- వైద్యుల నివేదికతో వెల్లడైన బొంకు
- చల్లని వాతావరణంలో ఉంచాలని వైద్యుల సిఫార్సు
- గుండెపైనా ప్రభావం చూపుతుందని వ్యక్తిగత వైద్యుల ఆందోళన
- సౌకర్యాలు, చికిత్సపై జైళ్లశాఖ డీఐజీని నిలదీసిన లోకేష్
- బదులివ్వకుండా దురుసుగా వ్యవహరించిన డీఐజీ
- ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన లోకేష్, భువనేశ్వరి
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ నేతల అనుమానాలు నిజమేనని నిర్ధారణ అయింది. ఈ నెల 12వ తేదీన ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదికలో ఆయన తీవ్రమైన ఆరోగ్య సమస్య లతో బాధ పడుతున్నట్లు వెల్లడయింది. ఒళ్లంతా దద్దుర్లతో స్కిన్ అలర్జీ తీవ్రస్థాయిలో ఉన్నట్లు బయటపడిరది. ఈ నివేదిక గురించి తెలుసుకున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. చంద్రబాబుకు అందిస్తున్న చికిత్సపై జైళ్ల శాఖ డీఐజీ ని నిలదీయటంతో ఆయన సరైన సమాధానం ఇవ్వకపోగా అసహనం వ్యక్తం చేశారు. శనివారం ములాఖత్‌లో చంద్ర బాబును చూసి భువనేశ్వరి, లోకేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడకుం డానే నారా లోకేష్, భువనేశ్వరి అక్కడి నుంచి వెళ్లి పోవటం గమనార్హం.ఈనెల 6వ తేదీ నుంచి ములాఖత్ లో ఆరోగ్యంగా కనిపించిన చంద్రబాబు.. శనివారం చాలా బలహీనంగా కనిపించడంపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత ములాఖత్ నాటికి, నేటికి చంద్రబాబులో చాలా మార్పు వచ్చినట్లు కుటుం బ సభ్యులు గుర్తించారు.
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి అంతా బాగుందని శుక్రవారం జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఒక్క రోజులోనే వైద్యుల నివేదిక వెలుగులోకి వచ్చింది. ఈ నెల 12న సాయంత్రం 4.30 గంటలకు రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంట్ నుం చి వచ్చిన ఆదేశాల మేరకు జీ సూర్యనారాయణ, వీ సునీతాదేవితో కూడిన వైద్య బృందం చంద్రబాబును పరీక్షించి అధికారులకు నివేదిక అందజేసింది. చంద్ర బాబును చల్లని వాతావరణంలో ఉంచటంతో పాటు, పలు రకాల మందులు సిఫార్సు చేసింది. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు నివేదిక ఇచ్చారు. చంద్రబాబు చేతులు, మొహంతో పాటు ఛాతీ, వీపు, గడ్డం,మెడ భాగాల్లో దద్దుర్లు, స్కిన్ అలెర్జీ ఉన్నట్టు నిర్ధా రణ అయింది. తీవ్రమైన ఎండలకారణంగా కొద్ది రోజు లుగా డిహైడ్రేషన్‌తో బాబు ఇబ్బంది పడుతున్నారు అని తేల్చిన ప్రభుత్వ వైద్యులు.. డీ హైడ్రేషన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చల్లని వాతా వరణం ఉండేలా ఏర్పాట్లుచెయ్యాలని నివేదికలో స్పష్టం గా సూచించారు. చంద్రబాబుకి హైపర్ ట్రోఫీక్ కార్డి యో మైయోపతి మస్య ఉందని చంద్రబాబు వ్యక్తిగత వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య కారణంగా డీహై డ్రేషన్‌తో గుండె పైనా ప్రభావంపడే అవకాశం ఉందని వ్యక్తిగత వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా తెలిసే ఆయనపై కుట్ర చేస్తున్నట్లుగా వైద్యవర్గాలు, రాజకీయవర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి. తాజాగా బయటపడిన డాక్టర్ల నివేదికతో చంద్రబాబు ఆరోగ్యం పై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. అయినా కూడా..చంద్రబాబు ఆరోగ్యసమస్యలు చిన్నవేనని ప్రభు త్వం,అధికారులు చెబుతుండటం గమనార్హం. తాజాగా బయటపడిన డాక్టర్ల నివేదికతో చంద్రబాబు ఆరోగ్యం పై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇలాఉంటే చంద్రబాబును ఏ క్షణమైనా ఆస్పత్రికి తరలించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజ మండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఇందుకోసం ఓ ప్రత్యేక గదిని శుక్రవారం అర్థరాత్రి అఘమేఘాల మీద సిద్ధం చేశారు. ఆక్సిజన్‌తో పాటు ఇతర లైఫ్ సపోర్ట్ యంత్రా లన్నీ అందుబాటులో ఉంచుతున్నారు.
