- అసెంబ్లీకి రాకుండా ఢల్లీిలో మాట్లాడితే ఏం లాభం
- హత్యల వివరాలు అందిస్తే విచారణ చేయిస్తాం
- తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం
- లోకేష్ రెడ్‌బుక్ గుర్తొచ్చి నిద్ర పట్టడం లేదా?
- ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో ఇప్పటికీ తెదేపా కార్యకర్తలపై దాడులు కొనసాగు తున్నాయని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ ఢల్లీి వీధుల్లో సిగ్గులేకుండా మాట్లా డుతున్నారని వైసీపీ అధినేత జగన్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్ గుర్తొస్తే ఆయనకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ‘‘రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని ఢల్లీిలో జగన్ అబద్ధాలు చెప్పారు. హత్యకు గురైన వారి పేర్లు అడిగితే ఆయన చెప్పలేకపోయారు. అసెంబ్లీకి వచ్చి ఆ పేర్లు చెప్పే దమ్ము జగన్‌కు లేదా? అసెంబ్లీలో అడగ కుండా ఢల్లీిలో మాట్లాడితే ఏం లాభం? రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆయన కుట్ర చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో మర్చిపోయారా? శాంతిభద్రతల గురించి మాట్లాడే హక్కు ఆయనకు ఉందా? హోంమంత్రిగా జగన్‌ను అసెంబ్లీకి ఆహ్వా నిస్తున్నా. హత్యల వివరాలు అందిస్తే తగిన విచారణ చేయిస్తాం. తప్పుడు వివరాలు ఇచ్చిన ట్టు తేలినా చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.