నా బిసిలు అంటూనే జగన్ దారుణ మోసం!
యాదవులకు బంజరుభూములు కేటాయిస్తాం
యాదవులకు ఎంపిసీటు, పదవులు ఇస్తాం
యాదవ నేతలపై కేసులుపెట్టి వేధిస్తున్న జగన్
యాదవులతో ముఖాముఖిలో యువనేత లోకేష్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా బిసిలు అంటూనే యాదవులు, వెనుకబడిన వర్గాలకు తీరని అన్యాయం చేశారని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. జివిఎంసి 82వవార్డులో యువనేత లోకేష్ యాదవులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ… టిడిపి ఆవిర్భావం నుంచీ యాదవులకు సముచిత స్థానం స్థానం కల్పించాం, బీద రవిచంద్ర, గుండుమల తిప్పేస్వామి, బచ్చుల అర్జునుడు లకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాం. రెడ్డయ్య యాదవ్ ను మచిలీపట్నం ఎంపిని చేశారు. టిడిపి హయాంలో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదేళ్లలో (2014-19) రూ.278 కోట్లు ఖర్చు చేశాం. 90 శాతం సబ్సిడీతో ఆదరణ పథకం ద్వారా పరికరాలు అందించాం. గొర్రెలు, మేకల కొనుగోలుకు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించాం. యాదవులను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రోత్సహించాం. పశుసంవర్ధక శాఖ ద్వారా రూ.395 కోట్లతో సహకార సంఘాల ఆధ్వర్యంలో గొర్రెలు కొనుగోలు చేశాం. గొర్రెలు, మేకలకు వ్యాధి నిరోధక టీకాలు టీడీపీ హయాంలో ఉచితంగా వేయిస్తే ఇప్పుడు ఏకంగా రద్దు చేశారు.
సబ్సిడీ రుణాలు మంజూరుచేస్తాం
టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గొర్రెల కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తాం. పశువుల మేపకం కోసం బంజరు భూములు కేటాయిస్తాం. మందులు, డీ వార్మింగ్ ఉచితంగా అందిస్తాం. కృష్ణుడు గుడులు కట్టడానికి ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయిస్తుంది. అమర్నాథ్ గౌడ్ అనే కుర్రాడిని అత్యంత కిరాతకంగా చంపేసిన వాడికి వైసిపినేతలు సన్మానం చేసారు. 26 వేల మంది బిసిల పై అక్రమ కేసులు పెట్టింది వైసిపి ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బిసిల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. ఎంపి సీటు తో పాటు నామినేటెడ్ పోస్టులు కూడా యాదవ సామాజికవర్గం ప్రతినిధులకు కేటాయిస్తాం.
యాదవులకు జగన్ రెడ్డి దగా!
జగన్మోహన్ రెడ్డి యాదవులకు దగా చేసాడు. జగన్ యాదవ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. జగన్ పాలనలో రూపాయి కూడా ఖర్చు చేసింది లేదు. గొర్రెల, మేకల పెంపకందార్లకు ఇచ్చే అన్ని సబ్సిడీలు, సంక్షేమ పథకాలు రద్దు చేశారు. యాదవుల పై జగన్ పాలనలో అనేక దాడులు దౌర్జన్యాలు జరిగాయి. యాదవుల సంక్షేమపథకాలు రద్దు చేశారు. యాదవ కార్పొరేషన్‌కు నిధులివ్వని జగన్ యాదవులపై కక్ష కట్టి మరీ దాడులు చేయించారు. అక్రమ కేసులు బనాయించారు. పెళ్లిలో అక్షింతలు వేశారనే నెపంతో యనమల రామకృష్ణుడిపై అట్రాసిటీ కేసు పెట్టారు. అసెంబ్లీ సాక్షిగా బీదా రవిచంద్ర యాదవ్‌పై దాడికి పాల్పడ్డారు. బచ్చుల అర్జునుడిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. పల్లా శ్రీనివాస్, అతని సోదరుని ఆస్తుల్ని ధ్వంసం చేశారు.
