- ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జగన్‌పై విసుర్లు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ తాకట్టుపెట్టింది కేవలం సచివాలయ భవనా లను కాదు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ‘రాష్ట్రానికి ఎంత అవమానకరం. ఎంత బాధాకరం. ఎంత సిగ్గుచేటు జగన్‌రెడ్డీ! ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? రూ.370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్రపాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడం అంటే ఏంటో నీకు తెలుసా?’ అని విస్మయం వ్యక్తం చేశారు. ‘నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. నువ్వు నాశనం చేసింది సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ని’ అని దుయ్యబట్టారు. `‘ప్రజలారా, అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఒక్కసారి ఆలోచించండి’ అని తెదేపా అధినేత చంద్రబాబు ఎక్స్ (ట్విటర్) వేదికగా సూచించారు.