- సంక్షేమ బోర్డు నిధులు రూ.2500 కోట్ల మింగేశారు
- అధికారంలోకి వచ్చాక చంద్రన్న బీమా పునరుద్ధరిస్తాం
- మంగళగిరి అడ్డాకూలీలతో యువనేత నారా లోకేష్ భేటీ
మంగళగిరి (చైతన్యరథం): జగన్రెడ్డి ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా చేయడంతో రాష్ట్రం లోని 30లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని టీడీపీ యువనేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. మంగళగిరి గ్రేట్ ఇండియా సెంటర్లో అడ్డాకూలీలతో మంగళవారం ఉదయం భేటీ అయిన లోకేష్ వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భం గా లోకేష్ మాట్లాడుతూ… భవననిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు రూ.2,500కోట్లను దారి మళ్లిం చిన జగన్… కార్మికులకు తీరని ద్రోహం చేశారన్నారు. గత ప్రభుత్వంలో అమలుచేసిన చంద్రన్న బీమా పథకా న్ని కూడా రద్దుచేసి నిలువునా ముంచేశారన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో నిర్మాణరంగం పడ కేసింది. మూడుముక్కలాటతో అమరావతి పనులు నిలి పేయడంతో కార్మికులు పొట్ట చేతబట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
అమరా వతి నిర్మాణం కొనసాగించి ఉంటే 5లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవి. టీడీపీ పాలన లో ట్రాక్టర్ ఇసుక రూ.1500 ఉంటే.. జగన్రెడ్డి పాలనలో రూ.5వేల నుంచి రూ.7వేల వరకు పెరి గింది. దీంతో నిర్మాణరంగం కుదేలై భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. కరోనా సమయంలో వంద లాది కార్మికులు ఉపాధి లేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. గత ప్రభుత్వంలో చంద్రన్న బీమా పథకం ద్వారా కార్మికులను ఆదుకున్నాం. ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతే రూ.5 లక్షల సాయం అందించాం. మట్టి ఖర్చులకు తక్షణమే రూ.5వేలు అందించాం. నేడు చంద్రన్న బీమా పథకాన్ని రద్దు చేయడంతో కార్మి కులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రమాదాలు జరిగినా ఆదుకునేవారు లేరు. గతంలో కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు సాయం అందేది. నేడు సంక్షేమ బోర్డు అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వంలో కార్మిక సంక్షేమ బోర్డును పునర్ నిర్మించి ఆ డబ్బులు కార్మికుల సంక్షేమానికే ఖర్చుచేస్తామని లోకేష్ చెప్పారు.
పనుల్లేక పస్తులుంటున్నాం: కార్మికుల ఆవేదన
ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఇసుక అందుబాటులో లేకపోవడం తో పనులు లేవని, అమరావతి నిర్మాణం నిలిచిపోవ డంతో తామంతా రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. వారంలో అతికష్టం మీద మూడురోజులు మాత్రమే పని దొరుకుతోందని, మిగిలిన రోజుల్లో పస్తు లుండాల్సి వస్తోందని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చాక ఇసుక ధరలు తగ్గించాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వా లని కోరారు. అనారోగ్యానికి గురైన కార్మికులను ఆదు కునే నాథుడు లేడన్నారు.రోజువారీ ఖర్చులకోసం అప్పు లు చేయాల్సి వస్తోందన్నారు. ఒకపక్క పనుల్లేక ఇబ్బం ది పడుతుంటే జగన్ పెంచిన విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు మోయలేని భారంగా మారాయని తెలిపారు.
లోకేష్ స్పందిస్తూ భవననిర్మాణ కార్మికులు ధైర్యంగా ఉండాల ని, రాబోయే ప్రభుత్వం కార్మికులను అన్నివిధాల అం డగా నిలుస్తుందని అన్నారు. జగనోరా వైరస్ను ఓటు ద్వారా తరిమికొడితేనే కార్మికులకు మళ్లీ చేతినిండా పని దొరుకుతుందని చెప్పారు. కార్మికులు, పేదలను కష్టాల నుంచి గట్టెక్కించేందుకే చంద్రబాబునాయుడు సూపర్-6 పథకాలను ప్రకటించారని తెలిపారు. రాబోయే ఎన్ని కల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన ఇసుకపాలసీని అమలు చేస్తామని,అమరావతి పనులు కొనసాగించి నిర్మాణ రంగానికి గత వైభవం చేకూరుస్తామని యువనేత లోకేష్ పేర్కొన్నారు.