యాదవులకు కీలక పదవులిచ్చాం
యాదవ అనేగానే పౌరుషం గుర్తు వస్తుంది. యాదవులకు ఆర్ధిక, రాజకీయ స్వాతంత్య్రం ఇచ్చింది అన్న ఎన్టీఆర్. టిడిపి ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడుకి పదవిస్తే… జగన్ రెడ్డి ఆర్థిక శాఖా మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చారు. టిడిపి టీటీడీ ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ని చేస్తే…జగన్ తన బాబాయ్ సుబ్బారెడ్డిని, ఇప్పుడు బంధువు భూమన కరుణాకర్ రెడ్డిలకు టిటిడి చైర్మన్ చేశారు. చంద్రబాబు ఏపీఐఐసీ ఛైర్మన్ కృష్ణయ్య యాదవ్ కి ఇస్తే, జగన్ రోజారెడ్డికి ఇచ్చారు. టిడిపి తుడా ఛైర్మన్ నర్సింహ యాదవ్ ని చేస్తే, వైకాపా ముందుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చేసింది..ఇప్పుడు వాళ్లబ్బాయి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అప్పగించారు.
జగన్ పాలనలో బిసి హాస్టళ్లు గాలికి!
జగన్ పాలన లో బీసీ హాస్టల్స్ ను గాలికి వదిలేశారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రైవేట్ కి ధీటుగా బీసీ సంక్షేమ హాస్టళ్లు అభివృద్ధి చేస్తాం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య, పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తాం. మీ ప్రాంతంలో గుంతల్లో రోడ్డు ఎక్కడ ఉందా అని వెతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతంలో రోడ్లు వెయ్యడానికి టిడిపి హయాంలో రూ.100 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించాం. ఆ పనులు నిలిపేశారు. జగన్ ప్రభుత్వానికి కనీసం గుంతలు పుడ్చే దిక్కు లేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త రోడ్లు వేస్తాం. దామాషా ప్రకారం యాదవులకు రాజకీయ అవకాశాలు కల్పిస్తాం. టిడిపి హయాంలో యాదవ కమ్యూనిటీ భవనాలు నిర్మించాం. టిడిపి హయాంలో 90 శాతం పూర్తి అయిన కమ్యూనిటీ భవనాలు పూర్తి చెయ్యకుండా జగన్ ప్రభుత్వం వదిలేసింది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దామాషా ప్రకారం యాదవులకు కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం. గొర్రెలకు ఇన్స్యూరెన్స్ అందిస్తాం. ఉత్తరాంధ్ర లో ఉన్న యాదవులు బిసి బి లో ఉండాలని కోరుకుంటున్నారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బిసి కమిషన్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం.
యాదవ సామాజికవర్గ ప్రతినిధులు మాట్లాడుతూ…
టిడిపి హయాంలో గొర్రెల కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు ఇచ్చేవారు. జగన్ పాలనలో గొర్రెల కొనుగోలు కోసం రుణాలు ఇవ్వడం లేదు. యాదవులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కృష్ణుడు గుడి కట్టుకోవడానికి సాయం అందించాలి. 50 ఏళ్లు దాటిన గొర్రెల పెంపకం దారులకు పెన్షన్ ఇవ్వాలి. బిసి సంక్షేమ హాస్టళ్లు చాలా దారుణంగా ఉన్నాయి. మీ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా అభివృద్ధి చెయ్యాలి. జగన్ పాలనలో మా ప్రాంతంలో రోడ్డు లు దారుణంగా ఉన్నాయి. మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మెరుగైన రోడ్లు వెయ్యాలి. టిటిడి బోర్డులో యాదవులకి ప్రత్యేక స్థానం కల్పించాలి. యాదవులకు మరిన్ని రాజకీయ అవకాశాలు కల్పించాలి. జగన్ ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసాడు. ఒక్క రుణం ఇవ్వడం లేదు. జగన్ పాలనలో ఒక్క యాదవ భవనం కట్టలేదు. మేము పశువులు మేపుకునే భూములు వైసిపి ప్రభుత్వం వెనక్కి లాక్కుంది. గొర్రెలు చనిపోతే టిడిపి హయాంలో ఇన్స్యూరెన్స్ ఇచ్చేవారు. జగన్ పాలనలో ఇన్స్యూరెన్స్ ఇవ్వడం లేదు.
చెత్త ఎక్కడైనా చెత్తే… పక్కింట్లో వేస్తే బంగారం కాదు!
