందుకు ప్రతి ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తాం. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఇక 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.15వందల చొప్పున, ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90వేలు చంద్రబాబు ఇవ్వ బోతున్నారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించ బోతోందని లోకేష్ వివరించారు.
బీసీలకు జగన్ చేసిందేమిటి?
జగన్‌కు నేను సవాల్ చేస్తున్నా.. బీసీలకు ఏం చేశారు. ఐదేళ్ల పాలనలో 300 మంది బీసీలను హత్య చేశారు. 26వేల మంది బీసీలపై దొంగ కేసులు పెట్టా రు. సబ్ ప్లాన్ ద్వారా బీసీలకు రావాల్సిన రూ. 75వేల కోట్ల నిధులను దారిమళ్లించారు. బీసీల కోసం టీడీపీ తెచ్చిన 30సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. బీసీ వర్గాలకు చెందిన చంద్రయ్య, జాలయ్య, అమర్ నాథ్ గౌడ్‌ను చంపేశారు. అందుకే మేం జయహో బీసీ కార్యక్రమం చేపట్టి బీసీ డిక్లరేషన్ ప్రకటించాం. 50 ఏళ్లు నిండిన బీసీలకు నెలకు రూ.4వేలు పెన్షన్ ఇస్తాం. బీసీలకు సబ్‌ప్లాన్ కింద ఐదేళ్లలో లక్షా 50వేల కోట్లు ఖర్చుపెడతాం. స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో 10వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడతాం. ఆదరణ పథ కం కింద ఐదేళ్లలో రూ.5వేలు కోట్లు ఖర్చు పెట్టి మెరు గైన పనిముట్లు అందిస్తాం. చంద్రన్న బీమా రూ.10 లక్షలు చేస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు ఇస్తాం. ఆరు నెలలకు ఒకసారి క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం బీసీలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మారుస్తాం. వీరికి శాశ్వత కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇస్తాం. బీసీ భవనాలు పెండిరగ్‌లో ఉన్నాయి. మొదటి రెండేళ్లలో ఆ పనులన్నీ పూర్తి చేస్తాం. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
టీడీపీ హయాంలోనే అభివృద్ధి
అనంతపురం జిల్లాను అభివృద్ధి చేసింది తెలుగు దేశం పార్టీ. లక్షా 30వేల మంది రైతులకు 90శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందజేశాం. హార్టి కల్చర్ హబ్‌గా అనంతను అభివృద్ధి చేశాం. అరటి రైతుల ఆదాయం రెట్టింపు చేశాం. ఆనాడు ఇన్‌పుట్ సబ్సిడీ అందజేశాం. కరవు వస్తే ఒకే ఏడాది రూ.2వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అందించించిన ఘనత తెలుగు దేశం ప్రభుత్వానిది. రోడ్లు, బ్రిడ్జిలు, తాగు, సాగు నీటి ప్రాజెక్టులు చేపట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అని లోకేష్ చెప్పారు.
జగన్ ది దరిద్రపు పాదం
2019లో పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతు ను తెచ్చుకున్నారు. మనం రెండు నెలలు కష్టపడాలి. జగన్ ది దరిద్రపు పాదం. 30ఏళ్లలో ఎన్నడూ ఇంత కరవు లేదు.అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పట్టు రైతులకు సబ్సిడీ ఇవ్వడం లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పునరుద్ధరిస్తాం. జగన్ ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్, ఇన్ పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. టీడీపీ హయాంలో 15లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తే నేడు 3లక్షల ఎకరాలకు పడిపోయింది. రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పారు.పండిరచిన పంటలకు గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు. పంటలను కొనే నాథుడే లేరు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదు. హెచ్‌ఎల్సీ ఆధునీకరణ జరగడంలేదు. టీడీపీ హయాం లో జీడిపల్లి-పేరూరు ప్రాజెక్టు పనులు ప్రారం భిస్తే నేడు నిలిపివేశారు.తెలుగుదేశం హయాంలో రూ.840 కోట్లతో మెగా డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని ప్రక టించాం. కానీ ఈ ప్రభుత్వం రద్దు చేసిందని లోకేష్ అన్నారు.
