- ప్రగతికాముకుడు కాదు, విఘాతకుడు
- బిడ్డ కాదు.. రాష్ట్రానికే క్యాన్సర్ గడ్డ
- ఓటుతో శస్త్రచికిత్స చేయాల్సింది మీరే
- ఐదేళ్లలో రాష్ట్రం దివాళా తీయించారు
- వైసీపీ పాలనలో అంతా బాధితులే..
- అన్న క్యాంటీన్లను మాయం చేశాడు..
- అతను పేదల ప్రతినిధి ఎలాగవుతాడు?
- బాబు ఏంచేశారని అడుగుతున్నాడు..
- నేనువేసిన బీజమే ఈనాటి అభివృద్ధి
- వైసీపీని కుప్పకూల్చేది రాష్ట్రప్రజలే..
- బాధితవర్గాలే నా స్టార్ కాంపెయినర్లు
(పేదవాడినని చెప్పుకుంటున్న జగన్.. నిజంగా పేదవాడా? తాడేపల్లి, బెంగళూరు, పులివెందుల, హైదరాబాద్, రుషికొండలో వందల కోట్లతో ప్యాలెస్‌లు కట్టుకున్నవాడు పేదవాడా? అన్న క్యాంటీన్లు తీసేసిన వ్యక్తి పేదవాడి ప్రతినిధా? జగన్ పేదవాడు కాదు, అసలైన పెత్తందారు. చంద్రన్న కానుకలు, విదేశీ విద్య, రైతుల సబ్సీడీలు తీసేసిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి )
రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసం. తుగ్లక్ విధానాలతో అతలాకుతలం. ఐదేళ్లలో రాష్ట్రం దారుణంగా దెబ్బతినడానికి కారణం `అనుభవంలేని జగన్ పాలన. అతను అర్జునుడో అభిమన్యుడో కాదు, భస్మాసురుడు.. విధ్వంసకుడు. ఓట్లేసిన ప్రజల నెత్తిన చేతులు పెడుతున్న ఘనుడు. అందుకే `‘సిద్ధం’అంటూ మీటింగ్ పెడితే వైకాపా నేతలే పారిపోతున్నారు. ఇది చాలదా? వైసీపీ భవిష్యత్ అంచనావేయడానికి.
రాష్ట్రానికి నేనేం చేశానని జగన్ అడుగుతున్నాడు. అతను కన్ను తెరవకముందే ఆంధ్ర అభివృద్ధికి బీజమేసినవాడిని. ఆ విషయం ప్రజలకూ తెలుసు. ఆ బీజాలే `ఇప్పుడు పరిపుష్ట ప్రగతిగా గోచరిస్తుంది. నేను వేసిన పునాధులపైనే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ప్రజా జీవితాల్లో కనిపిస్తున్న మార్పే అందుకు తార్కాణం.
ఆంధ్రను ప్రపంచానికి అనుసంధానించటం కాదు, అగ్రస్థానాన నిలబెట్టే బాధ్యత తీసుకున్నా. పేదల ఆర్థిక బలోపేతమే నా అంత:కరణ అజెండా. ఆశయ సంకల్పం, నిర్మాణాత్మక ఆలోచనలతో ఆ రోజుకు చేరడం అంత కష్టం కాదు. రాష్ట్ర భవిష్యత్ కోసమే వైసీపీ నేతలకూ పిలుపునిస్తున్నా.. రా కదలి రా అని.
అమరావతి, చైతన్యరథం ప్రతినిధి: జగన్ అభిమన్యుడూ కాదు, అర్జునుడూ కాదు. ఓట్లేసిన ప్రజల నెత్తిన చేతులుపెట్టే భస్మాసురుడు అని చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. నెల్లూరులో జరిగిన రా.. కదలిరా బహిరంగ సభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ అబద్ధాలతో ప్రజలను మోసం చేసి మరోసారి అధికారంలోకి రావడానికి జగన్మోహన్‌రెడ్డి ఆరాటపడుతున్నాడని విమర్శించారు. వైకాపా పాలనలో రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిందని, ఐదేళ్లలో అందరూ బాధితులే అన్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని జగన్ దుర్వి నియోగం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి చూస్తుంటే ` అసలు ప్రభుత్వముందా? అన్న సందేహం తలెత్తుతుందన్నారు. అమర్ రాజా బ్యాటరీస్ లాంటి పరిశ్రమలు రాష్ట్రంనుంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. గల్లా జయదేవ్‌లాంటి వ్యక్తులు రాజకీయాల నుంచి విరమించుకునే పరిస్థితులూ జగన్ నియంత పాలనవల్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల నియోజకవర్గంలో పోలీసుల వేధింపులు భరిం చలేక దుర్గారావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసు కోవడం, జగన్ రాక్షస పాలనకు నిదర్శనమన్నారు.
