- హజ్ హౌజ్‌కు 10శాతం పనులూ చేయలేదు
- రాయచోటిని అన్ని విధాలా తీర్చిదిద్దుతా
- ప్రజాగళం ఎన్నికల సభలో చంద్రబాబు హామీ
రాయచోటి (చైతన్య రథం): ‘కడప ఎవరి ఇలాకా కాదు. ఏ పెత్తందారు కింద బానిసలుగా పని చేయాల్సిన అవసరం లేదు. మే 13న గెలుపు మనదే. అభివృద్ధికి పునాది వేసుకోవాలి. సైకో జగన్ రాయచోటికి ఏమైనా పనులు చేశాడా? కనీసం కడపకు స్టీల్ ప్లాంట్ వచ్చిందా? కడప జిల్లాల్లో ఒక్క సాగు నీటి ప్రాజెక్టునైనా పూర్తి చేశాడా? కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మేలుచేసిన వ్యక్తి. ఎంపీ అయితే కేంద్రంలో ఉండి పనులు చేస్తారు. కడప జిల్లాలో కరువుందని అధికారులు చెప్పినా జగన్ పట్టించుకోలేదు. 99 శాతం హామీలు అమలు చేయలేదు. జగన్మోహన్‌రెడ్డికి సున్నా మార్కులు ప్రజలు వేశారు. జగన్ ఏలుబడిలో ప్రజా జీవితాలు తలకిందలయ్యాయి. ఆదాయం పెరగలేదు. ఖర్చులు తగ్గలేదు. జీవన ప్రమణాలు దెబ్బతిన్నాయి. జగన్‌ది ఓ కూతల, కోతల ప్రభుత్వం’ అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాయచోటిలో గురువారం నిర్వహించిన ప్రజాగళం సభలో జగన్ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.
అవినాష్ పిల్లాడైతే బడికి పంపాలి..
హూ కిల్డ్ బాబాయ్? వివేకా హంతకులెవరో ప్రజలందరికీ తెలుసు. పక్కనే నిందితుడిని పెట్టుకొని, పాపం పిల్లాడని అంటున్నాడు జగన్. అవినాష్ పిల్లాడే అయితే పలకా బలపం ఇచ్చి బడికి పంపాలి కానీ, పార్లమెంట్‌కు పంపుతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మళ్లీ జగన్ వస్తే మీ ఊరికి గొడ్డలొస్తుంది. ఒంటిమిట్టలో చేనేత కార్మికుడి కుటుంబంలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. జగన్ రాజకీయాల్లో ఉంటే ప్రజల ప్రాణాలకు భద్రత లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి సైకో జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు.
కడప హజ్ హౌస్‌కి 10 శాతం పనులు పూర్తి చేయలేదు
తెలుగుదేశం హాయంలో ఎప్పుడైనా ముస్లింలకు అన్యాయం జరిగిందా? అని బాబు ప్రశ్నిస్తూ.. మిథున్‌రెడ్డి ఎంపీగా ఉండి సీఏఏ, ఎన్‌ఆర్సీలకు ఎలా మద్దతు తెలిపారని నిలదీశారు. ఎన్డీఏలో తెలుగుదేశం ఉన్నపుడే ఉర్దూ వర్శిటీ, హాజ్‌హౌస్ కట్టామని, విభజిత రాష్ట్రంలోనే కడపలో హజ్‌హౌస్‌లు 90 శాతం పూర్తిచేస్తే, జగన్ మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయలేకపోయాడన్నారు. హజ్ యాత్రికులకు రూ.లక్ష సాయం అందిస్తామని, షాదీఖానాలు, మసీదుల మరమ్మత్తులకు నిధులు కేటాయిస్తామన్నారు. నూరుభాషా కార్పొరేషన్ ద్వారా రూ.100 కోట్లు ఇస్తామంటూ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రూ.5లక్షలకు వడ్డీలేని రుణాలు ఇప్పిసామన్నారు. ఇమామ్, మౌజన్‌లకు రూ.10వేలు, రూ.5వేల గౌరవ వేతనం ఇస్తామన్నారు. 4 శాతం రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టులో పోరాడి కాపాడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మళ్లీ దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా పునరుద్ధరిస్తామన్నారు.
రాయచోటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం
ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి భూగర్బ డ్రైనేజీ పేరుతో కోట్లు కొట్టేశాడు. ముబారక్ నగర్, భారత్ పెట్రోల్ బంక్, చిత్తూరు రింగ్‌రోడ్‌లో లాండ్ కబ్జాలతో రూ.200 కోట్లు కొట్టేశారు. వీళ్ల ఆటలు ఇక సాగనివ్వం. రాయచోటి జిల్లాగా ఉండి హెడ్‌క్వార్టర్‌గా ఇదే ఉంటుంది. వెల్లిగల్లలో శ్రీనివాసపురం జరికోన రిజర్వాయర్లు పూర్తి చేస్తాం. రాయచోటిలో ఇంటింటికి మంచి నీరు ఇస్తాం. మైనారిటీ జూనియర్ కాలేజీ ఇస్తాం. మైనారిటీల కోసం పాలిటెక్నిక్ కాలేజీ పెడతాం. మైనారిటీ కోసం ప్రసూతి కేంద్రం ఏర్పాటు చేస్తాం. రాయచోటికి పరిశ్రమలు తెస్తాం, వ్యవసాయం అభివృద్ధి చేస్తాం. సంపద పెంచి ఆదాయం పెంచే బాధ్యత మాది. గెలుపు మనదే, విజయం మనదే, భవిష్యత్ మనదే’ అని చంద్రబాబు ఉద్వేగంగా ప్రకటించారు.