అనకాపల్లి: జివిఎంసి 82వవార్డులో యాదవులతో ముఖాముఖి సమావేశం సందర్భంగా యువనేత లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసిపి ఇంఛార్జుల మార్పుపై లోకేష్ స్పందిస్తూ… మన ఇంట్లో చెత్త తీసుకెళ్ళి పక్క ఇంటి ముందు పోసినంత మాత్రాన చెత్త.. బంగారం కాదు. ఒక చోట అవినీతి, అసమర్థుడు అయిన వైసిపి అభ్యర్థులు వేరే చోటకి మారినంత మాత్రాన మంచి వారుగా మారరు. ఓడిపోయే సీట్లు బీసీలకి ఇచ్చి.. గెలుస్తాం అనుకునే సీట్లు ఒకే సామాజిక వర్గం వారికి ఇస్తున్నాడు జగన్. టిడిపి గెలిచే సీట్లు మాత్రమే బీసీలకు కేటాయిస్తుంది. జగన్ మన బిసిలు, మన ఎస్సీలు అని మోసం చేసాడని వ్యాఖ్యానించారు.
3).అనకాపల్లి నుంచి టిడిపిలోకి భారీగా వలసలు ..పార్టీలో చేరిన సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నారా లోకేష్
యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అనకాపల్లి నియోజకవర్గంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. జీవీఎంసీ 82వ వార్డులో నారా లోకేష్ యువగళం క్యాంప్ సైట్ లో గొలగం ఎంపీటీసీ, సర్పంచ్ చంద్రశేఖర్, అక్కిరెడ్డి వెంకటరమణ, పాడేరు నియోజకవర్గం లగిసపల్లికి సర్పంచ్ పార్వతమ్మ శనివారం టీడీపీలో చేరారు. వీరితో పాటు అనకాపల్లికి చెందిన పలువురు వార్డు మెంబర్లు, మిల్క్ సొసైటీ సభ్యులు కూడా టీడీపీలో చేరారు. వీరందరికీ నారా లోకేష్ టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని, సర్పంచులను ఉత్సవ విగ్రహంలా మార్చిందని సర్పంచులు, ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ…పంచాయతీలకు మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని, పంచాయతీల నిధులు గ్రామాలాభివృద్ధికే ఖర్చు చేస్తామన్నారు. ఇప్పటికీ వెయ్యికోట్లకు పైగా పంచాయతీల ఖాతాల నుండి విద్యుత్ బకాయిల పేరుతో లాక్కున్న జగన్ రెడ్డి ప్రభుత్వం…ఖాతాల్లో ఉన్న మరో రూ.250 కోట్లు కూడా లాగేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మీ నియోజకవర్గాల్లో టీడీపీని అధికమెజారిటీతో గెలిపించాలని లోకేష్ కోరారు.
4).బెల్లం తయారీదారుల సమస్యలు తెలుసుకున్న యువనేత లోకేష్
యలమంచిలి నియోజకవర్గం మునగపాక శివార్లలో బెల్లం తయారు చేస్తున్న రైతులను యువనేత లోకేష్ కలిసి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చెరకు రైతులు మాట్లాడుతూ… నల్లబెల్లంపై ప్రభుత్వం ఆంక్షలు వేధించి, వ్యాపారులను వేధిస్తుండటంతో మా వద్ద బెల్లం కొనుగోళ్లు తగ్గిపోయాయి. దీంతో మార్కెట్ లో కిలో 50రూపాయలు పలికే బెల్లాన్ని రూ.30కే తోటలవద్ద అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ వేధింపుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాం. మాకు సహకారం అంధించకపోగా ఇబ్బందులు పెట్టడం దారుణం. మీరు అధికారంలోకి వచ్చాక చెరకు రైతులు, బెల్లం తయారీదారులను ప్రభుత్వం ఆదుకోవాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ..గంజాయి, డ్రగ్స్, దొంగసారా కాసేవాళ్లను పట్టుకోవడం చేతగాని జగన్ ప్రభుత్వం రైతులు, వ్యాపారులను ఇబ్బందులు పెట్టడం దారుణం. విశాఖ ఏజన్సీలో ప్రభుత్వ పెద్దల అండతోనే గంజాయి సాగు జోరుగా సాగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్లం తయారీదారులు, వ్యాపారులపై ఆంక్షలను తొలగించి స్వేచ్చగా విక్రయాలకు అవకాశం కల్పిస్తాం. చెరకు రైతులకు ప్రభుత్వం తరపున సహకారం అందించి ఆదుకుంటాం.