చంద్రబాబు ఆరోగ్యంపై రెండు రోజుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్దేశపూర్వకంగా 73 ఏళ్ల వయసు ఉన్న ఆయన ఆరోగ్యం దెబ్బతీసేలా కుట్ర చేశారని.. తప్పుడు కేసులో వ్యవస్థల్ని మేనేజ్ చేసి మరీ జైలుకు పంపడం వెనుక భారీకుట్ర ఉందని టీడీపీ నేత లు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జైలు అధికారులు దొంగ మాటలు చెబుతున్నారు. షుగ ర్‌తో పాటు ఇతర టెస్టుల ఫలితాల గురించి అడిగితే రక్తపరీక్షలు ప్రతిరోజూ చేయరని డీఐజీ రవికిరణ్ వ్యం గ్యంగా మాట్లాడారు.విలేకరుల సమావేశంలో తెల్లకోటు వేసుకుని మెడలో స్టెత్ వేసుకున్న ముగ్గురు జూనియర్ డాక్టర్లు కూడా పాల్గొన్నారు. వారిని పోలీసులు ఒక్క మాట కూడా మాట్లాడనీయకపోవటం గమనార్హం.
ఇలాఉంటే శనివారం ములాఖత్ అనంతరం చంద్ర బాబు ఆరోగ్యం పై అక్కడే ఉన్న డీఐజీని లోకేష్ గట్టిగా ప్రశ్నించారు.చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు ఓపక్క స్పష్టంగా నివేదిక ఉన్నప్పటికీ… ప్రజలను తప్పు దోవ పట్టించేలా డీఐజీ ప్రకటనలు ఇవ్వడాన్ని లోకేష్ ప్రశ్నించారు. చంద్రబాబుకు సౌకర్యాలపై అధికారుల కు వైద్యులు సూచనచేసి 48గంటలు దాటినా ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. ఒక మాజీ ముఖ్య మంత్రి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. డీ హైడ్రేషన్ బారిన పడిన చంద్రబాబును చల్లని వాతావరణంలో పెట్టాలన్న వైద్యు ల సూచనలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించా రు. వైద్యుల సూచనలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని నిలదీశారు. అనారోగ్యంపైనా దాచిపెట్టడం, డాక్టర్ నివేదికలు తొక్కి పట్టడం లోకేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తిచేశారు. అయితే లోకేష్ ప్రశ్నలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా ములాఖత్ సమ యం అయిపోయింది వెంటనే వెళ్ళాలి అంటూ డీఐజీ రవి కిరణ్ దురుసుగా వ్యాఖ్యానించటం గమనార్హం.
ములాఖత్ అనంతరం కాసాని జ్ఞానేశ్వర్ మీడియా తో మాట్లాడుతూ…చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందో ళనకరంగా ఉందన్నారు. ఆయన మాట్లాడలేకపోతున్న ట్లు చెప్పారు. జైల్లో ఆయన పరిస్థితి చూడగానే బాధ కలిగిందన్నారు.
కంటనీరు పెట్టుకున్న భువనేశ్వరి
చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల్లో తీవ్ర మైన ఆందోళన వ్యక్తమవుతోంది. ములాఖత్‌లో చంద్ర బాబును చూసి భువనేశ్వరి, లోకేశ్ భావోద్వేగానికి గుర య్యారు. శరీరంపై దద్దుర్లను కుటుంబ సభ్యులకు చంద్రబాబు చూపించటంతో అక్కడే భువనేశ్వరి కంట నీరు పెట్టుకున్నారు. తండ్రితో మాట్లాడుతున్నప్పుడు లోకేశ్ ఉద్విగ్నతకు లోనయ్యారు. రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలని ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల ను చంద్రబాబు కోరారు. కుట్రతో పెట్టిన కేసు నిల బడదని ధీమా వ్యక్తం చేశారు.