- టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారానికి కృషి
- మీ సేవ నిర్వాహకులు, ఆశావర్కర్లకు అచ్చెన్నాయుడు హామీ
- టీడీపీలో చేరిన పలువురు వైసీపీ కార్యకర్తలు
టెక్కలి (చైతన్యరథం): నమ్మించి మోసం చేయడం, మాట తప్పడం, మడమ తిప్పడం జగన్రెడ్డి నైజమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించా రు. ఒక్కఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్.. రాష్ట్రంలోని అన్ని రంగాలను సర్వనాశనం చేశాడని మండిపడ్డారు.టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజ లు గుర్తించారని, తాము అధికారంలోకి వచ్చినవెంటనే ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని అచ్చెన్నా యుడు హామీఇచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి టీడీపీ కార్యాలయంలో పలువురు మీసేవ నిర్వా హకులు, ఆశావర్కర్లు కలిసి తమ ప్రయోజనాలు కాపా డాలని అచ్చెన్నాయుడుకు వేరువేరుగా వినతిపత్రాలు అందజేశారు. ప్రతినిత్యం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెం పొందించుకుంటూ ప్రజలకు సేవలందిస్తున్న మీ సేవ నిర్వాహకులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గాలికొది లేసిందని అవేదన వ్యక్తంచేశారు. దీంతో మా బతుకులు రోడ్డున పడ్డాయి.. తమను ఆదుకోవాలని పలువురు మీసేవ నిర్వహకుల సంఘం నేతలు అచ్చెన్నాయుడును కలిసి వినతిపత్రం అంద జేశారు. తమని ఆదుకుని తమ జీవితాలలో వెలుగు నింపేలా టీడీపీ ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు. మరోపక్క తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, జగన్రెడ్డి నమ్మించిమోసం చేశారని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఆశావర్క ర్లును ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం పలువురు ఆశా వర్కర్లు అచ్చెన్నాయుడుకు వినతిపత్రం అందజేశారు.
అచ్చెన్న సమక్షంలో పార్టీలోకి పులువురు చేరిక..
సొంబొమ్మాళి మండలం నర్సాపురం పంచాయతీ ఆనందపురం గ్రామానికిచెందిన పలువురు వైసీపీ కార్య కర్తలు శుక్రవారం టీడీపీ రాష్ట్రఅధ్యక్షుడు అచ్చె న్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి అచ్చెన్నాయుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. వచ్చే ఎన్నికల్లో సమష్టిగా కృషి చేసి టీడీపీని గెలిపించాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.