5).అంగన్ వాడీల శిబిరాన్ని సందర్శించిన లోకేష్
యలమంచిలి నియోజకవర్గం మునగపాకలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీల శిబిరాన్ని యువనేత లోకేష్ సందర్శించి, సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మరో 3 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ సమస్యలకు పరిష్కారం చూపకపోగా, బెదిరింపుల ధోరణిలో మాట్లాడడం జగన్ నియంతృత్వ పోకడలకు నిదర్శనం. అంగన్వాడీ సెంటర్లను తెరవకపోతే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో నడిపించుకుంటామని మంత్రులు వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. 2019 ఎన్నికల సమయంలో జగన్మహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశాడు. టీడీపీ పాలనలో రెండు సార్లు అంగన్వాడీల గౌరవవేతనాన్ని పెంచాం. అంగన్వాడీలు న్యాయబద్ధమైన పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని హామీనిచ్చారు.
6)అధికారంలోకి రాగానే బీసీలకు రక్షణ చట్టం: నారా లోకేష్
యలమంచిలి నియోజకవర్గం అరబుపాలెం బిసిలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బీసీలకు రక్షణ చట్టం తెచ్చి రక్షణ కల్పించాలి. విద్య,ఉద్యోగ,ఉపాధి అవకాశాల్లో మెరుగైన రిజర్వేషన్ కల్పించాలి. చేతివృత్తిదారులను ప్రోత్సహించేందుకు ఆధునిక టెక్నాలజీ పనిముట్లు అందించాలి. వివిధ కార్పొరేషన్ల ద్వారా బీసీల్లో వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలి. రాజకీయంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు అవకాశం ఇవ్వడం వల్ల చట్టసభల్లో ప్రాతినిథ్యం పెంచాలి. చేతివృత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. బీసీల్లో గుర్తింపురాని కులాలను గుర్తించి ప్రోత్సహించాలి. బీసీల్లోని పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూమి సౌకర్యాలకు కృషి చేయాలని కోరారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ….జగన్ అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ.75,760కోట్లు దారిమళ్లించారు. టిడిపి హయాంలో బీసీలకు ఆదరణ పథకం ద్వారా రూ.964కోట్ల విలువైన పనిముట్లు 90శాతం సబ్సిడీపై అందించాం. బీసీలకు ఎన్టీఆర్ రాజకీయాల్లో 24శాతం రిజర్వేషన్ ఇచ్చారు. చంద్రబాబు బిసి రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారు. బిసిలకు 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి 16 వేల మందిని పదవులకు దూరం చేసిన బీసీ ద్రోహి జగన్. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన బిసిలపై జగన్ సర్కార్ 26 వేల అక్రమ కేసులు పెట్టింది. మేం అధికారంలోకి వచ్చాక బీసీలకు రక్షణ చట్టం తెస్తాం. బీసీల్లోని అన్ని కులాలను గుర్తించి అన్ని రంగాల్లో ముందుకు తెస్తాం. సొంతిల్లు లేని పేదలకు స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తాం.
7). శారదా కాలువ పూడిక తీయిస్తాం .. గంగాదేవిపేట రైతులకు లోకేష్ హామీ
యలమంచిలి నియోజకవర్గం గంగాదేవిపేట రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో చెరుకు, వరి, కొబ్బరి పంటలు సాగు చేస్తున్నాం. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎరువులు, పురుగుమందులు, కూలి రేట్లు పెరిగిపోయాయి. పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నాం. గతంలో శారదా నంది నుండి అనకాపల్లి పట్టణం నుండి కాలువ నీరు వచ్చేది. కాలువ పూడిక తీయకపోవడం వల్ల నీరు రావడం లేదు. పంటకాలువ పట్టణం నుండి రావడంతో చెత్త అధికంగా వేయడంతో పూడిపోతోంది. మీరు అధికారంలోకి వచ్చాక కాలువ పూడిక తీయించి నీరు వచ్చేలా చేయాలని కోరారు.
