- ఎన్నికల్లో దిమ్మతిరిగే ఫలితం రాబోతోంది
- షెడ్యూల్ రాకతో జనంలో కేరితలు
- ఉన్మాదుల నుండి స్వాతంత్య్రం వచ్చినంత భావన
- జూనియర్ న్యాయవాదులకు రూ.7వేల గౌరవ వేతనం
- రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తా
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్నూ రద్దు చేస్తాం
- లీగస్ సెల్ సమ్మిట్‌లో చంద్రబాబునాయుడు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర విధ్వంసకుడు జగన్ పనైపోయింది. ఎన్నికల్లో జగన్‌కు దిమ్మతిరిగే ఫలితం రాబోతోంది’ అని తెలుగుదేశం పార్టీ జాతీయా ధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఉన్మాదుల నుండి స్వాతంత్య్రం వచ్చినంత ఆనందంగా ప్రజలు పండుగ చేసుకుంటున్నారని, ప్రజలు ఆనందంగా రోడ్లపైకి వస్తు న్నారని వ్యాఖ్యానించారు. విజయవాడ లబ్బీపేటలొని ఎస్ఎస్ కన్వెన్షన్ హాలులో టీడీపీ లీగస్ సెల్ ఆధ్వర్యం లో శనివారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల సమ్మిట్ లో చంద్రబాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాగానే న్యాయమిత్ర పేరుతో నెలకు రూ.7 వేలు జూనియర్ న్యాయవాదులకు గౌరవ వేతనం ఇస్తామని ఆనందోత్సాహాల మధ్య ప్రకటించారు. లా నేస్తం పేరుతో జగన్ కేవలం 2,670 మందికే గౌరవ వేతనం ఇచ్చారని, తమ ప్రభుత్వం వచ్చాక 3,500 మందికి పెంచుతామని భరోసా ఇచ్చారు. లాయర్లకు కార్పస్ ఫండ్ కింద రూ.100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ‘రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో లీగల్ సెల్ వర్క్ షాప్‌లు పెట్టుకోవాల్సి వస్తోంది.
నా నామినేషన్‌ను కార్యకర్తలు, న్యాయవాదులే వేసేవారు. కేవలం డిక్లరేషన్ పత్రంపైనే సంతకం చేసేవాడిని. కానీ నేడు నాపై ఎన్నికేసులున్నాయో ముందుగానే డీజీపీని, అధికారులను లేఖల ద్వారా అడిగే పరిస్థితి. అడగకపోతే ఎప్పుడు దొంగ కేసులు పెట్టారో తెలియదు. నామినేషన్ వేయాలనుకునే ప్రతి అభ్యర్థి తనపై ఎన్ని కేసులు ఎన్నాయో చెప్పండి అని అడుక్కునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. రాజ్యాంగంలో శాసన, కార్యనిర్వహక, మీడియా ప్రధానమైనవి. ఇవి గాడి తప్పితే మళ్లీ గాడిలో పెట్టేది న్యాయ వ్యవస్థే. న్యాయ వ్యవస్థ లేకుండా మనం ఇక్కడ ఉండేవాళ్లం కాదు. నాతో పాటు మా లాయర్లు కూడా నిద్రలేని రాత్రులు గడిపారు. ప్రతి శుక్రవారం రాష్ట్రంలో ప్రొక్లెయిన్లు వస్తాయి. ఇల్లీగల్ కస్టడీకి కూడా తీసుకున్నారు’ అని చంద్రబాబు తీవ్రస్వరంగా అన్నారు.