రాష్ట్రానికి నేనేం చేశానని జగన్ ప్రశ్నించటం.. అతని రాజకీయ అవగాహనా లేమికి నిదర్శనం. జగన్ కళ్లు తెరవకముందే రాష్ట్రంపై చంద్రబాబు మార్క్ ఉంది. ఆనాడు నేను వేసిన బీజమే.. ఈనాటి రాష్రాభి వృద్ధి. ఆ విషయాన్ని ఎవర్నడిగినా చెబుతారు. నేను వేసిన ఫౌండేషన్‌పైనే అందరూ పాలించారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీయే. ఈమాట నేను కాదు, 80దేశాల్లో నివసిస్తున్నవారు ముక్తకంఠంతో చెప్పే మాట. విభజన తర్వాత అమరావతి, పోలవరం పూర్తికి కృషిచేశాం. రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకువచ్చాం. ఇదంతా జగన్ కంటికి కనిపించటం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను తరిమేయడం తప్ప జగన్ సాధించిందేమిటని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని ప్రపంచ అగ్రగామి చేస్తా
ఆంధ్రను ప్రపంచానికి అనుసంధానించటం కాదు, అగ్రస్థానాన నిలబెట్టే బాధ్యత తీసుకున్నా. పేదల ఆర్థిక బలోపేతమే నా అంత:కరణ అజెండా. ఆశయ సంకల్పం, నిర్మాణాత్మక ఆలోచనలతో ఆ రోజుకు చేరడం అంత కష్టం కాదు. ఈ విషయంలో తెలుగు దేశం పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. నేడు ఎక్కడ చూసినా విధ్వంసం, తుగ్లక్ విధానాలతో రాష్ట్రం అతలాకుతలం అయ్యిందన్నారు. రేపటి పౌరుల కోసం, ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కోసమే ‘‘రా కదలి రా’’ పిలుపునిచ్చాం అన్నారు. జగన్‌రెడ్డి కూడా ‘సిద్ధం’ అంటూ సభలు పెడుతున్నారని, జగన్‌రెడ్డి సిద్ధం అనగానే వైైకాపా నేతలు పారిపోతున్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం వైకాపా నేతలకూ ‘‘రా కదలి రా’’ పిలుపునిస్తున్నా అన్నారు.
జగన్ ఏ రకంగా పేదవాడు?
పేదవాడని చెప్పుకుంటున్న జగన్.. నిజంగా పేదవాడా? అంటూ ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లు తీసేసిన వ్యక్తి పేదవారి ప్రతినిధా? అని నిలదీస్తూ.. జగన్ పేదవాడు కాదు, పెత్తందారని దుయ్యబట్టారు. చంద్రన్న కానుకలు, విదేశీ విద్య, రైతుల సబ్సీడీలు తీసేసిన వ్యక్తి జగన్‌రెడ్డి. తనకు ఇల్లే లేదంటున్నాడు. తాడేపల్లి, బెంగళూరు, పులివెందుల, హైదరాబాద్, రుషికొండలో రూ.500 కోట్ల ప్యాలెస్‌లు కట్టుకోలేదా? అని నిలదీశారు.
ఏటా జాబ్ కేలండర్, డీఎస్సీ అని హామీ ఇచ్చి మాట తప్పాడని, వాలంటీర్లు, ఫిష్ మార్కెట్లో ఉద్యోగాలు ఇచ్చానని చెప్పడం అసలు వైఫల్యాలు దాచి మోసం చేయడమేనన్నారు. దేశంలోనే అత్యంత నిరుద్యోగమున్న రాష్ట్రంగా ఏపీ ఉందన్నారు. తన హయాంలో 99శాతం హామీలు నెరవేర్చానని జగన్ చెబుతున్నది పెద్ద అబద్ధంకాదా అని నిలదీశారు. మద్యపాన నిషేధం ఏమైంది? 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. దిశ చట్టమే లేకుండా చేశారు. ఇవేనా 99 శాతం హామీల అమలంటూ చంద్రబాబు నిలదీశారు. సొంత బ్రాండ్ల పేరిట నాసిరకం మద్యంతో జగన్ సర్కారు ప్రజల రక్తం తాగడమే కాదు, వేలాది ప్రజల ప్రాణాలు తీసిందన్నారు.
టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికీ ఉద్యోగమిస్తామని భరోసానిచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, క్రమం తప్పకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ప్రభత్వోద్యోగాలు కల్పిస్తామన్నారు. ఉద్యోగం వచ్చేవరకు యువతకు ప్రతి నెలా రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.
పట్టా పుస్తకంపై జగన్ బొమ్మా?
పట్టాదారు పాసు పుస్తకంపైనా, సర్వే రాళ్లపైనా జగన్‌రెడ్డి బొమ్మ వేసుకోవడం చూస్తుంటే పాలకుడి వెర్రి ఏస్థాయికి వెళ్లిందో అర్థమవుతుంది. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు. పెండిరగ్ బిల్లులతో పేద వారిని వంచిస్తున్నారు. మేం మహాప్రస్థానం పెడితే.. నేడు ద్విచక్ర వాహనాలపై మృతదేహాలను తరలించే పరిస్థితి. కాన్పుల కోసం డోలు కట్టుకుని వెళ్లే పరిస్థితి. టిడ్కో ఇళ్లను పూర్తిచేయకుండా వంచించారు. రాష్ట్రాన్ని ఇంత దారుణ స్థితికి తెచ్చిన జగన్ సర్కారును దేవుడు కూడా కాపాడలేడు.వచ్చే ఎన్నికల్లో వైసీపీ పతనం ఖాయం. జగన్‌రెడ్డి పాలనలో బాధితులంతా స్టార్ క్యాం పెయినర్లు కావాలి. ఐదు కోట్ల ప్రజలూ స్టార్ క్యాంపె యినర్లై.. జగన్ సర్కారును భూస్థాపితం చేస్తామని శప థం చేయాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఏ వర్గం ఆనందంగా లేదు
జగన్ పాలనలో ఏ వర్గం ఆనందంగా లేదు. రైతులు, ఆక్వా రైతులు చితికిపోయారు. ఇటు ధాన్యం కొనే పరిస్థితి లేదు. అరకొర కొనుగోళ్లలోనూ కమీషన్లు. ఆక్వా రంగం సైతం కుదేలైంది. రైతులు అప్పులపాలైన రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండోస్థానం, రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో రాష్ట్రాన్ని నిలిపిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. అధికారంలోకి రాగానే `రైతాంగం, ఆక్వారంగాన్ని పునరుద్ధరించే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ప్రజల బిడ్డ కాదు..
క్యాన్సర్ గడ్డ
ప్రజల బిడ్డనని చెప్పుకుంటున్న జగన్.. ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డని చంద్రబాబు దుయ్య బట్టారు. శస్త్రచికిత్స చేసి ఆ గడ్డను తీసేయాల్సిన బాధ్యత ప్రజల దేనన్నారు. ప్రజలు ఫ్యాన్ రెక్కలు విరిచేసి, రివర్స్ గేర్ పాలనకు రివర్స్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత తీసుకోవాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ సర్కారు చేసిందేమీ లేదని, టీడీపీ హయాంలో ఆయావర్గాల ఆర్థికాభివృద్దికి కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ అక్ర మాలను ప్రశ్నించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై వేధింపులకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు.
పెట్రోల్ రేట్లు దేశంలోనే అధికంగా రాష్ట్రంలోను ఉన్నాయన్నారు. ఆటో జీవనాధార వ్యక్తులు ఏడాదికి రూ.24వేలు పెట్రోల్ కోసం అదనంగా ఖర్చు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. పది వేలు రిపేరు ఛార్జీలు, ఫైన్‌ల పేరిట దోపిడీతో ఆటోవాలాలను వేధిస్తున్నారు. ఒక్కో ఆటో కార్మికుడిపై అదనంగా రూ.50వేలు భారం మోపి, వాహనమిత్ర పేరిట రూ.10వేలు ఇస్తున్నారన్నా రు. పదిలక్షల మంది లబ్దిదారులుంటే, 2.6 లక్షల మందికే పథకాన్ని అమలు చేసిన విషయం గుర్తు చేశారు. ఇచ్చిన దానికంటే దోచుకుంటున్నదే ఎక్కువని, ఇదీ జగన్ దోపిడీ విధానమన్నారు. టీడీపీ పాలనలో క్లీనర్ లారీ ఓనరైతే.. జగన్‌రెడ్డి పాలనలో ఓనరు క్లీనరయ్యాడంటూ ఛలోక్తి విసిరారు.