నారా లోకేష్ స్పందిస్తూ…జగన్మోహన్ రెడ్డి చేతగానిపాలన కారణంగా వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ కాల్వల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శారద కాలువపూడిక తీసి, రైతులకు ఉపయోగకరంగా తీర్చిదిద్దుతాం. కాల్వలో నీరు కలుషితం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
8).నారా లోకేష్ ను కలిసిన ఒంపోలు, నాగులాపల్లి రైతులు
యలమంచిలి నియోజకవర్గం ఒంపోలు, నాగులాపల్లి రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా నియోజకవర్గంలో 80శాతం మంది రైతులు, కౌలురైతులు, రైతు కూలీలు వ్యవసాయంపై ఆధారపడ్డారు. చెరుకు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు. చెరుకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. అనకాపల్లి బైపాస్ నుండి అచ్యుతాపురం వరకు బి.టి రోడ్డు గుంతలు పడి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక బైపాస్ రోడ్డును విస్తరించి బిటి రోడ్డు నిర్మించాలని కోరారు. లోకేష్ స్పందిస్తూ…జగన్మోహన్ రెడ్డి పాలన రైతుల మెడకు ఉరితాడుగా మారింది. పాదయాత్ర సమయంలో మూతబడిన చెరుకు ఫ్యాక్టరీలన్నింటినీ తెరిపిస్తానని చెప్పిన జగన్ నేటికి ఒక్క ఫ్యాక్టరీని కూడా తెరిపించలేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక చెరుకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటాం. మూతపడిన చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించేందుకు గల అవకాశాలను పరిశీలించి సహకారం అందిస్తాం. అనకాపల్లి బైపాస్ రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకుంటాం. గుంతలు పడిన రోడ్ల స్థానంలో కొత్తరోడ్లు నిర్మిస్తామని హామీనిచ్చారు.
9).ప్రయివేట్ టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ నారా లోకేష్ హామీ
అనకాపల్లి నెహ్రూచౌక్ వద్ద ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అరకొర జీతాలతో టీచర్లు, లెక్చరర్లుగా జీవనం కొనసాగిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఉపాధ్యాయులు లక్షల సంఖ్యలో ఉన్నారు. మాకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత లేదు. మా సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్నవారికి హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలం, గుర్తింపుకార్డులు ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి. పీఎఫ్, ఈఎస్‌ఐ వర్తింపజేసి ఏడాదిలో 12నెలలకూ జీతాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి. ప్రసూతి సెలవులు విషయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చిన విధంగా వేతనంతో కూడిన సెలవులు ఇప్పించాలి. ప్రమాదవశాత్తు మరణించిన టీచర్ కుటుంబాలకు బీమా వర్తింపజేయాలి. ప్రైవేటు టీచర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది పిల్లలకు ఉచిత విద్యనందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నారా లోకేష్ స్పందిస్తూ…విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి అవగాహనా లేమి ప్రైవేటు టీచర్లకు శాపంగా పరిణమించింది. కరోనా సమయంలో ప్రైవేటు టీచర్లకు ఎటువంటి సాయం అందించకపోతే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తాం. ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రైవేట్ టీచర్లకు ఐడికార్డులు, ఆరోగ్య బీమా, పీఎఫ్, ఈఎస్‌ఐ , ప్రైవేటు మహిళా టీచర్లకు ప్రసూతి సమయంలో వేతనంతో కూడిన సెలవులు వంటి సమస్యలను పరిష్కరిస్తాం. ప్రైవేటు స్కూల్స్ లో పనిచేసే సిబ్బంది పిల్లలకు ఆ సంస్థల్లో రాయితీతో విద్యనందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
10).అధికారంలోకి రాగానే కాపులకు రిజర్వేషన్లు: నారా లోకేష్
