- ప్రతిసభలోనూ బాబు నామస్మరణే
- జగన్ చెడ్డీలు వేసుకునే రోజుల్లోనే అభివృద్ధిని పరిచయం చేసిన చంద్రన్న
- బహిరంగ చర్చకు సిద్ధం
- కదిరి సభలో లోకేష్
కదిరి (చైతన్యరథం): జగన్‌ను చూస్తే బిల్డప్ బాబాయి గుర్తుకువస్తున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవాచేశారు. ఎవరైనా ముఖ్య మంత్రి సభకు వెళ్తే.. ఐదేళ్లలో ఏం చేశాడో చెప్పుకుం టారు.. కానీ జగన్ మాత్రం ప్రతిచోటా చంద్రబాబు జపం చేస్తున్నారని దుయ్యబట్టారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో శక్రవారం జరిగిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ రాత్రి పూట కూడా చంద్రబాబు, పవన్ నామస్మరణ తప్ప జగన్‌కు వేరే పని ఉండటం లేదన్నా రు. మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్ గుర్తుకువస్తా డు. జగన్‌ను చూస్తే గుర్తుకువచ్చేది కోడికత్తి, బాబాయి గొడ్డలిపోటు, తల్లి, చెల్లి గెంటివేత. జగన్ చెడ్డీలు వేసుకునే రోజుల్లోనే ఏపీకి అభివృద్ధిని పరిచయం చేసిన నాయకుడు చంద్రబాబు.
అప్పట్లో హైదరాబాద్ ను అభివృద్ధి చేశారు. 2014-19 మధ్య అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమను తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుది. హీరో మోటార్స్, హెచ్‌సీఎల్ లాంటి అనేక కంపెనీలను తీసుకువచ్చారు. జగన్ కు ఇష్టమైన చంచల్ గూడ జైలును కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు. అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమా. టైం, డేట్ ఫిక్స్ చేస్తే అభివృద్ధి, సంక్షేమంపై జగన్‌తో చర్చకు నేను సిద్ధం. విజయసాయిరెడ్డిని, సాక్షి,సజ్జలను పంపిస్తానంటే కుదరదు.
గుండెల్లో పెట్టుకుంటాం
టీడీపీ బలం కార్యకర్తలు. నాయకులు వెళ్లినా కార్యకర్తలు అండగా నిలబడ్డారు. వైకాపా కార్యకర్తలకు ఉత్సాహం కావాలంటే బూమ్ బూమ్ కావాలి కానీ… మనకు చంద్రన్న రా.. కదలి రా అంటే చాలు. కార్యకర్తల సంక్షేమం కోసం 2014లో నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదవశాత్తు చనిపోయిన కార్య కర్తల కుటుంబాలకు రూ.2 లక్షలు ఇచ్చాం. ఇప్పటివరకు 100 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని ఆదుకుంటామని లోకేష్ అన్నారు.
2019నుంచి మనపై అనేక దొంగకేసులు పెట్టారు. నాపై 22కేసులు పెట్టారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు, హత్యాయత్నం కేసులు పెట్టారు. అయినా తగ్గేదే లేదు. రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. అక్రమ కేసు లు తీసేస్తాం. చట్టాలు ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నాయి. వైకాపా నేతలపేర్లు కూడా ఉన్నా యి. రెడ్‌బుక్ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. నాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటు న్నారు. దమ్ముంటే నేను పుట్టపర్తిలో ఉన్నా.. రా. నేను పరదాలు కట్టుకుని తిరగడం లేదని లోకేష్ అన్నారు.
కదిరి జోషే వేరు
కదిరి నియోజకవర్గాన్ని జీవితాంతం గుర్తుపెట్టు కుంటా. ఇక్కడ పాదయాత్ర చేసినపుడు ఓ తాత నా చేయి పట్టుకుని వదల్లేదు. మీ అందరి ఆశీస్సులతో 3132కి.మీ పాదయాత్ర చేశా. కదిరిలో నేను సమస్య లను ప్రత్యక్షంగా తెలుసుకున్నా. కదిరి ప్రజల జోషే వేరు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ కదిరి. మన హయాంలో 1200 కోట్లతో చాంద్ బాషా, కందికుంట ప్రసాద్ కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. షాదీ మహల్, కమ్యూనిటీ భవనా లు, ఇండోర్ స్టేడియం కట్టాం. ఇక్కడే ఉర్దూ యూని వర్సిటీ కూడా శాంక్షన్ చేసింది మన ప్రభుత్వం. డ్యాంలు కట్టాం, బస్టాండ్ కట్టాం, సీసీ, బీటీ రోడ్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు కట్టాం. జగన్ పాదయాత్ర లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుచేస్తామని చెప్పి చేయలేదు, ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు తీసుకువస్తామ న్నారు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా చేస్తామని చెప్పి మోసంచేశారని లోకేష్ విమర్శించారు.
అవినీతిలో మేటి ఎమ్మెల్యే
ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏనాడైనా పెండిరగ్ పనుల కోసం పోరాడారా అని అడుగుతున్నా. ఎమ్మెల్యే అవినీతిలో సిద్ధహస్తులు. పుట్టపర్తి ఎమ్మెల్యే అవినీతితో ఇతను కూడా పోటీ పడుతున్నాడు. సోలార్ పార్క్ లో పనిచేస్తున్న అనేక ఏజెన్సీల నుంచి రూ. 8 కోట్లు వసూలు చేశాడు. అభివృద్ధి పనులు జరగాలంటే ఆయన కంపెనీలకే కాంట్రాక్టులు ఇవ్వాలి. రింగ్ రోడ్డు పనులు పూర్తిచేయకుండా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కూడా డబ్బులు కాజేసిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే. దేవుడితో పెట్టుకున్నావ్… నీ పని గోవిందా గోవిందా. రెండు నెలలు ఓపిక పడితే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. తెలుగుదేశం-జనసేన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.
ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
అధికారంలోకి వచ్చాక పెండిరగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. హంద్రీ-నీవా మెయిన్ కెనాల్ నుంచి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. వేరుశనగ, టమోటా రైతులను ఆదుకుంటాం. పాత మద్యం విధానం తీసుకువస్తాం. షాపులు తగ్గిస్తాం. ప్రజలను మద్యానికి బానిస కాకుండా చేస్తాం. ఉపాధి కోసం గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్లే వారికి శిక్షణ ఇస్తాం. మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పిస్తాం. నియోజకవర్గానికి ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు తీసుకువస్తాం. మన ప్రభుత్వంలో వంద రోజుల్లో టిడ్కో ఇళ్లు పూర్తిచేసి గృహప్రవేశాలు చేసుకుందాం. కుళాయిల ద్వారా సురక్షితమైన తాగునీరు ప్రతి గడపకు అందిసామని లోకేష్ హామీ ఇచ్చారు.
కాగా సభ అనంతరం రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం, బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై క్యాడర్‌కు లోకేష్ దిశానిర్దేశం చేశారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో మెరుగైన పనితీరు కనబర్చిన కార్యకర్తలకు ప్రశంసపత్రాలు అందజేశారు.