అన్నింట్లోనూ ఎమ్మెల్యే దోపిడీనే
పుట్టపర్తి నియోజకవర్గం ప్రశాంతతకు నిలయం. ఇక్కడి ప్రజలు సౌమ్యులు. భగవాన్ సత్యసాయి నిల యం ఉన్న భూమి ఈ పుట్టపర్తి. ఆనాడు పల్లె రఘు నాథరెడ్డి నాయకత్వంలో రూ.2752 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఆర్‌అండ్‌బీ రోడ్లకోసం రూ.204 కోట్లు ఖర్చుపెట్టాం. పంచాయతీ రోడ్లకు రూ.150 కోట్లు ఖర్చుపెట్టాం. సీసీ రోడ్లు వేశాం, 1214 టిడ్కో ఇళ్లు కట్టాం, తాగునీటి పథకాలు కట్టాం, శ్మశానాల ప్రహరీలు కట్టాం. పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతు శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యేను చేశారు. ఆయన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కాదు.. దోపిడీగుంట శ్రీధర్‌రెడ్డి. ఇప్పుడు ఏకంగా బ్యాంకులకే టోపీ పెట్టా రు. రూ.1974కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారు. రేపో మాపో జైలుకు కూడా వెళ్తాడు. నియోజకవర్గాన్ని నాశ నం చేశారు. అడ్డగోలుగా అవినీతి చేశారు. సీఎంతో పోటీపడి ఇల్లు కట్టాడు. ఒక వ్యక్తి కోసం ఇంతపెద్ద ఇల్లా? అహర్నిశలు ఇక్కడ ఉండే వ్యక్తి పల్లె రఘు నాథరెడ్డి. ఎంతో క్రమశిక్షణతో పనిచేశారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే మట్టిని అమ్ముకుంటాడు, భూములు కబ్జా చేస్తాడు. ఎవరైనా లే అవుట్ వేయాలంటే ఇబ్బంది పెడ తాడు. పుట్టిపర్తికి వచ్చాడంటే భూములు లేపేయాలనే ఆలోచనే. వాళ్లే సమస్యలు సృష్టించి వాళ్లే పరిష్కరి స్తారు. వాటా తీసుకుంటారు. చివరకు రేషన్ బియ్యం కూడా వదలడంలేదు. మనం అప్రమత్తంగా ఉండాలని లోకేష్ హెచ్చరించారు.
మాట తప్పిన జగన్
జగన్ అనేక హామీలు ఇచ్చాడు. పుట్టపర్తిని ఆధ్యా త్మిక కేంద్రంగా మారుస్తానని చెప్పి మాట తప్పారు. భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారు. మారెళ్ల రిజర్వాయర్ పనులు మనం పూర్తిచేస్తే కాలువలు తవ్వుతామని చెప్పి మడమ తిప్పారు. టీడీపీ -జనసేన అభ్యర్థిని గెలిపిస్తే పరిశ్రమలు తీసుకువచ్చి స్థానికులకే ఉద్యోగాలు ఇస్తాం. ఏపీఐఐసీ పార్క్ ఉంది. అసెంబుల్డ్ పరిశ్రమలు తీసుకువస్తాం. ప్రతి ఇంటికి నీటి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. రెండేళ్ల లోనే ఆ పని చేస్తాం. 193చెరువులు నింపుతాం. రింగ్ రోడ్డు, చెరువు నిర్వాసితులను ఆదుకోవడంతోపాటు వంద రోజుల్లో టిడ్కో ఇళ్లను పూర్తిచేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
కలిసికట్టుగా పోరాడాలి
మేం ఏనాడూ తప్పు చేయలేదు. చంద్రబాబును అక్రమంగా 53రోజుల పాటు జైలులో నిర్బంధించారు. మొదట రూ.3వేల కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 270కోట్లన్నారు, చివరికి రూ.27 కోట్లని అంటున్నారు. ఇదేం ఛార్జిషీట్ అని జడ్జి బయట పడేశారు. ఆనాడు చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేస్తే నాకు మొదట ఫోన్ చేసిన వ్యక్తి పవనన్న. ధైర్యంగా ఉండాలని, అండ గా ఉంటానని చెప్పారు. ఆయన ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే పర్మిషన్ క్యాన్సిల్ చేశారు, రోడ్డు మార్గంలో వస్తుంటే బోర్డర్‌లో 3గంటలు అడ్డుకున్నారు. అందుకే టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ సైకోను తరిమికొట్టాలని పవన్ నిర్ణయించుకున్నారు. అందుకే హలో ఏపీ.. బైబై వైసీపీ నినాదం ఇచ్చారు. టీడీపీ-జనసేన మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటీఎం బ్యాచ్ కుట్రలు చేస్తారు. అప్రమత్తంగా ఉండి కలిసికట్టుగా పోరాడాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.
వడ్డీతో సహా చెల్లిస్తాం
బాబు సూపర్-6 హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. టీడీపీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లిన వారికి ఉత్తమ కార్యకర్తల అవార్డులు ఇస్తున్నాము. పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం. అలాంటి వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తాం. ఇక కొద్ది రోజుల సమయమే ఉంది ఈ ప్రభుత్వానికి. సమయం లేదు మిత్రమా అన్న.. బాలయ్య బాబు డైలాగ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు రాముడు.. వైకాపాకు ఈ లోకేష్ మూర్ఖుడు. టీడీపీ కేడర్ ను ఇబ్బంది పెట్టిన వారికి ఎన్నికల తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్ హెచ్చరించారు. కాగా సభ అనంతరం రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం, బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై క్యాడర్‌కు లోకేష్ దిశానిర్దేశం చేశారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో మెరుగైన పనితీరు కనబర్చిన కార్యకర్తలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.