అనకాపల్లి వేల్పుల వీధిలో కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో కాపు సామాజికవర్గానికి చంద్రబాబు 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానంచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మాకు 5శాతం రిజర్వేషన్ ను అమలుచేసే అవకాశమున్నా పట్టించుకోలేదు. ఈ విషయంపై ముఖ్యమంత్రిని ప్రశ్నించినా ఉపయోగం లేకుండాపోయింది. మా పిల్లలు రిజర్వేషన్ అమలు కాకపోవడంతో విద్య, ఉద్యోగాలకు దూరమవుతున్నారు. గతంలో అనకాపల్లిలో కాపు సంక్షేమ భవనానికి స్థలం ఇచ్చి భవన నిర్మాణానికి నిధులు కూడా కేటాయించారు. వైసీపీ వచ్చాక ఆ భవన నిర్మాణాన్ని నిర్వీర్యం చేసి మమ్మల్ని అవమానించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మాకు 5శాతం రిజర్వేషన్ ఇవ్వాలి, కాపు సంక్షేమ భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలని కోరారు. నారా లోకేష్ స్పందిస్తూ…జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి కాపుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అధికారంలోకి వచ్చాక కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని, కాపు కార్పొరేషన్ కు రూ.3వేలకోట్ల నిధులు కేటాయిస్తానని చెప్పి మోసగించారు. రాష్ట్రవ్యాప్తంగా నిమ్మకాయల చినరాజప్ప లాంటి కాపు ప్రముఖులపై తప్పుడు కేసులు నమోదుచేసి వేధిస్తున్నారు. కాపులకు 5శాతం రిజర్వేషన్ కల్పించే అంశంపై రాబోయే టిడిపి-జనసేన ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. కాపు కార్పొరేషన్ కు నిధులు కేటాయించి, అసంపూర్తిగా నిలచిపోయిన కాపు భవనాలను పూర్తిచేస్తాం. కాపువిద్యార్థులకు గతంలో మాదిరిగా విదేశీ విద్య పథకాన్ని అమలుచేస్తామన్నారు.
11).లోకేష్ ను కలిసిన అనకాపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు
అనకాపల్లి ముప్పన సిల్క్స్ వద్ద అనకాపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంక్షేమ సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మేమంతా మధ్యతరగతి వ్యాపారస్తులం. లీగల్ మెట్రాలజీ, ఫుడ్ లైసెన్స్, జీఎస్టీ లైసెన్స్, లేబర్ లైసెన్స్, పెస్టిసైడ్స్ లైసెన్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్, మున్సిపల్ ట్యాక్స్, మున్సిపల్ ఆశీలు కడుతున్నాం. కిరాణా, ఫ్యాన్సీ, బంగారం, చెప్పులు, వస్త్రాలు వ్యాపారాలు చేసే వాళ్లంతా ఈ ఆశీలు కడుతున్నాం. మా నుండి రాష్ట్ర ఖజానాకు పెద్దమొత్తంలో డబ్బులు సమకూరుతున్నాయి. మా వ్యాపారాల ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాం. ప్రభుత్వం మాకు ఎలాంటి సహాయ,సహకారాలు అందించకపోగా మమ్మల్ని వేధిస్తోంది. సింగిల్ విండో విధానంలో మొత్తం లైసెన్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. మాకు ఆరోగ్య బీమా, ఆరోగ్యశ్రీ వర్తింపజేసి ఆరోగ్య భద్రత కల్పించాలి. ట్యాక్స్ కట్టేవారికి ప్రత్యేకమైన కార్డులిచ్చి కార్డు ఉన్నవారికి రాయితీలు కల్పించాలని కోరారు.
నారా లోకేష్ స్పందిస్తూ…ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జె-ట్యాక్స్ విధానాల కారణంగా రాష్ట్రంలో అన్నిరకాల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ పన్నులు చెల్లిస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకరించే వ్యాపారులను ప్రభుత్వం వేధించడం దారుణం. టిడిపి అధికారంలోకి వచ్చాక సింగిల్ విండో విధానం ద్వారా లైసెన్సులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. వ్యాపారులపై ఎటువంటి వేధింపులు లేకుండా స్వేచ్చాయుత వాతావరణంలో తమ కార్యకలాపాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటాం. వ్యాపారులకు తక్కువ ప్రీమియంపై ఆరోగ్య బీమా అమలుచేసేలా చర్యలు తీసుకుంటాం. వ్యాపార సంస్థల్లో పనిచేసే కార్మికులకు నిబంధనలకు లోబడి ఆరోగ్యశ్రీ అమలుచేస్తామన్నారు.
