- రాజ్యాంగ విలువలకు కట్టుబడే అతడితో మాట్లాడా
- కూటమి గెలుపు, జగన్ ఓటమిలో రచ్చబండ కీలక పాత్ర
- చంద్రబాబు, జగన్ వ్యవహార శైలి మధ్య అసలు పొంతనే లేదు
- అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుందనడంలో అతిశయోక్తి లేదు
- మీడియా ప్రతినిధులతో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు
అమరావతి(చైతన్యరథం): జగన్ రాజకీయ విరోధి కాదు…ప్రత్యర్థి మాత్రమేనని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడే ఆయనతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడానని తేల్చి చెప్పారు. మంగళవా రం ఢిల్లీలో ఆయన ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్మోహన్‌రెడ్డితో తన వ్యక్తిగత పోరాటం కొనసాగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డిపై తాను దాఖలు చేసిన పిటిషన్ బుధవారం కోర్టు ముందు విచారణకు రానుందని తెలిపారు. ఒక ఎమ్మెల్యేగా, నా సహచర ఎమ్మెల్యే జగన్మోహన్‌రెడ్డితో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా అసెంబ్లీకి హాజరుకావాలని సూచించాను. హాజరవుతానని ఆయన నాతో చెప్పారు. రాష్ట్రంలో కూటమి గెలుపునకు, జగన్మోహన్ రెడ్డి ఓటమిలో రచ్చబండ కార్యక్రమం ప్రముఖమైన పాత్ర పోషించిందని తెలిపారు.
అమరావతి అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని నేను కచ్చితంగా చెప్పగలనని తెలిపారు. జగన్‌ది డిస్ట్రక్టివ్ విజన్ అయితే చంద్రబాబుది కన్‌స్ట్రక్టివ్ విజన్ అని పేర్కొన్నారు. వారిద్దరి మధ్య అసలు పొం తనే లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో సూపర్ సిక్స్ హామీల అమలే కాకుండా వ్యక్తిగతంగా ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆక్రమణకు గురైన పార్కు స్థలాన్ని తిరిగి స్థానికుల సహకారంతో అభివృద్ధి చేశామని, ఈ నెల 15న కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఇప్పటికే నాకు మంత్రి పదవి, స్పీకర్ పదవి, టీటీడీ చైర్మన్ పదవి ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఏ పదవి ఇచ్చినా దానికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తానన్న ఆయన పదవి రాకపోయినా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.