కేంద్రం, రాష్ట్రంలో ఏర్పడేది ఎన్డీయే ప్రభుత్వాలే
నా పాలనలో లాయర్లపై దాడులు జరగలేదు. కానీ ఇప్పుడు చూశాను. లాయర్లే కోర్టుకు వెళ్లి దాడులు జరుగుతున్నాయని చెప్పుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అన్నారు. అలాగే, నామినేషన్లు వేయడానికి వీల్లేని పరిస్థితిని స్థానిక సంస్థల ఎన్నికల నుంచి చూస్తున్నా మని, బెదిరింపులు, భయపెట్టడాలు, నామినేషన్ వేయ డానికి అవసరమైన సర్టిఫికేట్లు అందకుండా చేయడం లాంటి దురాగతాలు సాగుతున్నాయన్నారు. అన్నీ దాటుకుని నామినేషన్ వేస్తే స్క్రూటినీలో తొలగిస్తారని, దాన్ని దాటుకుని వెళ్తే ఫలితాలు వారికి అనుకూలంగా వేసుకుని గెలిచిన వాళ్లను ఓడగొడతారని వైసీపీ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషర్‌కే దిక్కులేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, రక్షణ కోసం కేంద్ర సాయాన్ని కోరే పరిస్థితి ఏర్పడిరదన్నారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు ఇష్టానుసారంగా వేసుకున్న వైనాన్ని గుర్తు చేస్తూ.. మనమంతా ఎలాంటి పాలనలో ఉన్నామో ఆలోచించా లన్నారు. వీటికి అంతం పలకపోతే అభివృద్ధి ఉండదు. ప్రజల గెలవాలి. రాష్ట్ర నిలవాలి అన్న నినాదంతో టీడీపీ, జనసేన, బీజేపీ ముందకు వెళ్తున్నాయన్నారు. ఆదివారం ప్రధానితో ప్రజాగళం సభను చిలకలూరి పేటలో నిర్వహిస్తున్నామని, కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు రాబోతున్నయని ధీమా వ్యక్తం చేశారు. ‘ఈ రోజు వరకు ఒక ఎత్తు. ఇప్పటి నుండి ఒక ఎత్తు. రోడ్ల పైకి వచ్చిన వాళ్లకు పథకాలు కట్ చేయడం కాదు, ప్రజలే జగన్‌కు ఇక పవర్‌కట్ చేస్తారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తున్నాయి. నూటికి వెయ్యి శాతం ఎన్డీయే గెలవ బోతోందని ధీమాగా చెప్పారు. కేంద్రంలో 400 పైచిలుకు లోక్‌సభ సీట్లతో కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రాబోతుందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూలేని మెజారిటీతో తెదేపా, జనసేన, బీజేపీ గెలవబోతున్నాయన్నారు. కోల్పోయిన దాన్ని భర్తీ చేసుకునే రోజులు త్వరలో రాబోతున్నాయని చంద్ర బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం 2047 విజన్ తో దూసుకుపోతుంటే, రాష్ట్రాన్ని జగన్ దుర్మార్గుడు రాతియుగం వైపు తీసుకెళ్తున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని కాపాడటం మా మూడు పార్టీల బాధ్యతే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. స్వాతంత్య్రం కోసం పోరాడిన విధంగా… ఉన్మాది పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడటానికి మేధావులంతా కలిసి రావాలి.
ఐదేళ్లు ఒక ఎత్తు. రాబోయే 57 రోజులు ఒకెత్తు. రాజకీయాలు, మతం, ప్రాంతం కాదు, పిల్లల భవిష్యత్ బాగుండాలంటే దుర్మార్గ పాలనను అంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. లాయర్లకు జగన్ పభుత్వం చేసిందేమీ లేదన్నారు. లాయర్లకూ స్వయర్ణయుగం చూపించే పాలన తీసుకొస్తామని, రూ.5 లక్షలదాకా మెడికల్ క్లెయిమ్, రూ.15 లక్షల ప్రమాద బీమాకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. న్యాయం కోసం పోరాడే లాయర్లకు ఇళ్ల స్థలాలిచ్చేందుకూ ప్రయత్నిస్తామన్నారు. జగన్ సర్కారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు తెచ్చిందో అర్థం కావడం లేదన్నారు. దుర్మార్గుడి చేతుల్లో టెక్నాలజీ ఉంటే ఏవిధంగా ఇబ్బందులుంటాయో జగన్ పాలన ఒక ఉదాహరణ అన్నారు.
అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం. ఏపీపీఎస్సీలో ఏవిధంగా అక్రమాలకు పాల్పడ్డారో చూశాం. చేయని తప్పునకు మా వాళ్లను స్టేషన్లో పెట్టిన నాడు నిద్ర పట్టేదికాదు. ఎంపీ రఘురామకృష్ణరాజును టార్చర్ పెట్టారు. మనం కాపాడకపోతే చంపేసేవారు. రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరుగుతుంది. రాబోయే 57 రోజుల తర్వాత చరిత్ర తిరిగరాయబోతున్నాం. ఎన్నికల కోడ్ వచ్చింది. కాలర్ ఎగరేసుకుని బటయకు రండి. రాష్ట్రంలో ఇక ప్రకంపనలే కనబడతాయి. రాష్ట్రాన్ని కాపాడటానికి అడ్వకేట్లూ బాధ్యత తీసుకోవాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.