12).మా ఉపాధిని రక్షించండి..లోకేష్‌తో మీ సేవ సెంటర్ల నిర్వాహకుల మొర
అనకాపల్లి సంతోషిమాత గుడివద్ద మీ సేవా సెంటర్ల నిర్వాహకులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 25వేల మీసేవ సెంటర్ నిర్వాహకులు ఉన్నారు. వీటిపై సుమారు 50వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 32 విభాగాలకు సంబంధించిన 400పైగా సర్వీసులను మేము గతంలో అందించాం. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక మీసేవ కేంద్రాలను నిర్వీర్యం చేశారు. సచివాలయాల్లో ప్రభుత్వ సర్వీసులు అందిస్తూ మాకు ఉపాధి లేకుండా చేశారు. ఒక్కొక్కరు రూ.3లక్షలు వరకు మేము పెట్టుబడులు పెట్టుకుని సెంటర్లు పెట్టాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక మీసేవ కేంద్రాల నిర్వాహకులకు సేవలను వినియోగించుకోవాలన్నారు. నారా లోకేష్ స్పందిస్తూ…ప్రజలను ఇబ్బందిపెట్టి రాక్షసానందం సైకోపాలకుడి లక్షణం. జగన్మోహన్ రెడ్డికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా, స్వయం ఉపాధి పొందుతున్న మీ-సేవా నిర్వాహకులను ఇబ్బందులకు గురిచేయడం దారుణం. జగన్ అనాలోచిత చర్యల కారణంగా దేశంలోనే నిరుద్యోగంలో రాష్ట్రాన్ని మొదటిస్థానంలో నిలిపారు. టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీ-సేవా నిర్వాహకుల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సర్వీసులను అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు సేవలందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
13). బెల్లం విక్రయాలపై ఆంక్షలు ఎత్తివేస్తాం..చెరకు రైతులకు లోకేష్ హామీ
అనకాపల్లి రింగ్ రోడ్డులో బెల్లం వ్యాపారులు, రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనకాపల్లి బెల్లం మార్కెట్ ఆసియాఖండంలో అతిపెద్ద 2వ మార్కెట్ గా ఉంది. ప్రభుత్వం నల్లబెల్లంపై ఆంక్షలు విధించడంతో బెల్లంరేటు పూర్తిగా పడిపోయింది. ఈ కారణంగా మార్కెట్ పై ఆధారపడిన సుమారు 800 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆంక్షలు ఎత్తివేసి రైతులు, కార్మికులకు ఉపశమనం కలిగించాలి. టిడిపి హయాంలో మా ప్రాంత రైతుల సంక్షేమం కోసం డ్యామ్ నిర్మించారు, దీనివల్ల 28,500 ఎకరాలకు నీరు అందుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక డ్యామ్ నిర్వహణను గాలికొదిలేయడంతో గేట్లు పాడైపోయాయి. డ్యామ్ కు ఆనుకుని ఉన్న కాలువలు పూర్తిగా మట్టితో నిండిపోయాయి..పూడిక కూడా తీయడం లేదు. ఈ కారణంగా డ్యామ్ పై ఆధారపడ్డ పొలాల్లో పంటలు పండిరచడం కష్టమైపోతోంది. ఇటీవల వచ్చిన మిచౌంగ్ తుఫానువల్ల వేలాది ఎకరాల్లో పంట పాడైపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. మీరు అధికారంలోకి వచ్చాక డ్యామ్ కు మరమ్మతులు చేయించాలి. ప్రకృతి విపత్తుల్లో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. కాలువల పూడిక తీయించి రైతుల పంటలను కాపాడాలని అన్నారు.
నారా లోకేష్ స్పందిస్తూ…జగన్మోహన్ రెడ్డి విధ్వంసక, అనాలోచిత విధానాల కారణంగా అనకాపల్లి బెల్లం మార్కెట్ పై ఆధారపడిన వేలాది రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. సైకో పాలనలో రాష్ట్రం ఏ ఒక్క వర్గానికి కంటినిండా కునుకు, కడుపునిండా భోజనం చేసే పరిస్థితి లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్లం విక్రయాలపై ఆంక్షలు ఎత్తివేసి అనకాపల్లి బెల్లం మార్కెట్ కు గత వైభవం తెస్తాం. జగన్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాలువపూడిక తీసి, రైతులకు ఉపయోగకరంగా తీర్చిదిద్దుతాం. డ్యామ్ కు మరమ్మతులు చేయించి గేట్లను బాగుచేయిస్తాం. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటాం. అన్నదాత పథకం కింద ప్రతిరైతుకు ఏటా రూ.20వేల రూపాయల ఆర్థికసాయం అందిస్తామన్నారు.